iDreamPost
android-app
ios-app

Nani : హిట్-3 కోసం నాని కొత్త రోల్! ఇది ఎవ్వరూ ఊహించని ట్విస్ట్!

  • Published Jul 26, 2024 | 4:30 PMUpdated Jul 26, 2024 | 4:30 PM

డాక్టర్ అవుదాం అనుకుని యాక్టర్స్ అయినా వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయితే డైరెక్టర్ అవుదాం అనుకుని హీరో అయిన వాళ్లలో మాత్రం నాని ఒక్కడే ఉన్నాడు. అయితే ఇప్పుడు నాని.. రైటర్ కూడా అవ్వబోతున్నాడట. ఆ వివరాలేంటో చూసేద్దాం.

డాక్టర్ అవుదాం అనుకుని యాక్టర్స్ అయినా వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయితే డైరెక్టర్ అవుదాం అనుకుని హీరో అయిన వాళ్లలో మాత్రం నాని ఒక్కడే ఉన్నాడు. అయితే ఇప్పుడు నాని.. రైటర్ కూడా అవ్వబోతున్నాడట. ఆ వివరాలేంటో చూసేద్దాం.

  • Published Jul 26, 2024 | 4:30 PMUpdated Jul 26, 2024 | 4:30 PM
Nani : హిట్-3 కోసం నాని కొత్త రోల్! ఇది ఎవ్వరూ ఊహించని ట్విస్ట్!

ఇండస్ట్రీలో రాణించాలంటే కష్టం , అదృష్టం రెండు కలిసి రావాలి. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న హీరోలలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయినా హీరోలలో నాని ఒకరు. డైరెక్టర్ అవుదాం అని ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చిన నాని.. అనుకోకుండా హీరోగా మారిపోయాడు. అష్టా చమ్మా సినిమాతో.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరైపోయి.. న్యాచురల్ స్టార్ నానిగా ఇండస్ట్రీ లో తన మార్క్ ను కొనసాగిస్తున్నాడు. దానికంటే ముందు నాని కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేశారు. దీనితో అప్పుడప్పుడు స్టోరీస్ ను డిసైడ్ చేసే విషయంలో.. అప్పుడప్పుడు తనలోని దర్శకుడు బయటకు వస్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు నాని రైటర్ గా కూడా మారబోతున్నాడట. దానికి సంబంధించిన పూర్తి వివరాలను చూసేద్దాం.

ఇప్పటికి ఇండస్ట్రీకి నాని ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్ళు అయింది. ప్రస్తుతం ఆగష్టు 29 న నాని నటించిన సరిపోదా శనివారం సినిమా రిలీజ్ కు రెడీ గా ఉంది. ఇప్పటివరకైతే.. ఈ సినిమాకు డీసెంట్ హైప్ ఏ నడుస్తుంది. త్వరలోనే మూవీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పుడు నాని తనలోని రైటర్ ను అందరికి పరిచయం చేయబోతున్నాడు. సరిపోదా శనివారం తర్వాత నాని శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్-3 సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఈ సినిమాను వెంటనే ఈ సినిమాను వెంటనే చేయాలనీ మాత్రం అనుకోలేదు. కానీ నాని దగ్గర ఆ సినిమాకు సరిపోయేలా అదిరిపోయే స్టోరీ లైన్ ఉండడంతో.. దానిని శైలేష్ కొలనుతో చెప్పి డెవలప్ చేయించడంతో టోటల్ స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చిందట. దీనితో ఈ సినిమాకు నానినే కథను అందించనున్నాడు.

కాగా స్క్రిప్ట్ అద్భుతంగా రావడంతో.. లేట్ గా చేద్దాం అనుకున్న హిట్-3 మూవీని కాస్త.. వెంటనే చేయాలని డిసైడ్ అయ్యారట. సెప్టెంబర్ లో ఈ మూవీ సెట్స్ పైకి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారట మేకర్స్. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి, విలన్ గా రానా దగ్గుబాటి నటించనున్నారు. ప్రస్తుతానికైతే ఈ సినిమాకు సంబంధించి ఈ అప్ డేట్స్ మాత్రమే వచ్చాయి. త్వరలోనే ఈ మూవీపై అఫీషియల్ అనౌన్సుమెంట్ చేసే అవకాశాలు లేకపోలేదు. మరి నాని కథ అందిస్తున్న హిట్-3 ఎలాంటి రిజల్ట్ ను అందిస్తుందో వేచి చూడాలి. మరి ఈ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి