iDreamPost

కామెడీ అండ్ క్రైమ్ కాంబోతో సూపర్ వెబ్ సిరీస్! OTTలోకి వచ్చేస్తోంది!

  • Published Apr 06, 2024 | 3:09 PMUpdated Apr 06, 2024 | 3:09 PM

బయట ఎండలు మండిపోతున్నాయి.. ఎక్కడికి వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు కాబట్టి.. చక్కగా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేసేయొచ్చు. ఈ క్రమంలో మరొక క్రైమ్ వెబ్ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది. ఆ సిరీస్ ఏంటో చూసేద్దాం.

బయట ఎండలు మండిపోతున్నాయి.. ఎక్కడికి వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు కాబట్టి.. చక్కగా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేసేయొచ్చు. ఈ క్రమంలో మరొక క్రైమ్ వెబ్ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది. ఆ సిరీస్ ఏంటో చూసేద్దాం.

  • Published Apr 06, 2024 | 3:09 PMUpdated Apr 06, 2024 | 3:09 PM
కామెడీ అండ్ క్రైమ్ కాంబోతో సూపర్ వెబ్ సిరీస్! OTTలోకి వచ్చేస్తోంది!

ఓటీటీలో రిలీజ్ అయ్యే సస్పెన్స్ సినిమాలన్నా.. క్రైమ్ థ్రిల్లర్స్ అన్నా ఎవరికీ మాత్రం ఇష్టం ఉండదు. ఈ మధ్య కాలంలో సినిమాలకన్నా కూడా వెబ్ సిరీస్ ల ను మరింత ఆదరిస్తున్నారు ఆడియన్స్. వెబ్ సిరీస్ లు ఏమి సినిమాలకు తక్కువ కాదన్నంత రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో కొన్ని వెబ్ సిరీస్ లు, సినిమాలు ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా సైలెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అయిపోతుంటాయి. మరి కొన్నిటికి ఎటువంటి బజ్ ఉండదు. అయినా కూడా అవన్నీ సూపర్ సక్సెస్ అయిపోతూ ఉంటాయి. ఇక ఇప్పుడు తాజాగా హీరోయిన్ ధన్య బాలకృష్ణ మెయిన్ లీడ్ లో నటించిన “శర్మ & అంబానీ” క్రైమ్ వెబ్ సిరీస్ ఓటీటీలోకి రాబోతుంది. మరి, ఈ సిరీస్ ఎప్పుడు, ఏ ఓటీటీలో ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అయిపోతుందో చూసేద్దాం.

ధన్య బాలకృష్ణ మెయిన్ లీడ్ లో నటించిన .. సరికొత్త క్రైమ్ వెబ్ సిరీస్ శర్మ & అంబానీ. ఈ సిరీస్ లో ధన్య బాలకృష్ణతో పాటు భరత్ తిప్పిరెడ్డి, కేశవ కర్రి, మానస్ అద్వైత్, రాజశేఖర్ నర్జాలా, విశ్వనాథ్ మాండళిక, యష్. రూపక్, అభిషేక్, హనుమంత్ రావు, అవినాష్ దేవిరెడ్డి, స్మిత రామన్న వంటి వాళ్లు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.కాగా ఈ వెబ్ సిరీస్ కు కార్తీక్ సాయి దర్శకత్వం వహించారు. అంతేకాకుండా పార్వతీశం గురు, కార్తీక్ సాయి, భరత్ తిప్పిరెడ్డిలు ఈ వెబ్ సిరీస్ కు రైటర్లుగా పని చేశారు. ఒక వైపు కామెడీ పండిస్తూనే మరోవైపు మంచి క్రైమ్ ను కూడా ఈ సిరీస్ లో చూపించబోతున్నారు. కాగా ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ లో ఏప్రిల్ 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఎక్స్ వేదికగా ఈ సంస్థ ఈ విషయాన్నీ ప్రకటించింది.

ఇక “శర్మ & అంబానీ” సిరీస్ కథ విషయానికొస్తే.. శర్మ అనే వ్యక్తి.. పోయిన వజ్రాలను దక్కించుకునే క్రమంలో ఒక డెంజరస్ గ్యాంగ్ తో గొడవకు దిగుతారు. అనుకోకుండా.. ఈ క్రమంలో ఆయన ధన్య బాలకృష్ణతో ప్రేమలో పడతారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య ప్రేమ ఏమౌతుంది. అసలు ఆ గ్యాంగ్ నుంచి ఇతను బయటపడగలడా లేదా.. ఆ వజ్రాలు దొరుకుతాయా లేదా ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సిరీస్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే మరి. తాజాగా ఈ సిరీస్ నుంచి ఒక సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడు ఓటీటీ లో ఎన్నో సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటు ఈ సిరీస్ కూడా ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి, ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి