iDreamPost
android-app
ios-app

పెళ్లైన 5 రోజులకే ఆస్పత్రిలో చేరిన సోనాక్షి సిన్హా.. ఏం జరిగిందంటే!

  • Published Jun 29, 2024 | 11:30 AM Updated Updated Jun 29, 2024 | 11:30 AM

పెళ్లై వారం రోజులు కూడా కాలేదు. భర్తతో కలిసి ఆస్పత్రికి వెళ్లింది బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హా. దాంతో అనేక పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇంతకు ఏం జరిగిందంటే..

పెళ్లై వారం రోజులు కూడా కాలేదు. భర్తతో కలిసి ఆస్పత్రికి వెళ్లింది బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హా. దాంతో అనేక పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇంతకు ఏం జరిగిందంటే..

  • Published Jun 29, 2024 | 11:30 AMUpdated Jun 29, 2024 | 11:30 AM
పెళ్లైన 5 రోజులకే ఆస్పత్రిలో చేరిన సోనాక్షి సిన్హా.. ఏం జరిగిందంటే!

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు శత్రుఘ్న సిన్హా కుమార్తె సోనాక్షి సిన్హాకు ఐదు రోజుల క్రితమే వివాహం అయ్యింది. బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ దబాంగ్‌ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. కెరీర్‌ ప్రారంభంలో ఈ బ్యూటీ నటించిన ప్రతి సినిమా బ్లాక్‌ బాస్టర్‌ హిట్టుగా నిలిచాయి. దాంతో లక్కీ చామ్‌గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌లలో కూడా నటిస్తోంది. తాజాగా సంజయ్‌ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో వచ్చిన హీరామండి వెబ్‌ సిరీస్‌లో నటించింది. ప్రస్తుతం సినిమాలు, వెబ్‌ సిరీస్‌లలో నటిస్తూ బిజీగా ఉన్న బ్యూటీ.. తాజాగా పెళ్లి పీటలు ఎక్కింది. ప్రియుడిని వివాహం చేసుకుని.. వైవాహిక బంధంలోకి ప్రవేశించింది. నటుడు జహీర్ ఇక్బాల్‏తో గత ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న సోనాక్షి.. జూన్ 23న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది.

పెళ్లైన 5 రోజులకే అనగా జూన్‌ 23న సోనాక్షి వివాహం జరగ్గా.. శుక్రవారం అనగా జూన్‌ 28 నాడు ఆమె ఆస్పత్రిలో చేరింది. సోనాక్షి తన భర్త జహీర్‌తో కలిసి ముంబైలోని కోకిలాబెన్‌ ఆస్పత్రి నుంచి బయటకు వస్తుండగా మీడియా కంటికి చిక్కింది. దాంతో ఆమె గర్భవతి అనే రూమార్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అవ్వడం బాలీవుడ్‌ బ్యూటీలకు కొత్త కాదు.. గతంలో ఆలియా భట్‌ విషయంలో కూడా ఇదే జరిగింది కదా అంటున్నారు. పెళ్లైన కొద్ది రోజులకే ఆలియా ప్రెగ్నెన్సీ అనౌన్స్‌ చేయడంతో.. ఇప్పుడు సోనాక్షి విషయంలో కూడా అలానే జరుగుతుంది అంటూ ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్స్‌ చేస్తున్నారు.

ఆమెకు ఏమైనా అనారోగ్య సమస్య ఉందేమో అందుకే ఆస్పత్రికి వెళ్లింది.. ఈమాత్రం దానికే ఎందుకు ప్రెగ్నెంట్‌ అంటూ ఇష్టం వచ్చినట్లు ఊహించుకోవడం.. ఒకవేళ అయినా తప్పేంటి.. అది వారి వ్యక్తిగత జీవితం. దాని గురించి కామెంట్స్‌ చేయడానికి మనకు ఎలాంటి అధికారం లేదు అంటున్నారు మరి కొందరు నెటిజనులు. అయితే సోనాక్షి, ఆమె భర్త ఇక్బాల్‌ ఆస్పత్రికి వెళ్లడానికి కారణం ఆమె తండ్రి శత్రుఘ్న సిన్హా అని సన్నిహితులు చెబుతున్నారు. తండ్రికి తరచుగా ఇదే ఆస్పత్రిలో హెల్త్‌ చెకప్‌ చేయిస్తారని.. అందుకోసమే సోనాక్షి ఆస్పత్రికి వెళ్లిందని క్లారిటీ ఇస్తున్నారు.

అయితే సోనాక్షి వివాహానికి ఆమె ఇద్దరు సోదరులు దూరంగా ఉండడం.. అంతకు ముందు ఆమె తండ్రి చేసిన కామెంట్స్ నెట్టింట చర్చకు దారి తీశాయి. అంతేకాక ఈ నటి మతం మారబోతుంది అంటూ జోరుగా ప్రచారం సాగింది. కానీ వాటన్నింటికి చెక్‌ పెడుతూ.. రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకుని.. విమర్శలకు చెక్‌ పెట్టింది. వివాహం తర్వాత నిర్వహించిన రిసెప్షన్‌ వేడుకలో ఎరుపురంగు చీరలో.. నుదుటిన సింధూరంతో అచ్చమైన హిందూ పెళ్లి కుమార్తెగా కనువిందు చేసింది. వీరి రిసెప్షన్‌ వేడుకకు బాలీవుడ్‌ తారలతో పాటు రాజకీయ నాయకులు కూడా తరలి వచ్చారు. ఈ క్రమంలో తాజాగా సోనాక్షి ఆస్పత్రిలో చేరడం సంచలనంగా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet