iDreamPost
android-app
ios-app

OTT Suggestion : భర్త కోసం ఎదురుచూస్తూ భార్య .. కానీ చివరికి భర్త! OTT లో సస్పెన్స్ థ్రిల్లర్

  • Published Jun 27, 2024 | 9:27 PM Updated Updated Jun 27, 2024 | 9:27 PM

OTT Telugu Suspense Thriller: వారం వారం ఓటీటీ లో ఎన్నో కొత్త సినిమాలు వస్తున్నాయి. ఇక ఈ మధ్య కాలంలో తెలుగులో కూడా ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇలాంటిదే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Telugu Suspense Thriller: వారం వారం ఓటీటీ లో ఎన్నో కొత్త సినిమాలు వస్తున్నాయి. ఇక ఈ మధ్య కాలంలో తెలుగులో కూడా ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇలాంటిదే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

  • Published Jun 27, 2024 | 9:27 PMUpdated Jun 27, 2024 | 9:27 PM
OTT Suggestion : భర్త కోసం ఎదురుచూస్తూ భార్య .. కానీ చివరికి భర్త! OTT లో సస్పెన్స్ థ్రిల్లర్

అటు థియేటర్ లో కానీ ఇటు ఓటీటీ లో కానీ ఎన్నో మంచి మంచి సినిమాలు.. ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక ఇప్పుడు ప్రేక్షకులు ఓటీటీ లకు బాగా అలవాటు పడిన విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారం వారం వచ్చే సినిమాలనే కాకుండా.. అప్పుడప్పుడు ఇంకా ఏమైనా మంచి మూవీస్ ఓటీటీ లో ఉన్నాయేమో అని సెర్చ్ చేస్తూ ఉంటారు. అటువంటి వారికోసమే ఈ మూవీ సజ్జెషన్. హాలీవుడ్ , బాలీవుడ్ లోనే కాకుండా తెలుగులో కూడా ఎన్నో మంచి సినిమాలను.. కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు మేకర్స్. ఇప్పటివరకు తెలుగులో కూడా ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

ముందు అసలు ఈ సినిమా స్టోరీ లైన్ చూస్తే.. ఈ సినిమా ఏంటి అనే విషయం క్లారిటీ వచ్చేస్తుంది.. ఈ సినిమాలో సత్య భామ అనే అమ్మాయికి ఒక అతనితో పెళ్ళి అవుతుంది. కానీ పెళ్ళైన కొద్దీ రోజులకే ఉద్యోగ రీత్యా సత్య భర్త ఆమెను వదిలేసి విదేశాలకు వెళ్ళిపోతాడు. దీనితో తన భర్త కోసం నెలల తరబడి వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా నెలలు గడిచిపోతున్న క్రమంలో.. ఓ రోజు సత్య భర్త కాల్ చేసి.. సత్యను చూడడానికి ఇంటికి వస్తున్నా అని చెప్తాడు. దీనితో సత్య సంతోషం పట్టలేక ఈ విషయాన్నీ తన తల్లికి, పక్కింటి బామ్మతోను చెప్తుంది. ఇంట్లో సత్య ఒక్కతే ఉండడంతో.. సరిగ్గా అదే సమయంలో సత్య.. బావ తాగేసి వచ్చి గొడవ చేస్తాడు.. ఊరు చివరన అమెరికా నుంచి వచ్చిన ఎవరో ఒక అతను పడిపోయి ఉన్నాడని చెప్తాడు. దీనితో సత్య కంగారు పడుతుంది. ఆమె తన భర్తకు కాల్ చేయగా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇంతలో వేరే నంబర్ నుంచి ఒక లేడీ కాల్ చేసి.. సత్య హస్బెండ్ గురించి చెప్తుంది. అసలు ఆమె భర్తకు ఏం జరిగింది ! ఆ తర్వాత కథ ఎలా ముందుకు సాగింది ! ఆ భార్య భర్తలిద్దరూ కలిశారా లేదా ! చివరకు ఏమైంది ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

ఈ సినిమా పేరు “రారా పెనిమిటి”. ఈ సినిమాలో సత్య క్యారెక్టర్ లో నటించింది మరెవరో కాదు.. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ హర్రర్, కామెడీ చిత్రంతో పరిచయం అయిన నందిత శ్వేత. రెగ్యులర్ సినిమాలా అనిపించినా కూడా.. మధ్య మధ్యలో కొన్ని సీన్స్ కాస్త ఇంట్రెస్టింగ్ గా తర్వాత ఏం జరుగుతుందా అనే ఆసక్తిని కలిగిస్తూ ఉంటాయి. ఇక ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. రెగ్యులర్ హర్రర్ , సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ చూసి బోర్ కొట్టి.. షార్ట్ అండ్ స్వీట్ భార్య భర్తల కథను చూడాలంటే మాత్రం ఈ సినిమా గుడ్ ఛాయిస్ అని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరు చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.