iDreamPost

ఈరోజు నుంచి OTTలో 3 తెలుగు మూవీస్.. ఎక్కడంటే?

  • Published Jun 28, 2024 | 11:27 AMUpdated Jun 28, 2024 | 11:27 AM

This Week OTT Movies: ఇప్పటికే ఓ వైపు కల్కి సినిమాతో థియేటర్లు కళకళాడుతున్న వేళా ఓటీటీలో మాత్రం కాస్త ఎంటర్టైన్మెంట్ తగ్గిందనే చెప్పవచ్చు. ఎందుకంటే అన్ని పాత సినిమాాలతో ఓటీటీ ప్రియులకు బోరింగ్ ఉండటంతో.. ఇక ప్రేక్షకులకు జోష్ ను పెంచడానికి తాజాగా ఓటీటీలో 3 కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చాయి. ఇంతకి ఆ కొత్త సినిమాలేవంటే..

This Week OTT Movies: ఇప్పటికే ఓ వైపు కల్కి సినిమాతో థియేటర్లు కళకళాడుతున్న వేళా ఓటీటీలో మాత్రం కాస్త ఎంటర్టైన్మెంట్ తగ్గిందనే చెప్పవచ్చు. ఎందుకంటే అన్ని పాత సినిమాాలతో ఓటీటీ ప్రియులకు బోరింగ్ ఉండటంతో.. ఇక ప్రేక్షకులకు జోష్ ను పెంచడానికి తాజాగా ఓటీటీలో 3 కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చాయి. ఇంతకి ఆ కొత్త సినిమాలేవంటే..

  • Published Jun 28, 2024 | 11:27 AMUpdated Jun 28, 2024 | 11:27 AM
ఈరోజు నుంచి OTTలో 3  తెలుగు మూవీస్.. ఎక్కడంటే?

దేశవ్యాప్తంగా ఓవైపు కల్కి ఫీవర్ తో థియేటర్లు కళకళలాడుతున్నాయి. పైగా ఎక్కడ చూసిన హోస్ ఫుల్ బోర్డలతో థియేటర్లు సందడి చేస్తున్నాయి. అసలే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్,నాగ్ ఆశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన భారీ బడ్జెట్ సినిమా కావడంతో.. చాలామంది ఈ సినిమాను చూడటానికి థియేటర్ల వెంట క్యూ కడుతున్నారు. మరో వైపు కల్కి సినిమా హిట్ టాక్ రావడంతో ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా చూడటానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా ఎక్కడ చూసిని మూవీ లవర్స్ తో థియేటర్లు సందడి వాతవరణం కనిపిస్తున్నా వేళా.. సినీ ప్రియులకు మరో బంఫర్ ఆఫర్ న్యూస్ అందింది. కాగా, ఇప్పటి వరకు ఓటీటీలో అంత పాత సినిమాలతోనే బోరింగ్ కొడుతున్నా వేళ.. ఆడియాన్స్ కాస్త హుషారు ఇచ్చేలా మూడు కొత్త సినిమాలు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.

ఇక ఈ న్యూస్ కాస్త ఓటీటీ ప్రియులకు డబుల్ బొనాంజా అనే చెప్పవచ్చు. ఇకపోతే తెలుగులో వచ్చే ఈ మూడు సినిమాలు మంచి క్రేజీ మూవీస్ కావడం విశేషం. ఇక ఈ వీకెండ్ ను సెలబ్రిట్ చేసుకునేందుకు థియేటర్లో మంచి సాలిట్ హిట్ మూవీతో పాటు ఓటీటీలో కూడా 3 కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉన్నాయి. మరి ఇంతకి ఆ మూడు సినిమాలు ఏవి.. ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో వస్తున్నయో ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అమెజాన్ ప్రైమ్‌: సత్యభామ

కాజల్ అగర్వాల్ మొదటిసారిగా లేడి ఓరియెంటెడ్ మూవీలో నటించిన సినిమా ‘సత్యభామ’. అయితే క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన ఈ చిత్రాన్ని సుమన్ చిక్కాల తెరకెక్కించారు. ఇక ఈ సినిమా ఈనెల అనగా జూన్ 7వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అయితే ఇందులో కాజల్ మొదటిసారిగా పవర్‌ఫుల్‌ పోలీసు పాత్రలో అలరించింది. ఇకపోతే సత్యభామ మూవీ విడుదలైన తొలి రోజు నుంచే మంచి డీసెంట్ టాక్ తెచ్చుకుంది. కానీ, ఆ తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో థియేటర్లలో అంతగా అలరించ లేకపోయింది. దీంతో ఓటీటీలో అప్పటి నుంచి ఓటీటీలో వస్తుందనే టాక్ జోరుగా వినిపించింది. ఈ క్రమంలోనే తాజాగా నేడు ఎలాంటి ప్రకట లేకుండా అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసింది. మరి ఇప్పటి వరకు కాజల్ సత్యభామ మూవీని చూడకుండా ఉంటే వెంటనే ఓటీటీలో మిస్ చేయకుండా చూసేయండి.

Satyabhama

నెట్‌ఫ్లిక్స్‌: భజే వాయు వేగం
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఇటీవలే నటించిన మూవీ ‘భజే వాయు వేగం’. ఇక ఈ మూవీని బ్యానర్లో ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కార్తికేయ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇకపోతే ఈ మూవీ మే 31న థియేటర్లలో రిలీజ్ మంచి హిట్ టాక్ అందుకున్న విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు ఈ మూవీ కూడా ఓటీటీలో అలరించడానికి సిద్ధంగా ఉంది.కాగా, భజే వాయు వేగం మూవీ నేటి నుంచి నెట్ ఫ్లిక్స్ లోకి స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చేసింది. మరి ఈ మూవీ కూడా థియేటర్లలో ఇప్పటి వరకు చూడకుండా ఉంటే వెంటనే చూసేయండి.

Bhaje Vaayu Vegam

ఆహా: లవ్ మౌళి

చాలా రోజుల తర్వాత నవదీప్ ‘లవ్ మౌళి’  అనే బో*ల్డో మూవీలో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ మూవీ ట్రెండ్ కి తగ్గట్లు ఎక్కువ బో*ల్డోనెస్ తో శృతిమించిపోయారు. అయితే ఈ సినిమా యువతకు మాత్రమే కొంతలో కొంతమేర నచ్చిన చిత్రం. అయితే యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ నిన్నటి నుంచే ప్రీమియర్స్ అనే క్యాప్షన్ తో ఆహాలో స్ట్రీమింగ్ కు అందుబాటులో వచ్చింది. కాగా, ఈరోజు నుంచి అందరికి అందుబాటులోకి రానుంది.  మరి ఈ సినిమాను ఆహాలో మిస్ చేయకుండా చూసేయవచ్చు.

Love Mouli

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి