iDreamPost

ఇదేం పైత్యం తల్లి.. రీల్స్‌ పిచ్చితో భవనంపై నుంచి గాల్లో వేలాడుతూ.. ఆఖరికి

సోషల్ మీడియా పట్ల యువతలో క్రేజ్ మామూలుగా లేదు. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. ఓ యువతి ఫేమస్ అయ్యేందుకు ఏకంగా భవనంపై నుంచి వేలాడుతూ రీల్స్ చేసింది.

సోషల్ మీడియా పట్ల యువతలో క్రేజ్ మామూలుగా లేదు. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. ఓ యువతి ఫేమస్ అయ్యేందుకు ఏకంగా భవనంపై నుంచి వేలాడుతూ రీల్స్ చేసింది.

ఇదేం పైత్యం తల్లి.. రీల్స్‌ పిచ్చితో భవనంపై నుంచి గాల్లో వేలాడుతూ.. ఆఖరికి

స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చాక మానవుని లైఫ్ స్టైల్ మారిపోయింది. బడ్జెట్ ధరల్లోనే స్మార్ట్ ఫోన్స్ లభిస్తుండడంతో వీటి వినియోగం ఎక్కువైపోయింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాకు జనాలు అడిక్ట్ అయిపోతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా సోషల్ మీడియాలో రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. తక్కువ సమయంలోనే ఫేమస్ అయ్యేందుకు ప్రమాదకర రీతిలో రీల్స్ చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. లైకుల కోసం, కామెంట్ల కోసం నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి రీల్స్ చేస్తున్నామో అన్న సంగతి మరిచి ప్రవర్తిస్తున్నారు నేటి యువత. ఈ క్రమంలో ఓ యువతి రీల్స్ పిచ్చితో ఎత్తైన భవనంపై నుంచి గాల్లో వేలాడుతూ రీల్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

సోషల్ మీడియాలో కొందరు డ్యాన్సులతో, మరికొందరు ఫన్నీ వీడియోస్ తో, క్రియేటీవ్ కంటెంట్ తో రీల్స్ చేసి సెలబ్రిటీ అయిపోవాలని ఒళ్లు మరిచి రీల్స్ చేస్తున్నారు. నడిరోడ్డుపై డ్యాన్సులు చేస్తూ పబ్లిక్ ఇబ్బందులు కలిగే వ్యవహరిస్తున్నారు. రీల్స్ మోజులో పడి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. ఇటీవలి కాలంలో చాలా మంది యువత రీల్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయినా యువతలో మాత్రం మార్పు రావడం లేదు. ఓయువతి సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఏకంగా బిల్డింగ్ పై నుంచి వేలాడుతూ రీల్స్ చేసింది. పూణే – జంబుల్‌వాడి స్వామినారాయణ మందిర్ సమీపంలోని ఒక పాడుబడిన భవనంపై ఇలా ప్రాణాలను ప్రమాదంలో నెట్టి స్టంట్స్ చేసింది ఆ యువతి.

వీడియోలో చూసినట్లైతే.. పూణే నగరంలో ప్రధాన రహదారికి ఆనుకుని ఓ ఎత్తైన భవనం ఉంది. ఆ భవనంపై రీల్స్ చేసేందుకు రెడీ అయ్యారు ఇద్దరు యువకులు ఓ యువతి. ఇంకేముంది ముగ్గురు కలిసి భవనంపైకి ఎక్కారు. ఓ యువకుడు సెల్ ఫోన్ లో ఆ దృష్యాలను చిత్రీకరిస్తుండగా.. మరోయువకుడు యువతి చేయి పట్టుకుని గాల్లోకి జార విడిచాడు. కొన్ని సెకన్ల పాటు ఆ యువతి గాల్లో వేలాడుతూ కనిపించింది. ఏమాత్రం పొరపాటు జరిగినా ప్రాణాలు గాల్లో కలవాల్సిందే. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇదేం పైత్యం తల్లీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ దృష్యాలు నెట్టింటా వైరల్ గా మారాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి