iDreamPost

లులు మాల్‌లో కరువు బ్యాచ్‌.. మరీ ఇలా ఉన్నారేంట్రా

  • Published Oct 03, 2023 | 9:43 AMUpdated Oct 03, 2023 | 11:55 AM
  • Published Oct 03, 2023 | 9:43 AMUpdated Oct 03, 2023 | 11:55 AM
లులు మాల్‌లో కరువు బ్యాచ్‌.. మరీ ఇలా ఉన్నారేంట్రా

దేశంలో అతిపెద్ద షాపింగ్ మాల్ అయిన లులు మాల్.. హైదరాబాద్‌కు తరలి వచ్చిన సంగతి తెలిసిందే. కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన లులు మాల్‌ని సెప్టెంబర్ 27న ప్రారంభించారు. ఓపెనింగ్‌ కావడంతో.. భారీ ఎత్తున ఆఫర్లు పెట్టారు. ఇక మాల్‌లో దొరకని వస్తువంటూ లేదు. తినుబండరాలు మొదలు.. ఎలక్ట్రానిక్‌ వస్తువుల వరకు సమస్తం ఒకే చోట లభిస్తున్నాయి. ఇక మాల్‌ ప్రారంభం అయిన రోజు నుంచి జనాలు విపరీతంగా పోటెత్తుతున్నారు. మాల్‌కు వచ్చీపోయే వాహనాలతో.. కూకట్‌పల్లి రోడ్లు ఆదివారం నాడు మధ్యాహ్నం నుంటే కిలోమీటర్ల మేర స్తంభించిపోయాయి. ఫ్లైఓవర్ మీదే కార్లు పార్కింగ్ చేసుకున్నారంటే.. ఎంత రష్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆదివారం నుంచి సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసిన లులు మాల్‌ వల్ల ఏర్పడిన ట్రాఫిక్‌ ఇబ్బందికి సంబంధించిన వీడియోలే దర్శనం ఇస్తున్నాయి.

మాల్‌లో కరువు బ్యాచ్‌..

ఇక ఇదంతా ఒక ఎత్తయితే.. ఇక లులు మాల్‌కి వచ్చిన జనాల్లో కొందరు చేసే అరచకాలు మాములుగా లేవు. పెద్ద మాల్‌ కావడం.. విపరీతంగా రద్దీ ఉండటంతో.. కరువు బ్యాచ్‌ చెలరేగిపోయారు. నచ్చిన ఫుడ్‌ని ఒపెన్‌ చేసి.. అక్కడే స్వాహా చేసి.. ఆ ప్యాకెట్స్‌ని పక్కకు పడేసి చక్కా పోయారు. ఫుడ్‌ సెక్షన్‌ మొత్తం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉంది. బిల్లింగ్‌ దాని పైన ఫ్లోర్‌లో ఉంది. దాంతో కొందరు జనాలు దొరికిందే చాన్స్‌ అనుకుని.. నాన్‌ వెజ్‌ ఫుడ్‌ ఐటమ్స్‌ మొదలు స్వీట్స్‌, బెకరీ ఐటమ్‌ అన్ని వరుస పెట్టి అక్కడే లాగించేశారు. ఆ తర్వాత ఆ ప్యాకెట్స్‌ని అక్కడే పడేసి వెళ్లారు.

ఇక కొందరు అయితే ఫుడ్‌ ప్యాకెట్స్‌ని ఒపెన్‌ చేసి సగం తిని.. మిగతావి అలానే వదిలేశారు. పండ్ల మీద కూడా ఎగబడ్డారు. ఇక మాల్‌లో ఎక్కడా తాగు నీటి సౌకర్యం ఉన్నట్లు కనిపించలేదు. దాంతో జనాలు కూల్‌డ్రింక్స్‌, జ్యూస్‌ బాటిల్స్‌ ఒపెన్‌ చేసుకుని తాగి.. వాటిని అక్కడే పడేసి వెళ్లారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా ఈ వీడియోలే దర్శనం ఇస్తున్నాయి.

వీటిని చూసిన నెటిజనులు.. మీకంటే భిక్షగాళ్లు నయంగా ఉన్నారు కదరా నాయనా.. చదువుకున్నోళ్లు కూడా ఇలా ప్రవర్తిస్తే.. ఎలా.. మరీ ఇంత కరువులో ఉన్నారేంట్రా బాబు.. డబ్బులు పెట్టి తినొచ్చు కదా.. దాని వల్ల వాళ్లకెంత లాస్‌.. మరీ ఇంత చండాలంగా ఉన్నారేంటి.. అని కామెంట్స్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే లులు మాల్‌కి వెళ్లి వచ్చిన వాళ్లు మాత్రం.. ఇంకో నెల రోజుల పాటు అటు వెళ్లకపోతేనే బెటర్‌ అంటున్నారు. ఏది ఏమైతేనేం.. గత కొన్ని రోజులుగా లులు మాల్‌ మాత్రం ట్రెండింగ్‌లో ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి