iDreamPost
android-app
ios-app

ఐదుగురు భార్యలతో హనీమూన్.. టీజర్ తోనే పిచ్చెక్కించారు.. OTTలోకి ఎప్పుడంటే?

  • Published Jun 27, 2024 | 10:04 PM Updated Updated Jun 27, 2024 | 10:04 PM

Nagendrans Honeymoons Teaser Out now: మలయాళం ఇండస్ట్రీలో సూరజ్ వంజ్రమూడుకి మంచి స్టార్డమ్ ఉంది. ఆయన చేసే సినిమాలు నెక్ట్స్ లెవల్లో ఉంటాయి. అలాంటి ఒక క్రేజీ స్టోరీతో ఇప్పుడు సూరజ్ రాబోతున్నాడు.

Nagendrans Honeymoons Teaser Out now: మలయాళం ఇండస్ట్రీలో సూరజ్ వంజ్రమూడుకి మంచి స్టార్డమ్ ఉంది. ఆయన చేసే సినిమాలు నెక్ట్స్ లెవల్లో ఉంటాయి. అలాంటి ఒక క్రేజీ స్టోరీతో ఇప్పుడు సూరజ్ రాబోతున్నాడు.

  • Published Jun 27, 2024 | 10:04 PMUpdated Jun 27, 2024 | 10:04 PM
ఐదుగురు భార్యలతో హనీమూన్.. టీజర్ తోనే పిచ్చెక్కించారు.. OTTలోకి ఎప్పుడంటే?

సాధారణంగా మీరు నెట్టింట ఎప్పుడూ కొన్ని మీమ్స్, కోట్స్ చూస్తూ ఉంటారు. ఒకసారి పెళ్లైన వ్యక్తి మరోసారి ఆ సాహసం చేయడు అని. బుద్ధున్నోడు ఎవడైనా రెండోసారి పెళ్లిపీటలు ఎక్కుతాడా అని సూక్తులు చెప్తూ ఉంటారు. మరికొంత మంది జీవితం మీద విరక్తి చెందితే పెళ్లి చేసుకో అని జోకులు కూడా వేస్తూ ఉంటారు. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకసారి పెళ్లి చేసుకోవడం కూడా కొంతమందికి సాధ్యం కావడం లేదు. అందుకు కారణంగా అమ్మాయిలు దొరక్కపోవడం. అయితే ఈ మహానుభావుడు మాత్రం ఏకంగా ఐదుగురిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకోవడమే కాదండోయ్ హనీమూన్స్ కి కూడా వెళ్తాడు. అందుకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు.

ప్రస్తుతం మలయాళం ఇండస్ట్రీ నుంచి రాబోతున్న ఒక మూవీ గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. చర్చే కాదు.. అభిమానులు అయితే ఈ మూవీ కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. అది మరేదో కాదు.. ‘నాగేంద్రన్స్ హనీమూన్స్’. ఈ మూవీలో మలయాళం స్టార్ యాక్టర్ సూరజ్ వెంజరమూడు హీరోగా యాక్ట్ చేశాడు. సూరజ్ సినిమాలు అంటే షూర్ షాట్ హిట్టు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఎంచుకునే కథలు అలా ఉంటాయి. ఈసారి కూడా అలాంటి ఒక క్రేజీ కాన్సెప్ట్ తోనే వస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా గురించి చాలానే బజ్ వచ్చేసింది. ఇప్పుడు టీజర్ వచ్చిన తర్వాత ఆ బజ్ రెండింతలు అయ్యింది.

ఈ మూవీలో సూరజ్ వెంజరమూడు ఎంచుకున్న పాత్ర చాలా కొత్తగా ఉంది. అతని గోల్ విదేశాలకు వెళ్లడం. అందుకు చాలానే ప్రయత్నాలు చేస్తాడు. అయితే అందుకు ఒక చక్కని మార్గం ఉందని తన మిత్రుడు సలహా ఇస్తాడు. అదేంట్రా అంటే.. పెళ్లి చేసుకోవడం. అయితే మన హీరో మాత్రం ఏకంగా ఐదుగురిని వివాహం చేసుకుంటాడు. వాళ్లందరితో కలిసి ఒకేసారి హనీమూన్ కి వెళ్తాడా? ఒక్కొక్కరితో ఒక్కోసారి హనీమూన్ కి వెళ్తాడా? అనేది మాత్రం తెలియాలి అంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే. ప్రస్తుతానికి టీజర్ లో మాత్రం ఈ మూవీలో ఉన్న అందరినీ రివీల్ చేశారు. సూరజ్ కి ఐదుగురు భార్యలుగా చేసిన హీరోయిన్స్ ఎవరంటే.. శ్వేతా మేనన్, కని కుస్రుతి, గ్రేస్ ఆంటోనీ, అమ్ము అభిరామి, నిరంజన అనూప్ లు చేశారు.

ఒక్కో ఆర్టిస్ట్ సెలక్షన్ కూడా టాప్ నాచ్ అనే చెప్పాలి. ఐదుగురు భార్యల పాత్రలు కూడా నెక్ట్స్ లెవల్లో ఉండబోతున్నాయి. వారందరి కంటే సూరజ్ పాత్ర మాత్రం మరో స్థాయిలో ఉంటుదంని టీజర్ చూస్తే చెప్పేయచ్చు. ఎంతో అమాయకంగా అతను పలికిస్తున్న హావభావాలు మెప్పిస్తున్నాయి. మొత్తానికి ఐదుగురు భార్యల ముద్దుల భర్త మాత్రం ఓటీటీలోకి రావడానికి కాస్త సమయం పట్టేలా ఉంది. ఎప్పుడు రిలీజ్ అనే విషయాన్ని మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. కమింగ్ సూన్ అంటూ ఆపేశారు. మరి.. ఈ నాగేంద్రన్స్ హనీమూన్స్ సినిమా టీజర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş