iDreamPost

కోడలిపై మోజు పడ్డ అత్త! కోరిక తీర్చాలంటూ వేధింపులు!

అత్తలేని కోడలు ఉత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు అన్న సామెత ఉంది. ఒకే ఇంట్లో ఉంటే అత్తా కోడళ్ల మధ్య నిత్యం గొడవలే. చివరకు ఒకరిపై ఒకరు చాడీలు చెబుతుంటారు. కానీ కోడలు చేస్తున్న ఆరోపణలు మాత్రం తీవ్రంగా ఉన్నాయి.

అత్తలేని కోడలు ఉత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు అన్న సామెత ఉంది. ఒకే ఇంట్లో ఉంటే అత్తా కోడళ్ల మధ్య నిత్యం గొడవలే. చివరకు ఒకరిపై ఒకరు చాడీలు చెబుతుంటారు. కానీ కోడలు చేస్తున్న ఆరోపణలు మాత్రం తీవ్రంగా ఉన్నాయి.

కోడలిపై మోజు పడ్డ అత్త! కోరిక తీర్చాలంటూ వేధింపులు!

ఆడదానికి ఆడదే శత్రువన్న అపవాదు ఉంది. ముఖ్యంగా అత్తా, కోడళ్లు, తోడి కోడళ్ల విషయంలో ఈ వ్యాఖ్యాన్ని నొక్కి వక్కాణిస్తుంటారు కొందరు. రెండు కొప్పులు ఒకే చోట ఇమడవని, ఇద్దరు ఆడవాళ్లు ఓ చోట ఉంటే యుద్దాలు జరుగుతుంటాయని అంటుంటారు. అయితే ఎక్కువగా అపార్థాలకు తావునిచ్చే రిలేషన్ అత్తా, కోడళ్లదే. సాధారణంగా అత్త తనపై పెత్తనం చేయాలని చూస్తుందని, తనను చిత్ర హింసలకు గురి చేస్తుందని, వరకట్నం తీసుకురమ్మంటూ వేధిస్తుందని, భర్తకు తన గురించి లేని పోనివి ఎక్కేస్తుందని కోడలి నుండి కంప్లయింట్స్ వస్తుంటాయి. కానీ ఈ కోడలు మాత్రం సెన్సేషనల్ ఆరోపణలు చేస్తుంది. అత్త తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలంటూ ఒత్తిడి చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటుచేసుకుంది. భర్త, అత్తా కలిసి తనను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని, తనతో ఫిజికల్ రిలేషన్ పెట్టుకోవాలని అత్త తనను వేధిస్తుందంటూ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. యుపిలోని ఘాజీపూర్ జిల్లాకు చెందిన అలోక్ ఉపాధ్యాయతో ఓ మహిళకు 2022లో వివాహం జరిగింది. పెళ్లైన కొన్ని రోజుల నుండి ఆమెను హింసించడం స్టార్ట్ చేశారు అత్తింటి వారు. అంతలో అత్త చేష్టలతో ఒక్కసారిగా షాక్ తింది కొత్త పెళ్లికూతురు. తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలంటూ ఒత్తిడి తేవడంతో ఒక్కసారిగా ఖంగుతింది. ఆమె తిరస్కరించడంతో బ్లేడుతో దాడి చేసింది. దీంతో చేతిపై ఐదు గాయాలు కాగా, కుట్లు కూడా పడ్డాయి.

అలాగే ఆడపడుచు సైతం హింసకు గురిచేసింది. బాధితురాలి దుస్తులు లాక్కొని.. ఓ రూంలో బంధించి.. నెల రోజుల పాటు ఓకే డ్రెస్సుపై ఉండేలా చేసింది. వీటికి తోడు.. వరకట్న వేధింపులు, లైంగిక వేధింపులు ఎదురయ్యాయని వెల్లడించింది. 2023లో మగ బిడ్డను కనిన తర్వాత ఈ వేధింపులు మరింత ఎక్కువైనట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. భర్త కూడా ఆమెపై హింసకు పాల్పడేవాడు. ఆమెను కొట్టి ఇంట్లో నుండి గెంటేసేవాడు. ఇరుగు పొరుగు జోక్యం చేసుకోవడంతో మళ్లీ ఇంట్లోకి తీసుకెళ్లేవాడు. ఈ విషయం తెలిసి మహిళ తండ్రి ఆమె ఇంటికి వెళ్లి.. కూతుర్ని పుట్టింటికి తీసుకు వచ్చాడు. కాగా, తొలుత రాజీ కోరుతూ ఆమె తండ్రితో సంప్రదింపులు జరిపారు అత్తామామలు. దీనిపై చర్చించేందుకు వెళ్లగా.. మళ్లీ గొడవలు పెట్టుకున్నారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి