iDreamPost
android-app
ios-app

Yuvraj Singh: ‘గుడ్ నైట్ బామ్మర్ధులు’ ఇంగ్లండ్ ప్లేయర్లను నెక్ట్స్ లెవల్లో టీజ్ చేసిన యువీ! ట్వీట్ వైరల్..

  • Published Jun 28, 2024 | 4:30 PM Updated Updated Jun 28, 2024 | 4:30 PM

ఇంగ్లండ్ పై విజయం తర్వాత టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది. అందులో నెక్ట్స్ లెవల్లో ఇంగ్లండ్ ఆటగాళ్లను టీజ్ చేశాడు యువీ.

ఇంగ్లండ్ పై విజయం తర్వాత టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది. అందులో నెక్ట్స్ లెవల్లో ఇంగ్లండ్ ఆటగాళ్లను టీజ్ చేశాడు యువీ.

  • Published Jun 28, 2024 | 4:30 PMUpdated Jun 28, 2024 | 4:30 PM
Yuvraj Singh: ‘గుడ్ నైట్ బామ్మర్ధులు’ ఇంగ్లండ్ ప్లేయర్లను నెక్ట్స్ లెవల్లో టీజ్ చేసిన యువీ! ట్వీట్ వైరల్..

టీ20 వరల్డ్ కప్ 2022 సెమీ ఫైనల్లో టీమిండియాను 10 వికెట్ల తేడాతో ఓడించింది ఇంగ్లండ్. ఇప్పుడు ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా. 2024 టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో 68 పరుగుల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఇంగ్లండ్ ను చిత్తుగా ఓడించి.. ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఇక ఇంగ్లండ్ పై విజయం తర్వాత టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది. అందులో నెక్ట్స్ లెవల్లో ఇంగ్లండ్ ఆటగాళ్లను టీజ్ చేశాడు యువీ.

టీ20 ప్రపంచ కప్ ఫైనల్ కు చేరిన టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సోషల్ మీడియా వేదికగా పొగడ్తలు కురిపిస్తున్నారు ప్రముఖ, దిగ్గజ క్రికెటర్లు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశాడు. అందులో ఏముందంటే? “టీమిండియా ప్లేయర్లు బాగా ఆడారు. బామ్మర్ధులూ గుడ్ నైట్” అంటూ నవ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేశాడు. దాంతో ఈ ట్వీట్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అయితే యువీ అలా ఇంగ్లండ్ ప్లేయర్లను బామ్మర్ధులు అనడానికి కారణం లేకపోలేదు.

యువరాజ్ సింగ్ బ్రిటీష్ మోడల్ అయిన హేజిల్ కిచ్ ను ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. ఆమె ఇంగ్లండ్ లోని ఎస్సెక్స్ లో జన్మించింది. దాంతో ఆ దేశంతో యువరాజ్ కు బంధుత్వం  ఏర్పడింది. ఆ దేశం అమ్మాయిని చేసుకున్నాడు కాబట్టి.. ఆటగాళ్లను అలా సంభోదించాడు. ఇక ఈ పోస్ట్ కాస్త వైరల్ కావడంతో.. నీ ప్రజెంట్ ఆఫ్ మైండ్ కు సలామ్ అంటూ ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ యువీ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. టీ20 వరల్డ్ కప్ లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన రికార్డు ఇప్పటికీ యువీ పేరిటే ఉంది. అతడు 2007 పొట్టి ప్రపంచ కప్ లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో ఆరు సిక్సర్లు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. మరి యువరాజ్ ఇంగ్లండ్ ఆటగాళ్లను నెక్ట్స్ లెవల్లో టీజ్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss