iDreamPost
android-app
ios-app

అధిక రాబడి కావాలా?.. అయితే ఈ SBI పథకం మీకోసమే.. పెట్టుబడికి బెస్ట్ స్కీమ్

  • Published Jun 29, 2024 | 11:05 AM Updated Updated Jun 29, 2024 | 11:05 AM

SBI FD: మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదిరిపోయే స్కీమ్ ను అందిస్తున్నది. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అందుకోవచ్చు.

SBI FD: మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదిరిపోయే స్కీమ్ ను అందిస్తున్నది. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అందుకోవచ్చు.

అధిక రాబడి కావాలా?.. అయితే ఈ SBI పథకం మీకోసమే.. పెట్టుబడికి బెస్ట్ స్కీమ్

నేటి పొదుపు రేపటి ఆర్థిక అవసరాలను తీరుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని పొదుపు చేస్తే ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. ఈ రోజుల్లో డబ్బుకు ప్రాధాన్యత పెరగడంతో ఆదాయం పెంచుకుంనేందుకు అందుబాటులో ఉన్న మార్గాలను వెతుకుతున్నారు. చేతిలో ఉన్న డబ్బును వివిధ పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఇంట్రెస్టు చూపిస్తున్నారు. మరి మీరు కూడా పెట్టుబడి పెట్టాలనుకుంటే ఎస్బీఐలో అదిరిపోయే స్కీమ్ అందుబాటులో ఉంది. ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ ప్రజల కోసం అధిక రాబడినిచ్చే పథకాలను అమలు చేస్తున్నది. వాటిల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ స్కీమ్ ఒకటి.

ఎస్బీఐ సీనియర్ సిటిజన్లకోసం ఎఫ్డీలపై ఆకర్షనీయమైన వడ్డీని అందిస్తున్నది. సీనియర్ సిటిజన్లు ఎస్బీఐలో ఫిక్స్ డ్ డిపాజిట్ చేసినట్లైతే మంచి వడ్డీని అందుకోవచ్చు. సీనియర్ సిటిజన్ల కోసం పోస్టాఫీస్ లో కూడా మంచి వడ్డీ రేటును అందిస్తుంది. పదవీవిరమణ అనంతరం ఆదాయం పొందాలనుకునే వారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎఫ్డీ చేసినట్లైతే మంచి రాబడిని అందుకోవచ్చు. ఎస్బీఐ ఏడాది, మూడేళ్లు, ఐదేళ్ల టర్మ్ పీరియడ్‌ ఉండే ఎఫ్‌డీలపై మంచి వడ్డీరేట్లు అందిస్తోంది. సాధారణ ఎఫ్‌డీలపై ఏడాదికి 7.30, మూడేళ్లకు 7.25, ఐదేళ్లకు 7.50 వార్షిక వడ్డీరేటు అందిస్తున్నది.

SBI Scheme

సంత్సర కాల సాధారణ ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఎస్బీఐ సీనియర్ సిటిజన్లకు 7.30 శాతం వార్షిక వడ్డీరేటు అందిస్తోంది. ఎస్బీఐలో రూ.80 వేలు ఎఫ్‌డీ చేస్తే రూ.6,002 వడ్డీ వస్తుంది. మెచ్యూరిటీ సమయానికి అసలు, వడ్డీ కలుపుకుని రూ.86,002 చేతికి అందుతుంది. రూ.1.6 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ పూర్తయ్యాక వడ్డీ రూ.12,004తో కలిపి రూ.1,72,004 అందుతుంది. రూ.2.4 లక్షల ఎఫ్‌డీలపై రూ.18,005 వడ్డీ వస్తుంది. దీంతో మెచ్యూరిటీ అయిపోయాక రూ.2,58,005 పొందవచ్చు. ఫిక్స్ డ్ డిపాజిట్ల ద్వారా మంచి రాబడిని అందుకోవాలనుకునే సీనియర్ సిటిజన్లు ఎస్బీఐలో ఎఫ్డీ చేస్తే మేలు అని నిపుణులు సూచిస్తున్నారు.