iDreamPost

రెండేళ్ల తర్వాత OTT లోకి వచ్చిన ఫీల్ గుడ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

  • Published Jun 28, 2024 | 11:40 AMUpdated Jun 28, 2024 | 11:40 AM

OTT Telugu Family Drama: కొన్ని సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయినా నెల రోజుల లోపే ఓటీటీ లోకి వస్తుంటే.. కొన్ని సినిమాలు మాత్రం నెలలు, సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఓటీటీ లోకి వస్తున్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే.

OTT Telugu Family Drama: కొన్ని సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయినా నెల రోజుల లోపే ఓటీటీ లోకి వస్తుంటే.. కొన్ని సినిమాలు మాత్రం నెలలు, సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఓటీటీ లోకి వస్తున్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే.

  • Published Jun 28, 2024 | 11:40 AMUpdated Jun 28, 2024 | 11:40 AM
రెండేళ్ల తర్వాత OTT లోకి వచ్చిన ఫీల్ గుడ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

ఇప్పుడు ఓటీటీ లకు పెరుగుతున్నా ఆదరణ వలనో ఏమో తెలియదు కానీ.. ఈ మధ్య కాలంలో మాత్రం థియేటర్ లో రిలీజ్ అయినా కొత్త సినిమాలతో పాటు.. కొన్ని నెలలు సంవత్సరాలు క్రితం రిలీజ్ అయినా సినిమాలు కూడా ఓటీటీ లో ఎంట్రీ ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ తెలుగు కామెడీ సినిమా థియేటర్ లో రిలీజ్ అయినా రెండేళ్ల తర్వాత ఓటీటీ లోకి వచ్చింది. ఇక ఈ మధ్య కాలంలో ఓ మంచి కామెడీ సినిమా వచ్చి చాలా కాలమే అయింది కాబట్టి.. ఈ వీకెండ్ ఈ సినిమా బెస్ట్ ఛాయస్ అని చెప్పేయొచ్చు. మరి ఈ సినిమా ఏంటి .. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా పేరు “విందు భోజనం“. ఈ సినిమాకు కార్తీక్ దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాలో అఖిల్ రాజ్, ఐశ్వర్య హాళ్ళక్కల్ హీరో హీరోయిన్స్ గా నటించారు. 2022 లో ఈ సినిమా థియేటర్స్ లో అయింది. రిలీజ్ కు ముందు ట్రైలర్, టీజర్ ఈ సినిమాపై ఆసక్తి కలిగించినా కానీ రిలీజ్ తర్వాత మాత్రం ఎందుకో ఈ సినిమా.. కమర్షియల్ గా ఆకట్టుకోలేకపోయింది. మరి అప్పటినుంచి ఇప్పటివరకు ఈ సినిమా ఎందుకు ఓటీటీ లో రిలీజ్ చేయలేదో తెలియదు కానీ.. ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చేసింది. ఈ సినిమా జూన్ 28 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి ఈ వీకెండ్ ఎంచక్కా ఫ్యామిలీతో కలిసి ఈ కామెడీ సినిమాను చూసేయండి.

Vindu bojanam

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమా అఖిల్ రాజ్ ఓ చెఫ్.. తన తండ్రి కట్టించిన హోటల్ లోనే చెఫ్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ హోటల్ ను అతని తమ్ముడు అమ్మేయాలని చూస్తూ ఉంటాడు. కానీ అఖిల్ మాత్రం దానికి ఒప్పుకోడు. తన తండ్రి ఇచ్చిన మాటకు కట్టుబడి .. ఆ హోటల్ ను తనే రన్ చేయాలనీ అనుకుంటాడు. మరి వీరిద్దరిలో ఎవరి మాట నెగ్గుతుంది. అన్నదమ్ములు ఇద్దరిలో గెలుపు ఎవరిదీ ! ఈ క్రమంలో హీరో ప్రేమ వ్యవహారం ఎలా మొదలవుతుంది ! ప్రేమలోఅతను గెలుస్తాడా లేదా! ప్రేమతో పాటు అతను హోటల్ ను ఎలా కాపాడుకుంటాడు ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. థియేటర్ లో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయినా కూడా.. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను మాత్రం ఈజీగా మెప్పించేస్తుందని చెప్పి తీరాలి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి