Somesekhar
తొలిరోజు రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించించింది కల్కి 2898 ఏడీ మూవీ. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 191.5 కోట్లను రాబట్టినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. మరి రెండో రోజు యంగ్ రెబల్ స్టార్ ఎంత వసూళ్ చేశాడో ఇప్పుడు చూద్దాం.
తొలిరోజు రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించించింది కల్కి 2898 ఏడీ మూవీ. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 191.5 కోట్లను రాబట్టినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. మరి రెండో రోజు యంగ్ రెబల్ స్టార్ ఎంత వసూళ్ చేశాడో ఇప్పుడు చూద్దాం.
Somesekhar
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి మూవీ రిలీజ్ అయ్యి.. తొలి రోజే ఏ రేంజ్ కలెక్షన్లను రాబట్టిందో అందరికీ తెలిసిందే. ఫస్ట్ డేనే ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది. మార్నింగ్ షో నుంచే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో.. థియేటర్లు ప్రేక్షకులతో నిండిపోయాయి. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఇక సినీ, రాజకీయ ప్రముఖులు సైతం కల్కి మూవీ చూసి తమ రివ్యూలను ఇవ్వడంతో మూవీపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. దాంతో ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. మరి కల్కి మూవీ రెండో రోజు ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసుకుందాం.
కల్కి చిత్రం ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ. 191.5 కోట్లు కొల్లగొట్టినట్లు మూవీ టీమ్ అఫీషియల్ గా ప్రకటించింది. రిలీజ్ రోజు వర్కింగ్ డే అయినప్పటికీ.. ఈ రేంజ్ లో కలెక్షన్లు రాబట్టడానికి కారణం.. ఆ చిత్రంపై వచ్చిన హైపే. దీనితో పాటుగా మార్నింగ్ షో నుంచి సూపర్ హిట్ టాక్ రావడంతో.. రికార్డు స్థాయిలో వసూళ్లు ను సాధించింది. అయితే ఇదే ఊపును రెండో రోజు కొనసాగించడంలో రెబల్ స్టార్ కాస్త తగ్గాడు. దాంతో ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు. సెకండ్ డే కల్కి ఎంత వసూళ్ చేసిందంటే?
ట్రేడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం తొలిరోజు కల్కి మూవీకి ఇండియాలో నెట్ కలెక్షన్లు రూ. 95.3 కోట్ల వరకు ఉన్నాయి. కానీ ఇదే జోరును సెకండ్ డే కొనసాగించలేకపోయింది. రెండో రోజు ఇండియాలో కల్కి మూవీకి రూ. 50 కోట్ల వరకే నెట్ కలెక్షన్లు వచ్చాయి.నైజాం – 10.53 కోట్లు, సీడెడ్- 2.30 కోట్లు, యూఏ- 2.27 కోట్లు, ఈస్ట్- 1.19 కోట్లు, ఈస్ట్- 77 లక్షలు, గుంటూరు-1.14 కోట్లు, కృష్ణ- 1.18 కోట్లు, నెల్లూరు- 62 లక్షలు టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 20 కోట్లు(రూ. 31.35 కోట్ల గ్రాస్). ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 2 రోజుల్లో సినిమా 64.86 కోట్ల రేంజ్ లో షేర్ 100 కోట్ల రేంజ్ కి పైగా గ్రాస్ ను అందుకోగా తెలుగు రాష్ట్రాల వాల్యూ బిజినెస్ 168 కోట్ల దాకా ఉంది. అయితే శని, ఆదివారల్లో ఈ కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దాంతో ఇంతకి రెట్టింపు వసూళ్లను కల్కి రాబడుతుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.