iDreamPost

ప్రయాణికులకు శుభవార్త చెప్పిన TGSRTC.. భారీగా తగ్గిన ధర

  • Published Jun 29, 2024 | 9:05 AMUpdated Jun 29, 2024 | 9:05 AM

ప్రయాణికులకు ఆర్టీసీ సంస్థ భారీ శుభవార్త చెప్పింది. వాటి ధరను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల ప్రయాణికులపై భారం తగ్గనుంది. ఆ వివరాలు..

ప్రయాణికులకు ఆర్టీసీ సంస్థ భారీ శుభవార్త చెప్పింది. వాటి ధరను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల ప్రయాణికులపై భారం తగ్గనుంది. ఆ వివరాలు..

  • Published Jun 29, 2024 | 9:05 AMUpdated Jun 29, 2024 | 9:05 AM
ప్రయాణికులకు శుభవార్త చెప్పిన TGSRTC.. భారీగా తగ్గిన ధర

తెలంగాణ ఆర్టీసీ సంస్థ టీజీఎస్‌ఆర్టీసీ.. ప్రయాణికుల కోసం రకరకాల స్కీమ్‌లు, పథకాలు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇక తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. మహాలక్ష్మి పథకంలో భాగంగా.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్‌ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో రద్దీ భారీగా పెరిగింది. ఉచిత ప్రయాణం కారణంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే మహిళల సంఖ్య గతంతో పోలిస్తే.. ఇప్పుడు మరింత పెరిగిందని అధికారులు చెప్పుకొచ్చారు. ఇక పెరిగిన రద్దీకి తగ్గట్టుగా బస్సుల సంఖ్యను పెంచుతామని ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. ఈ క్రమంలో తాజాగా ఆర్టీసీ ప్రయాణికులకు మరొక శుభవార్త చెప్పింది. వాటి ధరను బాగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

తెలంగాణ రవాణా సంస్థ టీజీఎస్ఆర్‌టీసీ కీలక ప్రకటన చేసింది. తక్కువ ధరకే మంత్లీ పాస్ అందిస్తున్నట్లు వెల్లడించింది. దీని వల్ల చాలా మందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంతకు ఏ బస్‌ పాస్‌ ధర తగ్గించింది అంటే.. ఎలక్ట్రిక్‌ గ్రీన్‌ మెట్రో లగ్జరీ ఏసీ బస్సు పాస్‌ ధర భారీగా తగ్గిస్తూ.. నిర్ణయం తీసుకుంది. ఈ ఎలక్ట్రిక్‌ గ్రీన్‌ బస్సుల్లో ప్రయాణించే వారి సౌకర్యార్థం వాటి నెలవారీ పాస్‌ ధరను టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం భారీగా తగ్గించింది. గతంలో ఈ బస్‌ పాస్‌ ధర రూ.2,530 ఉండేది. అయితే ప్రయాణికుల సౌకర్యార్థం.. ఈ ధరను ఇటీవల ఏకంగా రూ.630 తగ్గించారు. దాంతో ఇప్పుడీ పాస్‌ను కేవలం రూ.1900కే అందజేస్తోంది. దీని గురించి టీజీఎస్ఆర్‌టీసీ ట్విట్టర్‌ వేదికగా ప్రకటన చేసింది.

ఈ బస్సు పాస్‌తో సికింద్రాబాద్-పటాన్‌ చెరువు (219 రూట్), బాచుపల్లి-వేవ్ రాక్ (195 రూట్) మార్గాల్లో నడిచే గ్రీన్‌ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు. అంతేకాదు, ఈ బస్‌పాస్‌తో గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులతో పాటు ఈ-మెట్రో ఎక్స్‌ ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సులలో ప్రయాణించే అవకాశం కల్పించింది టీజీఎస్‌ఆర్టీసీ. అయితే ఎయిర్‌పోర్ట్‌ మార్గంలో నడిచే పుష్ఫక్‌ ఏసీ బస్సుల్లో ఈ పాస్ చెల్లుబాటు కాదని తెలిపారు. ఇంకా మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సు పాస్ కలిగిన వారు రూ.20 కాంబినేషన్ టికెట్ తీసుకుని.. గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో ఒక ట్రిప్పులో ప్రయాణించవచ్చు. హైదరాబాద్‌లోని టీజీఎస్‌ఆర్టీసీ బస్సు పాస్ కేంద్రాలలో ఈ పాస్‌లను సంస్థ జారీ చేస్తోంది.

నగరంలో కాలుష్య నివారణ కోసం టీజీఎస్‌ఆర్టీసీ ప‌ర్యావ‌ర‌ణహిత‌మైన ఎలక్ట్రిక్‌ గ్రీన్ మెట్రో ల‌గ్జ‌రీ ఏసీ బ‌స్సులను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మొత్తం 50 గ్రీన్ మెట్రో ల‌గ్జ‌రీ ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ముందుగా వీటిల్లో 25 గ్రీన్‌ మెట్రో బస్సులను మూడు నెలల క్రితం మొద‌టి విడ‌త‌లో భాగంగా ప్రారంభించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి