iDreamPost

Vijayawadaలో నడిరోడ్డుపై దారుణం.. తండ్రి ప్రాణాలు బలి తీసుకున్న కుమార్తె ప్రేమ..

  • Published Jun 28, 2024 | 12:52 PMUpdated Jun 28, 2024 | 12:52 PM

విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. అత్యంత దారుణంగా ఓ వ్యక్తిని హత్య చేశాడు. ఆ వివరాలు..

విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. అత్యంత దారుణంగా ఓ వ్యక్తిని హత్య చేశాడు. ఆ వివరాలు..

  • Published Jun 28, 2024 | 12:52 PMUpdated Jun 28, 2024 | 12:52 PM
Vijayawadaలో నడిరోడ్డుపై దారుణం.. తండ్రి ప్రాణాలు బలి తీసుకున్న కుమార్తె ప్రేమ..

సమాజంలో రోజు రోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీస్తున్నారు. అది కూడా పట్టపగలు, నడి రోడ్డు మీద రెచ్చిపోతున్నారు. ఎలాంటి భయం, జంకు గొంకు లేకుండా..  రోడ్డు మీదనే ప్రాణాలు తీస్తున్నారు. ఈతరహా దారుణాలు ఈమధ్య కాలంలో సర్వ సాధారణం అయ్యాయి. కొన్ని రోజుల క్రితం.. ఓ యువకుడు.. తనను ప్రేమించడం లేదని.. ఓ యువతి మీద నడి రోడ్డుపై కత్తితో దాడి చేసి అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణాన్ని మర్చిపోకముందే.. తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా దారుణం వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో.. నడిరోడ్డుపై దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ వివరాలు..

విజయవాడలో నడిరోడ్డుపై దారుణం చోటు చేసుకుంది. కన్నకుమార్తె ముందే ఆమె తండ్రిని ఓ యువకుడు దారుణంగా హత్య చేశాడు. ప్రేమ వ్యవహారమే ఈ దారుణానికి కారణం అని తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ, భవానీపురంలోని చెరువు సెంటర్‌కు చెందిన శ్రీరామచంద్ర ప్రసాద్‌ అనే వ్యక్తి బృందావన్‌ కాలనీలో కిరాణాషాపు నడుపుకుంటూ.. కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. ఆయనకు ఓ కుమార్తె ఉంది. పేరు దర్శిని. ఆమె ఇంజనీరింగ్‌ సెకండియర్‌ చదువుతోంది. ఈ క్రమంలో ఆమెకు విద్యాధరపురానికి చెందని గడ్డం శివమణికంఠతో ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. అతడు స్థానిక పాఠశాలలో పీఈటీగా పని చేస్తుండేవాడు.

దర్శిని, మణికంఠల పరిచయం కాస్త ప్రేమగా మారింది. గత నాలగేళ్లుగా వారు ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా దర్శిని ప్రేమ గురించి ఆమె తండ్రికి తెలిసింది. దాంతో రామచంద్ర ప్రసాద్‌.. కుమార్తెను హెచ్చరించారు. బుద్దిగా ఉండాలని.. బాగా చదువుకుని.. జీవితంలో స్థిరపడాలని తెలిపారు. అలానే తన కుమార్తె జోలికి రావద్దని.. మణికంఠను హెచ్చరచించారు. ప్రేమ వ్యవహారం గురించి తండ్రికి తెలియడంతో.. దర్శిని గత కొన్ని రోజులుగా మణికంఠకు దూరంగా ఉంటుంది. ఇలా ఉండగానే కొన్ని రోజుల క్రితం దర్శిని తండ్రి.. కొంతమందిని తీసుకుని మణికంఠ ఇంటికి వెళ్లి పంచాయతీ పెట్టాడు. ఆ తర్వత నుంచి మణికంఠ ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. అతడి తల్లి ఇల్లు వదిలిపోయింది. ఈ సమస్యలన్నింటికి దర్శిని తండ్రే కారణమని భావించిన మణికంఠ అతడిపై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా అంతం చేయాలని భావించాడు.

మాటు వేసి హత్య..

ఈ క్రమంలో గురువారం నాడు రామచంద్రప్రసాద్‌ భవానీపురంలోని తన ఇంటి నుంచి కుమార్తె దర్శిని తీసుకుని.. బృందావన్‌ కాలనీలో ఉన్న తన కిరాణా షాపుకు వెళ్లాడు. రాత్రి 9 గంటల ప్రాంతంలో షాపు మూసి వేసి.. తండ్రీకుతూళ్లు స్కూటీపై ఇంటికి బయల్దేరారు. అప్పటికే వారు వెళ్లే మార్గంలో మాటు వేసి ఉన్న మణికంఠ.. వారు కొద్ది దూరం వెళ్లగానే బైక్‌ మీద వచ్చి దర్శిని వెళ్తున్న స్కూటీని ఢీ కొట్టాడు. ఈ క్రమంలో రామచంద్రప్రసాద్‌ కింద పడగానే.. అతడిపై కత్తితో దాడి చేశాడు మణికంఠ. రోడ్డుపై పడిన తండ్రిని దర్శిని పక్కకు తీసుకెళ్లి కూర్చోబెట్టింది.. ఆ వెంటనే మణికంఠ కత్తితో మరోసారి ఆయన్ను మళ్లీ నరికాడు. దర్శిని అడ్డుకున్న వినకుండా.. దారుణంగా కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత చంపేస్తానని దర్శినిని బెదిరించాడు. తనతో తిరిగిన వీడియోలు సోషల్‌ మీడియాలో పెడతానని హెచ్చరించాడు.

రామచంద్ర ప్రసాద్‌, దర్శిని కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు వచ్చారు. దాంతో మణికంఠ పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ రామచంద్రప్రసాద్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నిందితుడు మణికంఠను పోలీసులు అదుపులోకి తీసుకగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి