iDreamPost

OTT Suggestion: భర్త ఊరిలో లేని సమయంలో ఫ్రెండ్ తో భార్య ఆ పని! OTT లో ఈ మూవీ అన్ని ట్విస్ట్ లే !

  • Published Jun 28, 2024 | 1:43 PMUpdated Jun 28, 2024 | 1:43 PM

OTT Best Suspense Thriller: మలయాళం సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్న మాట వాస్తవమే.. అయితే రెగ్యులర్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో కాకుండా ఇంకా ఇతర ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో కూడా మంచి మంచి సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటి ఓ సినిమా గురించే.

OTT Best Suspense Thriller: మలయాళం సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్న మాట వాస్తవమే.. అయితే రెగ్యులర్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో కాకుండా ఇంకా ఇతర ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో కూడా మంచి మంచి సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటి ఓ సినిమా గురించే.

  • Published Jun 28, 2024 | 1:43 PMUpdated Jun 28, 2024 | 1:43 PM
OTT Suggestion: భర్త ఊరిలో లేని సమయంలో ఫ్రెండ్ తో భార్య ఆ పని! OTT లో ఈ మూవీ అన్ని ట్విస్ట్ లే !

సాధారణంగా మన చుట్టూ జరిగే సంఘటనల నుంచే సినిమాలను తీస్తూ ఉంటారు మేకర్స్. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. డబ్బు మీద ఆశ.. పెళ్ళైనా కూడా వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం.. దాని కారణంగా కుటుంబాలు నాశనం అయిపోవడం. ఇలాంటివి నిత్యం సమాజంలో చూస్తూనే ఉంటాము. ఇలాంటి కాన్సెప్ట్ మీద వచ్చిన సినిమా గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది. మలయాళం సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్న మాట వాస్తవమే. అయితే అయితే రెగ్యులర్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో కాకుండా ఇంకా ఇతర ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో కూడా మంచి మంచి సినిమాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

ఈ సినిమా కథేంటంటే.. షైనీ , రేజి అనే భార్య భర్తలు ఉంటారు. వారికి 5 సంవత్సరాల కొడుకు ఉంటాడు. రేజి సిటీలో జాబ్ చేస్తూ ఇంటికి డబ్బులు పంపిస్తూ ఉంటాడు. షైనీ తన అత్తమామలతో, కొడుకుతో కలిసి ఊరిలో ఉంటుంది. అత్త మంచాన పడడంతో.. షైనీ తన మామతో కలిసి ఆమెకు సేవ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో భర్త దూరంగా ఉండడంతో.. షైనీ తన కాలేజీ మేట్ కిరణ్ తో వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంటుంది. తన ఎంజాయిమెంట్ కు వాళ్ళ అత్తా మామలు అడ్డుగా ఉన్నారని.. వాళ్ళని ఎలాగైనా చంపేయాలని కిరణ్ తో చెప్తుంది. అనుకున్న ప్లాన్ ప్రకారమే.. షైనీ , కిరణ్ ఇద్దరు కలిసి వాళ్ళ అత్తను చంపేయాలని అనుకుంటారు. కానీ ఇంతలో వాళ్ళ మామ ఇదంతా చూస్తాడు. ఈ క్రమంలోనే వాళ్లిద్దరినీ ఓ రూమ్ లో బందించేస్తాడు. ఆ తరవాత ఏం జరిగింది! సిటీలో ఉన్న రేజికి ఈ విషయం తెలిసిందా ! షైనీ , కిరణ్ లు అనుకున్నట్లుగా వాళ్ళ అత్త మమాలను చంపేశారా ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

Utal

ఇంతకీ ఈ సినిమా పేరు ఏంటంటే “ఉడాల్”. డబ్బు మీద ఆశతో జీవిస్తే.. ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేది ఈ సినిమాలో క్లియర్ గా చూపించారు. ఈ సినిమా చివరి వరకు కూడా సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో కొనసాగుతూ ఉంటుంది. అయితే ఈ సినిమాను పిల్లలతో కలిసి కాకుండా ఒంటరిగా చూస్తే బెటర్. ఈ సినిమా ప్రస్తుతం సైనా ప్లే అనే ఓటీటీ లో అందుబాటులో ఉంది. ఈ సినిమాను ఇప్పటివరకు ఎవరైనా మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి..https://sainaplay.com/movie/udal/brcbhheyf26u

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి