iDreamPost
android-app
ios-app

పెళ్లి పీటలు ఎక్కిన టాలీవుడ్‌ హీరోయిన్‌.. ఎంతో సింపుల్‌గా గుడిలో వివాహం

  • Published Jun 29, 2024 | 8:58 AM Updated Updated Jun 29, 2024 | 8:58 AM

టాలీవుడ్‌ హీరోయిన్‌ ఒకరు పెళ్లి చేసుకుని సడెన్‌ షాకిచ్చారు. పైగా అది కూడా ఎంతో సింపుల్‌గా.. గుడిలో వివాహం చేసుకున్నారు. ఆ వివరాలు..

టాలీవుడ్‌ హీరోయిన్‌ ఒకరు పెళ్లి చేసుకుని సడెన్‌ షాకిచ్చారు. పైగా అది కూడా ఎంతో సింపుల్‌గా.. గుడిలో వివాహం చేసుకున్నారు. ఆ వివరాలు..

  • Published Jun 29, 2024 | 8:58 AMUpdated Jun 29, 2024 | 8:58 AM
పెళ్లి పీటలు ఎక్కిన టాలీవుడ్‌ హీరోయిన్‌.. ఎంతో సింపుల్‌గా గుడిలో వివాహం

నేటి కాలంలో వివాహం అంటే ఎంతో ఆడంబరంగా నిర్వహించే వేడుకగా మారిపోయింది. జీవితంలో ఒక్క సారే జరిగే తంతు కాబట్టి.. అప్పు చేసైనా సరే గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవాలని భావించే వారి సంఖ్య పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే పెళ్లి తంతులో జరిగే వేడుకల సంఖ్య కూడా అలానే పెరిగింది. నేటి కాలంలో పెళ్లి అంటే.. సంగీత్‌, హల్దీ, మెహందీ, బరాత్‌, రిసెప్షన్‌ ఇలా బోలేడు వేడుకలు ఉన్నాయి. ధనవంతులు మాత్రమే కాక సామాన్యుల ఇంట పెళ్లి వేడుకలో కూడా ఇవి సర్వసాధారణం అయ్యాయి. డబ్బులుండి ఇలాంటి వేడుకులు చేసుకుంటే సరి. కానీ నేటి కాలంలో చాలా మంది అప్పులు చేసి మరీ ఆడంబరాలకు పోతున్నారు. ఇలాంటి వాళ్ల మధ్య కొందరు సెలబ్రిటీలను చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. వారు ఎంతో సింపుల్‌గా.. తమ మనసుకు నచ్చినట్లు నడుచుకుంటారు. తాజాగా ఓ టాలీవుడ్‌ హీరోయిన్‌ ఇలానే చేసింది. సింపుల్‌గా గుడిలో వివాహం చేసుకుంది. ఆ వివరాలు..

టాలీవుడ్‌ హీరోయిన్‌ ఒకరు సడెన్‌గా వివాహం చేసుకుని అభిమానులకు షాక్‌ ఇచ్చారు. గుడిలో ఎంతో సింపుల్‌గా పెళ్లి తంతు జరిగింది. శనివారం నాడు ఉదయం సదరు నటి పెళ్లి పీటలెక్కింది. వివాహం అయిన వెంటనే ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. ఇంతకు ఆ నటి ఎవరంటే.. జై బోలో తెలంగాణ సినిమా గుర్తుందా.. అందులో హీరోయిన్‌గా నటించిన మీరా నందన్‌. అదేంటి ఆమెకు ఏడాది క్రితమే వివాహం అయినట్లు వార్తల్లో వచ్చింది అనుకుంటున్నారా.. కానీ అది వాస్తవం కాదు. ఈ రోజే మీరా నందన్‌ పెళ్లి అయ్యింది. ఈ వార్త తెలిసిన అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఆమె పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

మీరా నందన్‌ తెలుగమ్మాయి కాదు. మలయాళ బ్యూటీ. యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టింది. ఆ తర్వాత సింగర్‌గా మారింది. అనంతరం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం తమిళ, తెలుగు, కన్నడలోనూ పలు చిత్రాల్లో నటించింది. టాలీవుడ్‌లో ‘జై బోలో తెలంగాణ’, హితుడు, ఫోర్త్‌ డిగ్రీ వంటి సినిమాల్లో నటించింది. వీటిలో ‘జై బోలో తెలంగాణ’ సినిమా మంచి విజయం సాధించినా ఆమె కెరీర్‌కు ఉపయోగపడలేదు. గతేడాది ‘ఎన్నలుమ్ ఎంటే ఆలియా’ అనే మలయాళ సినిమాలో చివరగా నటించింది. ప్రస్తుతానికైతే కొత్త మూవీస్ ఏం చేయట్లేదు.

ఇప్పుడు శ్రీజు అనే యూకేకి చెందిన చార్టెడ్ అకౌంటెంట్‍‌ని వివాహం చేసుకుంది. వీరిద్దరికి ఏడాది క్రితం నిశ్చితార్థం జరగ్గా.. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. గురువాయుర్ దేవాలయంలో.. కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య వీళ్లు ఏడడుగులు వేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలని మీరానే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Meera Nandhaa (@nandan_meera)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss