iDreamPost
android-app
ios-app

అక్కడ ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన ‘కల్కి2898AD’!

  • Published Jun 29, 2024 | 11:53 AM Updated Updated Jun 29, 2024 | 11:53 AM

Kalki 2898AD: ప్రస్తుతం  ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసిన కల్కి మేనియానే కనిపిస్తోంది. వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయినా ఈ సినిమా కలెక్షన్లలో దూసుకెళ్లోంది. ఈక్రమంలోనే ఓ ప్రాంతంలో ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసింది.

Kalki 2898AD: ప్రస్తుతం  ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసిన కల్కి మేనియానే కనిపిస్తోంది. వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయినా ఈ సినిమా కలెక్షన్లలో దూసుకెళ్లోంది. ఈక్రమంలోనే ఓ ప్రాంతంలో ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసింది.

  • Published Jun 29, 2024 | 11:53 AMUpdated Jun 29, 2024 | 11:53 AM
అక్కడ ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన ‘కల్కి2898AD’!

కల్కి..కల్కి..కల్కి…ప్రస్తుతం ప్రపంచ  వ్యాప్తంగా ఎక్కడ చూసిన వినిపిస్తోన్న పేరు. నాగ్ అశ్వీన్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి2898 ఏడీ మూవీ గురువారం విడులైన సంగతి తెలిసిందే. ఈ సినిమా దెబ్బకు మిగిలిన సినిమాలు ఖాళీ అయ్యాయంటే అతిశయోక్తి కాదు. నాగ్ డైరెక్షన్, ప్రభాస్ యాక్షన్ తో ఈ సినిమాకు అఖండ విజయం సాధించింది. ఇక ఈ సినిమాలోని ప్రతి ఒక్క పాత్ర అద్భుతంగా ఉంది. హాలీవుడ్ రేంజ్ లో కల్కి సినిమాను దర్శఖకుడు తెరకెక్కించి.. ప్రేక్షకులను థియేటర్లలో కట్టి పడేశాడు. ఇక ప్రస్తుతం ఎక్కడ చూసిన కల్కి వసూళ్ల రికార్డులు సృష్టిస్తుంది.  అంతేకాక తాజాగా ఓ ప్రాంతంలో ఆల్ టైమ్ రికార్డును కల్కి సృష్టించింది. మరి… ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ప్రస్తుతం  ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసిన కల్కి మేనియానే కనిపిస్తోంది. వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయినా ఈ సినిమా కలెక్షన్లలో దూసుకెళ్లోంది. బాక్సాఫీస్‌ వద్ద ‘కల్కి2898ఏడీ’ వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్లో వచ్చిన ఈ మైథలాజికల్‌ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ తొలిరోజు రూ.191.5 కోట్లు భారీ వసూలు చేసినట్లు మూవీ టీమ్ తెలిపింది.  అంతేకాక టాలీవుడ్ లో రూ.100కోట్ల రికార్డును సాధించిన 11వ సినిమాగా కల్కి2898ఏడీ నిలిచింది. ఇక ఈ 11 సినిమాల్లో 5సినిమాలు ఉండటం విశేషం. తొలి రోజు రూ.100 కోట్లు పైన వసూలు చేసిన సినిమాల జాబితాలో మూడో స్థానంలో కల్కి ఉంది. తొలి రెండు స్థానాల్లో ఆర్ఆర్ఆర్ రూ.223 కోట్ల గ్రాస్‌, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ రూ.217 కోట్లు గ్రాస్ వసూలతో ఉన్నాయి. ఇక ఇప్పుడు మూడో స్థానంలో ‘కల్కి 2898 ఏడీ’  నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.191.5 కోట్లు వసూలు సాధించి మూడో స్థానంలోకి ఉంది.

Kalki All Time Record

తొలి రోజు తొలి షో నుంచే వరల్డ్ వైడ్ గా కల్కి మూవీకి పాజిటీవ్ టాక్ వచ్చింది. దీంతో కల్కి సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్ల వద్దకి భారీగా వస్తున్నారు. ఇక ఈ సినిమా మరో అరుదైన ఆల్ టైమ్ రికార్డును సాధించింది. ఉత్తర అమెరికాలో ఆల్ టైమ్ భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకూ అక్కడ 7 మిలియన్ డాలర్లకి పైగా వసూళ్లు కల్కి రాబట్టింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ.. మూవీ టీమ్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడిందించింది. వీకెండ్ కావడంతో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

జూన్ 27న  ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన కల్కి 2898 ఏడీ ట్రెమండస్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మైథలాజికల్ స్టోరీకి సైన్స్ ఫిక్షన్ జోడించి విజువల్ వండర్స్ క్రియేట్ చేశాడు దర్శకుడు నాగి. భారీ బడ్జెట్, భారీ కాస్టింగ్‌తో ఓ కళాఖండాన్ని చెక్కి.. ప్రేక్షకులకు అందించాడు. పాజిటివ్ రివ్యూస్, రేటింగ్‌తో నాలుగేళ్ల పాటు నాగ్ అశ్వీన్ పడ్డ కష్టానికి నిజమైన ప్రతిఫలం దక్కినట్లయ్యింది. అందుకు నిదర్శనమే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ. మరి.. నార్త్ అమెరికాలో కల్కి సృష్టించిన ఆల్ టైమ్ రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişmeritbet girişgrandpashabet