iDreamPost

బిగ్ బ్రేకింగ్: పోలీసుల అదుపులో నటి హేమ

Actress Hema In Police Custody: గత కొన్ని రోజులుగా బెంగళూరు రేవ్ పార్టీ కేసు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో నటి హేమ కూడా ఇరుక్కున్నారు. ఆమెపై బెంగళూరు పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. తాజాగా ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Actress Hema In Police Custody: గత కొన్ని రోజులుగా బెంగళూరు రేవ్ పార్టీ కేసు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో నటి హేమ కూడా ఇరుక్కున్నారు. ఆమెపై బెంగళూరు పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. తాజాగా ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బిగ్ బ్రేకింగ్: పోలీసుల అదుపులో నటి హేమ

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటి హేమను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెలబ్రిటీలు, డ్రగ్స్ కి అవినాభావ సంబంధం ఉంటుందేమో. ఎక్కడ ఏ డ్రగ్స్ కేసు ఫైల్ అయిన అందరి ఫోకస్ టాలీవుడ్ పైనే ఉంటుంది. టాలీవుడ్ లో డ్రగ్స్ దందా ఎక్కువ జరుగుతుందని.. సెలబ్రిటీలు డ్రగ్స్ ఎక్కువగా వినియోగిస్తుంటారని ఆరోపణలు వస్తుంటాయి. ఆ మధ్య పలువురు సెలబ్రిటీలు కూడా డ్రగ్స్ కేసుకు సంబంధించి విచారణకు హాజరయ్యారు. ఇలా పలు సందర్భాల్లో సెలబ్రిటీలు విచారణకు హాజరవ్వడం, క్లీన్ చిట్ పై బయటకు రావడం చూశాం. తాజాగా హేమ కూడా అలా వస్తుందని ఆమె అనుకున్నారు. కానీ ఆమె ఈ విషయంలో ఫెయిల్ అయ్యారు.

గత కొన్ని రోజులుగా బెంగళూరు రేవ్ పార్టీ కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం ఈ కేసులో టాలీవుడ్ నటి హేమ ఉండడం. గత కొంతకాలం కిందట నటి హేమ బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి హాజరైన విషయం తెలిసిందే. ఈ పార్టీలో టాలీవుడ్ సెలబ్రిటీలు సహా పలువురు ఇతర సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే ఈ పార్టీలో సెలబ్రిటీలు డ్రగ్స్ వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పలువురు సెలబ్రిటీలకు నోటీసులు కూడా వెళ్లాయి. వారిలో సినీ నటి హేమ కూడా ఉన్నారు. అయితే తానేమీ రేవ్ పార్టీలో పాల్గొనలేదని.. గెస్ట్ హౌస్ లో ఉన్నా అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు. వరుస పెట్టి వీడియోలని రిలీజ్ చేశారు. బిర్యానీ వండిన వీడియో కూడా ఆమె రిలీజ్ చేసింది. అయితే అవేమీ నిజం కాదని, హేమ రేవ్ పార్టీలో పాల్గొందని బెంగళూరు పోలీసులు కుండబద్దలుకొట్టినట్లు చెప్పారు.

ఆమె వద్ద బ్లడ్ శాంపిల్స్ ని సేకరించిన పోలీసులు టెస్ట్ చేయగా అందులో పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో హేమ కూడా రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు పంపించడం కూడా జరిగింది. విచారణకు హాజరు కావాలని ఆమెకు నోటీసులు పంపినా హేమ లెక్క చేయలేదు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. తాను అమాయకురాలినని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ ఆమె చెప్పేది అబద్ధాలు అని తోటి నటి కరాటే కళ్యాణి సైతం కొట్టిపడేశారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమ ఉందని తెలియగానే కరాటే కళ్యాణిపై ఆమెపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఆమెకు శిక్ష తప్పదని, కర్మ వదిలిపెట్టదని కరాటే కళ్యాణి అన్నారు. పోలీసులు సైతం హేమ హస్తం ఉందని నిర్ధారణకు రావడంతో ఆమెకు నోటీసులు పంపించారు. ఆమె పట్టించుకోకపోవడంతో బెంగళూరు సీసీబీ పోలీసులు హేమాను అదుపులోకి తీసుకున్నారు. రేపు ఆమెను కోర్టులో హాజరుపరచనున్నారు.  

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి