కరోనా వల్ల థియేటర్లు మళ్ళీ కొన్ని నెలలు మూతబడాల్సి వచ్చినా సరే తెలుగు ప్రేక్షకులు మాత్రం తమ సినిమా ప్రేమని అభిమానాన్ని కలెక్షన్ల రూపంలో ఋజువు చేస్తూనే వచ్చారు.దేశంలో ఎక్కడా లేని విధంగా అధిక సంఖ్యలో సినిమాలు చూసింది మనవాళ్లే. ఇండియా బుక్ మై షో గణాంకాల ఆధారంగా చేసిన ఒక డేటా విశ్లేషణలో టాప్ మూవీ బుకింగ్స్ పరంగా హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందంటేనే అర్థం చేసుకోవచ్చు సినిమా అనేది తెలుగు వాళ్ళ జీవితంలో ఎంత […]
అప్పుడే 2021లో సగం అయిపోయింది. ఇవాళ్టితో ఆరు నెలలు పూర్తయ్యాయి. ఎన్నో ఆశలతో ఎంతో ఘనంగా దేశంలో ఎక్కడా లేని విధంగా భారీ ఎత్తున సినిమా రిలీజులతో కళకళలాడిన టాలీవుడ్ నాలుగు నెలలు తిరక్కుండానే కరోనా సెకండ్ వేవ్ వల్ల మళ్ళీ కుదేలైపోయింది. క్రాక్, మాస్టర్ వసూళ్లు జనవరిలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తే ఉప్పెన ఫిబ్రవరి మొత్తాన్ని తన చేతుల్లోకి తీసుకుని వసూళ్ల అలలతో పోటెత్తించింది. మార్చిలో జాతిరత్నాలు చిన్న చిత్రాల సత్తా చాటి ముప్పై కోట్లకు […]
లాక్ డౌన్ వల్ల ఆగిపోయిన క్రాక్ బాలన్స్ వర్క్ కోసం వెయిట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ త్వరలో కొత్త బిజినెస్ ప్లాన్ తో రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలిసింది. అయితే అది కూడా సినిమాకు సంబంధించినదే లెండి. త్వరలో రవితేజ స్వంతంగా ప్రొడక్షన్ బ్యానర్ లాంచ్ చేయబోతున్నట్టుగా తెలిసింది. తనది ప్లస్ పిల్లల పేర్లు కలిసి వచ్చేలా రెండు మూడు ఆప్షన్స్ తో ఆల్రెడీ ప్లానింగ్ కూడా మొదలైపోయిందట. కాకపోతే దీని ద్వారా కొత్త టాలెంట్ […]
మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న క్రాక్ షూటింగ్ ఇంకొంత మాత్రమే బాలన్స్ ఉంది. షూటింగులకు అనుమతులు వచ్చేశాయి కాబట్టి ఇంకొద్ది రోజుల్లో క్రాక్ సెట్స్ పైకి వెళ్లబోతోంది. గత కొంత కాలంగా హిట్లు లేక హ్యాట్రిక్ డిజాస్టర్లు అందుకున్న రవితేజ అభిమానుల ఆశలన్నీ దీని మీదే ఉన్నాయి. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. ఇక ఇందులో హై లైట్స్ ఓ […]
వచ్చే నెల నుంచి థియేటర్ గేట్లు తెరుచుకుంటాయనే ఆశాభావంతో ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తోంది. అయితే పరిమిత సీట్లు, శానిటైజేషన్ ఏర్పాట్లు తదితర నిబంధనలు ఉంటాయి కాబట్టి ముందు చిన్న సినిమాలు రిలీజ్ చేసి ప్రయోగాత్మకంగా ఫలితాలను పరీక్షిస్తారు . ఒకవేళ స్పందన బాగుంటే ప్రభుత్వానికి అప్పీల్ చేసి ఆపై పెద్దవి వదిలే ఆలోచనలో ఉన్నారు. దీనికి తెలుగు రాష్ట్రాలే కాదు కేంద్రం కూడా పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ జరిగితే మాత్రం పబ్లిక్ హాల్స్ కు […]
బాక్స్ ఆఫీస్ వద్ద తన స్థాయి హిట్టు కోసం ఎదురు చూస్తున్న మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా క్రాక్ కరోనా వల్ల విడుదల బ్రేక్ వేసుకోవాల్సి వచ్చింది . షూటింగ్ దాదాపు పూర్తయిపోయి మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్న తరుణంలో ఇలా ఆగిపోవడం అభిమానులకు షాకే. అయితే ఈ పరిస్థితి చిన్నా పెద్ద అందరికి వచ్చింది కాబట్టి ఈ గండం నుంచి త్వరగా బయటపడేయమని దేవుణ్ణి వేడుకోవడం తప్ప ఇంకేమి చేయలేని టైం ఇది. సరే […]
ఈ ఏడాది ప్రారంభంలో డిస్కోరాజా తో షాక్ తిన్న మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా క్రాక్ షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. ఇటీవలే రిలీజ్ చేసిన పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. ముందే ప్రకటించిన రిలీజ్ డేట్ మే 8కు తగ్గట్టు అప్పుడే ప్రమోషన్లు కూడా మొదలుపెట్టేశారు. అందులో భాగంగానే నిన్న టీజర్ రిలీజ్ చేసింది టీమ్. చూచాయగా కథేంటో చిన్న క్లూస్ ఇచ్చారు. ఒంగోలులో రాత్రి 8 సమయంలో కరెంట్ పోతే మర్డర్లు జరుగుతుంటాయి. […]
అభిమానులతో పాటు తాను వ్యక్తిగతంగా ఎన్నో అంచనాలు పెట్టుకున్న డిస్కో రాజా నిరాశపరచడం పట్ల రవితేజ ఎలా ఫీలవుతున్నాడో తెలియదు కాని ఫ్యాన్స్ మాత్రం తెగ బాధ పడుతున్నారు. భారీ బడ్జెట్ తో డిఫరెంట్ స్టొరీ లైన్ తో డ్యూయల్ రోల్ తో తెరకెక్కినప్పటికీ ఆశించిన ఫలితం అందుకోలేదు సరికదా వరసగా నాలుగో డిజాస్టర్ ని హీరో ఖాతాలో వేసేసింది. ఇప్పుడు ఆశలన్ని రాబోయే క్రాక్ మీదకు షిఫ్ట్ అయ్యాయి. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో శృతి హాసన్ […]