iDreamPost

అవసరం కోసం ఆ పని చేసిన వివాహిత.. అదే ప్రాణం తీసింది!

జీవితం అంటే అనుకున్నట్లు జరగదు. అయినా పరిస్థితులకు తగినట్లు మనం మారిపోవాలి.. కానీ కొందరు మహిళలు మాత్రం తమ తెలియక చేసిన తప్పులు.. వారిని వేధించి..చివరకు జీవితాన్ని ముగించేలా చేస్తాయి..

జీవితం అంటే అనుకున్నట్లు జరగదు. అయినా పరిస్థితులకు తగినట్లు మనం మారిపోవాలి.. కానీ కొందరు మహిళలు మాత్రం తమ తెలియక చేసిన తప్పులు.. వారిని వేధించి..చివరకు జీవితాన్ని ముగించేలా చేస్తాయి..

అవసరం కోసం ఆ పని చేసిన వివాహిత.. అదే ప్రాణం తీసింది!

ప్రతి ఒక్కరు తమ జీవితాన్ని ఎంతో అందంగా ఊహించుకుంటారు. అంతేకాక అలా సంతోషంగా ఉండేందుకు ఎంతో కష్ట పడుతుంటారు. కొందరు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తుంటారు. తమ జీవితాన్ని సంతోషంగా గడుపుతుంటారు. ఇద్దరిలో ఎవరో ఒకరు చేసే తప్పు..చివరకి వారి జీవితాలను నరకం పడేస్తుంది. కావాల్సి చేయకపోయినా..క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం వారి జీవితాలను చీకటిలోకి నెట్టేస్తుంది. తాజాగా ఓ మహిళ విషయంలో అదే జరిగింది. అవసరం కోసం ఆమె చేసిన పని.. చివరకు అదే ఆమెను బలి తీసుకుంది. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

కేరళ రాష్ట్రం ఎర్నాకుళం జిల్లా పెరుంబవూరు ప్రాంతంలోని పులియంపిల్లి మొగల్ నెటుంపురా అనే గ్రామంలో విష్ణు, చాందిని(29) అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. విష్ణు స్థానికంగా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇక చాందిని కూడా ఇతర పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంది. వీరికి కొంతకాలం క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులు ఇద్దరు ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు.

చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు ఉన్న కూడా కలిసి పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. బుధవారం చాందిని కుటుంబ సభ్యులకు షాకిచ్చింది. పెరుంబవూరు ప్రాంతంలోని తన ఇంట్లో చాందిని ఊరేసుకుని కనిపించింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఇక ఈ ఘటనపై  కేసు నమోదు చేసిన పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు. ఇక చాందిని ఓ ప్రైవేట్ మైక్రో ఫైనాన్స్ సంస్థ నుంచి రుణం తీసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. బుధవారం వాయిదాలు చెల్లించాల్సి ఉంది. దీంతో రుణం వసూలు చేసే వారు బుధవారం చాందినిని  అడిగినట్లు తెలుస్తోంది.

చాందిని ఇంటికి బుధవారం రుణం ఇచ్చిన సంస్థకు చెందిన ఉద్యోగులు కొందరు వచ్చినట్లు బంధువులు చెబుతున్నారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె.. వారు వెళ్లిన తరువాత ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కురుపుంపాడి పోలీసులు కేసు నమోదు చేశారు. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఏది ఏమైనా జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదు. ఇలా క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుని..జీవితం ముగించడంతో పాటు కుటుంబ సభ్యులను విషాదంలో పడేస్తున్నారు. అంతేకాక మరికొందరు వివాహితలు అయితే కన్నబిడ్డలను కూడా తమతో పాటు చంపేస్తున్నారు. మరి.. ఇలాంటి ఆత్మహత్య ఘటనల నివారణకు మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి