iDreamPost

Rashmi: యాంకర్‌ రష్మికి అరుదైన వ్యాధి.. అందుకే వాటికి దూరంగా ఉంటుందట!

  • Published Jun 29, 2024 | 10:30 AMUpdated Jun 29, 2024 | 10:30 AM

యాంకర్‌ రష్మి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న రష్మి.. వ్యక్తిగత జీవితంలో ఓ సమస్యతో బాధపడుతుందట. అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది. ఆ వివరాలు..

యాంకర్‌ రష్మి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న రష్మి.. వ్యక్తిగత జీవితంలో ఓ సమస్యతో బాధపడుతుందట. అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది. ఆ వివరాలు..

  • Published Jun 29, 2024 | 10:30 AMUpdated Jun 29, 2024 | 10:30 AM
Rashmi: యాంకర్‌ రష్మికి అరుదైన వ్యాధి.. అందుకే వాటికి దూరంగా ఉంటుందట!

రష్మి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఏళ్ల తరబడి.. బుల్లితెర మీద యాంకర్‌గా రాణిస్తోంది. టీవీ షోలు చేస్తూనే.. సినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరిక్షీంచుకుంటుంది రష్మి. ఇక సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ఫొటో షూట్‌లు మాత్రమే కాక.. సమాజంలో చోటు చేసుకుని అంశాల మీద స్పందిస్తుంటుంది. విమర్శలు వస్తాయని తెలిసినా సరే.. తాను అనుకున్న అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పుకొస్తుంది రష్మి. ప్రస్తుతం ఆమె బజర్దస్త్‌, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలకు యాంకర్‌గా చేస్తోంది. వీటితో పాటు సినిమాల్లో కూడా హీరోయిన్‌గా నటిస్తూ.. కెరీర్‌లో ఫుల్‌ బిజీగా ఉంది. ఈ క్రమంలో రష్మీకి సంబంధించిన ఓ ఆసక్తిర వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆమెకు అరుదైన వ్యాధి ఉన్నట్లు వెల్లడించింది. ఆ వివరాలు..

రష్మికి ఓ అనారోగ్య సమస్య ఉందట. తను ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు ఆమెనే స్వయంగా గతంలో వెల్లడించింది. ఇంతకు రష్మికి ఉన్న సమస్య ఏంటి అంటే.. `రూమటాయిడ్‌ సమస్య`. ఇదోక ఆటో ఇమ్యూన్‌ వ్యాధి అని చెప్పుకొచ్చింది. దీని కారణంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది అని వైద్యులు వెల్లడించారు. ఈ వ్యాధి వల్ల రష్మి బరువు పెరగడం, తగ్గడం చేస్తుందట. గతంలో సోషల్‌ మీడియాలో అభిమానులతో చిట్‌చాట్‌ సందర్భంగా రష్మి ఈ విషయాన్ని వెల్లడించింది. దీనిపై ఓ నెటిజన్ తన భర్త కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నాడు, దానికి చికిత్స ఏంటని అడిగింది. అందుకు రష్మి స్పందిస్తూ.. కొన్ని సలహాలు ఇచ్చింది.

ఈ సమస్యకి చికిత్స లేదని, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారానే ఫలితం ఉంటుందని రష్మి చెప్పుకొచ్చింది. ఈ సమస్య ఉన్న వారు ఆయుర్వేద మందులు వాడాలని తెలిపింది. అంతేకాక తాను ఈ సమస్య నుంచి బయటపడటం కోసం స్టెరాయిడ్స్ తీసుకున్నాను చెప్పుకొచ్చింది. తనకు 12ఏళ్ల వయసులో ఈ వ్యాధి తీవ్రతని తగ్గించేందుకు తీవ్రంగా నొప్పి ఉండే ఇంజిక్షన్లు తీసుకున్నట్టు తెలిపింది. ఆ తర్వాత ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందడం కోసం రష్మి వాళ్ల అమ్మ కొన్ని చిట్కాలు చెప్పిందట. అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చానని తెలిపింది రష్మి.

అంతేకాక ఒత్తిడి తగ్గించుకోవాలని, నెగటివిటీకి దూరంగా ఉండాలని, పాజిటివ్‌ మైండ్‌తో ఉండాలని చెప్పింది. నెగటివ్‌ ఉండేవాళ్లకి, వెనక్కి నెట్టేవాళ్లకి దూరంగా ఉండాలని చెప్పింది రష్మి. తాను ఇదే ఫాలో అవుతున్నాని చెప్పుకొచ్చింది. అందుకే తన మీద ఎన్ని విమర్శలు వచ్చినా సరే రష్మి మాత్రం తన పాజిటివిటీని కోల్పోదు. ముక్కుసూటిగా సమాధానం చెబుతంది. అయితే ఇది ఆరేళ్ల క్రితం నాటి విషయం. మరి రష్మి ఈ సమస్య నుంచి కోలుకుందా లేదా అనే అంశం మీద క్లారిటీ లేదు. ప్రస్తుతం రష్మి జబర్దస్త్‌, శ్రీదేవి డ్రామా కంపెనీలకు యాంకర్‌గా రాణిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి