Dharani
కన్నప్రేమను మర్చిపోయి మరీ దారుణ నిర్ణయం తీసుకుంది ఓ మహిళ. ఆమె చేసిన పనికి రెండు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొని ఉంది. ఆ వివరాలు..
కన్నప్రేమను మర్చిపోయి మరీ దారుణ నిర్ణయం తీసుకుంది ఓ మహిళ. ఆమె చేసిన పనికి రెండు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొని ఉంది. ఆ వివరాలు..
Dharani
సమాజంలో చోటు చేసుకునే కొన్ని సంఘటనలు చూస్తే.. అరే ఏంటీ లోకం ఇలా ఉంది.. అసలు ఎటు పోతున్నాం.. చావడం, చంపడం అంత తేలికా అనే అనుమానం రాక మానదు. కోపంలో విచక్షణ కోల్పోయి.. చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీసేవారు కొందరైతే.. మనోధైర్యం లేక చిన్న సమస్యలనే పెను భూతాలుగా భావించి.. ప్రాణాలు తీసుకుంటున్నవారు మరి కొందరు. అసలు మానవజన్మ లభించడమే అరుదు అంటారు. భూమ్మీదకు వచ్చినందుకు ఏం సాధించకపోయినా పర్లేదు.. మన వల్ల పక్క వాళ్లు ఇబ్బంది పడకుండా.. కన్నీరు పెట్టకుండా బతికితే చాలు. కానీ కొందరు తీసుకునే నిర్ణయాల వల్ల కుటుంబాలు కూలిపోతున్నాయి. కన్నవారికి, కడుపున పుట్టిన వారికి తీరని కడుపుకోత మిగులుస్తున్నారు. తాజాగా ఓ మహిళ ఇలాంటి పనే చేసింది. ఆ వివరాలు..
పైన ఫొటోలో ఉన్న మహిళను చూశారుగా. ఎంత చక్కగా ఉందో అనిపించక మానదు. ఆమెది మన రాష్ట్రం కాదు.. కర్ణాటక, బీదర్. ఇక ఆ మహిళకు వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భర్త, పండంటి బిడ్డలతో.. ఎలాంటి కలతలు లేకుండా ఆమె కాపురం సాగిపోతుంది. కొన్నాళ్ల క్రితమే ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వచ్చారు. మరి ఏం జరిగిందో తెలియదు.. పిల్లలకు విషమిచ్చి.. తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
ఈ దారుణం హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో చోటు చేసుకుంది. కర్నాటక బీదర్ నుంచి వచ్చిన కుటుంబం శంషాబాద్ అర్బీనగర్‌లో అద్దెకు ఉంటోంది. మృతురాలి భర్త కొరియర్ ఆఫీస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇన్నాళ్లు బాగానే ఉన్నారు. మరి దంపతులు మధ్య ఏం జరిగిందో తెలియదు.. దేని కోసం గొడవపడ్డారో కానో.. భర్త ఇంట్లో లేని సమయం చూసి భార్య దారుణానికి ఒడిగట్టింది. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది. ఉదయం భర్త వచ్చి చూ సేసరికి ఫ్యాన్‌కి ఉరివేసుకుని కనిపించింది. ఇక ఇద్దరు పిల్లల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
వెంటనే స్పందించిన భర్త.. భార్యాబిడ్డలను నగరంలోని నిలోఫర్ హస్పటల్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మహిళ ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అయితే కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని బంధువులు చెబుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.