iDreamPost

రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. మహిళా సంఘాలకు Meeseva కేంద్రాలు

Meeseva centers: తెలంగాణలోని మహిళలకు రేవంత్ సర్కార్ తీపికబురును అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో మీ సేవ కేంద్రాల ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ఈ కేంద్రాలను మహిళా సంఘాలకు మంజూరు చేయనున్నది.

Meeseva centers: తెలంగాణలోని మహిళలకు రేవంత్ సర్కార్ తీపికబురును అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో మీ సేవ కేంద్రాల ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ఈ కేంద్రాలను మహిళా సంఘాలకు మంజూరు చేయనున్నది.

రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. మహిళా సంఘాలకు Meeseva కేంద్రాలు

తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నది. మహిళల అభివృద్ధికోసం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే మహిళల కోసం మహాలక్ష్మీ పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నది. ఇటీవల ప్రభుత్వ కార్యాలయాల్లో స్త్రీ శక్తి క్యాంటీన్ల ఏర్పాటును మహిళా సంఘాలకు అప్పగించింది రేవంత్ సర్కార్. తాజాగా స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో మీ సేవ కేంద్రాలను మహిళా సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో మహిళా సంఘాలకు లబ్ధి చేకూరనున్నది.

మీసేవ కేంద్రాల ద్వారా ప్రజలు పౌర సేవలను సులభంగా పొందుతున్నారు. కుల, ఆదాయ సర్టిఫికేట్లు, ఆధార్ సేవలు, ఇతర పన్ను చెల్లింపులు వంటి సేవలను మీసేవ ద్వారా పొందుతున్నారు. అయితే గ్రామీణ ప్రాంత ప్రజలకు మీసేవ సేవలను మరింత చేరువ చేసేందుకు గ్రామాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మహిళాశక్తి పథకం కింద రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు మీసేవ కేంద్రాలను మంజూరు చేయనుంది. ఈ నేపథ్యంలో మీసేవ కేంద్రాల ఏర్పాటుకు ముందుకొచ్చే సంఘాలను ఎంపిక చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. ఆగస్టు 15నాటికి గ్రామాల్లో మీసేవ కేంద్రాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఇప్పటి వరకు పట్టణ, నగర, మండల కేంద్రాల్లో ఉన్న మీసేవ కేంద్రాలను గ్రామాలకు విస్తరించాలని ప్రభుత్వం భావిస్తున్నది. గ్రామాతల్లో మీసేవ కేంద్రాల ఏర్పాటుతో ప్రజలకు సమయం, డబ్బు కూడా ఆదా అవుతుంది. అయితే గ్రామాల్లో ఏర్పాటు చేసే మీసేవ కేంద్రాలకు ఆపరేటర్లుగా ఇంటర్ చదివిన సభ్యురాళ్లను ఎంపిక చేయనున్నది. వీరికి మీసేవ కేంద్రం నిర్వహణ సేవలపై తర్ఫీదు ఇవ్వనున్నది. గ్రామైక్య సంఘాల పేరిట మహిళా శక్తి మీసేవ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఒక్కో మీసేవ కేంద్రానికి రూ.2.50 లక్షల రుణాన్ని స్త్రీనిధి ద్వారా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంజూరు చేస్తుంది. ఈ మీసేవ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ధేశించిన ఫీజుల మేరకు ప్రజలకు సేవలు అందనున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి