iDreamPost

రవితేజ ‘క్రాక్’కు మాత్రమే సాధ్యం

రవితేజ ‘క్రాక్’కు మాత్రమే సాధ్యం

వచ్చే నెల నుంచి థియేటర్ గేట్లు తెరుచుకుంటాయనే ఆశాభావంతో ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తోంది. అయితే పరిమిత సీట్లు, శానిటైజేషన్ ఏర్పాట్లు తదితర నిబంధనలు ఉంటాయి కాబట్టి ముందు చిన్న సినిమాలు రిలీజ్ చేసి ప్రయోగాత్మకంగా ఫలితాలను పరీక్షిస్తారు . ఒకవేళ స్పందన బాగుంటే ప్రభుత్వానికి అప్పీల్ చేసి ఆపై పెద్దవి వదిలే ఆలోచనలో ఉన్నారు. దీనికి తెలుగు రాష్ట్రాలే కాదు కేంద్రం కూడా పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ జరిగితే మాత్రం పబ్లిక్ హాల్స్ కు రావాలంటే స్టార్ సపోర్ట్ తప్పదు.

అంటే మార్కెట్ ఎక్కువగా ఉండి అభిమానుల ఫాలోయింగ్ పుష్కలంగా ఉండేవాళ్ళు. నాని వి మీద క్రేజ్ ఉంది కాని అది క్రైమ్ థ్రిల్లర్. ఫ్యామిలీ ఆడియన్స్ కి, మాస్ ప్రేక్షకులకు యునానిమస్ గా నచ్చుతుందన్న గ్యారెంటీ లేదు. ఎంత బాగున్నా నాని మహా అయితే 20 కోట్లను మించి ఇలాంటి జానర్ లో రాబట్టడం కష్టమే. ఇక అరణ్య, నిశబ్దం, ఉప్పెనలది కూడా ఇదే పరిస్థితి. కాని రవితేజ క్రాక్ ఈ విషయంలో చాలా మెట్లు పైన ఉంటుంది. మాస్ మహారాజా ఇమేజ్ తో పాటు ఓపెనింగ్స్ విషయంలో ధైర్యంగా ఉండొచ్చు. పాజిటివ్ టాక్ వచ్చిందంటే ఈజీగా దూసుకుపోతుంది. టీజర్ ని చూస్తే అంచనాలు పెరిగాయే తప్ప రవితేజ మళ్ళీ తప్పు చేయలేదనే అభిప్రాయం అందరిలోనూ కలిగింది.

దీన్ని సరిగ్గా క్యాష్ చేసుకోగలిగితే క్రాక్ సులభంగా ఫస్ట్ క్రౌడ్ పుల్లర్ గా నిలుస్తుంది. హిట్ అయితేనే సుమా. మీడియం రేంజ్ హీరోలతో టికెట్ కౌంటర్లు కళకళలాడే పరిస్థితి ప్రస్తుతానికి లేదు. దర్శకుడు గోపిచంద్ మలినేనికి రవితేజతో ఇది హ్యాట్రిక్ మూవీ కావడంతో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకో పది రోజులు వర్క్ చేస్తే షూటింగ్ అయిపోతుందని నిర్మాత ఇటీవలే వెల్లడించారు. శృతి హాసన్ హీరొయిన్ గా నటిస్తున్న క్రాక్ లో వరలక్ష్మి శరత్ కుమార్, సముతిరఖని విలన్లుగా చేస్తున్నారు. ఒంగోలు బ్యాక్ డ్రాప్ లో కంప్లీట్ మాస్ యాక్షన్ పోలీస్ డ్రామాగా క్రాక్ ని రూపొందిస్తున్నట్టు సమాచారం. తమన్ సంగీతం కూడా ఆకర్షణగా నిలవబోతోంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి