Somesekhar
India Playing XI Prediction: టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో పటిష్టమైన సౌతాఫ్రికాతో టైటిల్ పోరులో తలపడబోతోంది టీమిండియా. ఇక ఈ మ్యాచ్ లో ఓ వ్యూహాత్మక మార్పుతో బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్లేయింగ్ 11లో ఎవరెవరు ఉండబోతున్నారో ఓసారి పరిశీలిద్దాం.
India Playing XI Prediction: టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో పటిష్టమైన సౌతాఫ్రికాతో టైటిల్ పోరులో తలపడబోతోంది టీమిండియా. ఇక ఈ మ్యాచ్ లో ఓ వ్యూహాత్మక మార్పుతో బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్లేయింగ్ 11లో ఎవరెవరు ఉండబోతున్నారో ఓసారి పరిశీలిద్దాం.
Somesekhar
టీ20 వరల్డ్ కప్ లో చరిత్ర సృష్టించడానికి టీమిండియా, సౌతాఫ్రికా జట్లు సిద్ధంగా ఉన్నాయి. ఇందుకోసం ఇరు జట్లు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా జట్టు కూర్పులో మార్పులు, చేర్పుల గురించి ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇక సౌతాఫ్రికాతో జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియా వ్యూహాత్మక మార్పుతో బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ బిగ్ ప్లాన్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. కాగా.. ఫైనల్ మ్యాచ్ కోసం జట్టులో ఏమైనా మార్పులు చేస్తారా? లేదా? ప్లేయింగ్ 11లో ఎవరెవరు ఉండబోతున్నారో ఓసారి పరిశీలిద్దాం.
సౌతాఫ్రికాతో జరగబోయే ఫైనల్ పోరు కోసం టీమిండియా సిద్ధమైంది. టోర్నీ ప్రారంభం నుంచి కొనసాగిస్తున్న జోరును ఈ మ్యాచ్ లో కూడా చూపించాలని భావిస్తోంది. అయితే సూపర్ 8 నుంచి జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండానే బరిలోకి దిగి విజయాలు సాధిస్తూ వస్తోంది భారత్. ఇక ఇప్పుడు ఫైనల్ కోసం టీమ్ లో మార్పులు, చేర్పులు చేయాలా? వద్దా? అని ఆలోచనలో ఉంది. ఈ టోర్నీలో దారుణంగా విఫలం అవుతూ వస్తున్న శివమ్ దూబేపై వేటు పడటం ఖాయంగా తెలుస్తోంది. అతడి స్థానంలో సంజూ శాంసన్ ను లేదా యశస్వీ జైస్వాల్ ను తీసుకోవాలన్న ఆలోచనలో మేనేజ్ మెంట్ ఉందట. రోహిత్ సైతం విరాట్ కోహ్లీని వన్ డౌన్ లో తీసుకొచ్చి.. జైస్వాల్ ఓపెనర్ గా తీసుకురావాలన్న ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా.. సూపర్ 8 నుంచి ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్ నే కొనసాగించాలన్న మరో ఆలోచన కూడా మేనేజ్ మెంట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జట్టులో ఏదైనా వ్యూహాత్మక మార్పు చోటుచేసుకుంటుందా? అన్న సందేహం అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. ఒకవేళ శివమ్ దూబేను తొలగించి యశస్వీ జైస్వాల్ లేదా సంజూ శాంసన్ కు చోటు కల్పిస్తే మాత్రం.. కోహ్లీ వన్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగుతాడు. మిగతా కాంబినేషన్లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. బిగ్ మ్యాచెస్ విన్నర్ గా గుర్తింపు ఉన్న రవీంద్ర జడేజాపై వేటు వేసే అవకాశం లేదు. మిగతావారు కూడా పరిస్థితులకు తగ్గట్లుగా రాణిస్తుండటంతో.. ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ ఏదైనా బిగ్ ప్లాన్ వేసి మార్పులు చేస్తే.. అది టీమిండియా విజయానికి ఎంత వరకు దోహదపడుతుందో వేచిచూడాలి.
రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే/యశస్వీ జైస్వాల్/ సంజూ శాంసన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.