iDreamPost

మైనర్ బాలికపై సామూహిక ‘హత్యాచారం‘.. బీజెపీ నేత అరెస్ట్

దేశంలో ఆడపిల్లలకు రక్షణ కొరవడింది. ఇంట్లో, ఉద్యోగాల్లో, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు గురి అవుతున్నారు. ఎన్ని చట్టాలు చేసినా కామాంధులకు భయం కలగడం లేదు. తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది.

దేశంలో ఆడపిల్లలకు రక్షణ కొరవడింది. ఇంట్లో, ఉద్యోగాల్లో, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు గురి అవుతున్నారు. ఎన్ని చట్టాలు చేసినా కామాంధులకు భయం కలగడం లేదు. తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది.

మైనర్ బాలికపై సామూహిక ‘హత్యాచారం‘.. బీజెపీ నేత అరెస్ట్

దేశంలో ఆడ పిల్లలపై అఘాత్యాలను అరికట్టేందుకు ఎన్ని చట్టాలు చేసినా అవి నిందితుల్లో కించిత్ భయం లేకుండా పోయింది. చట్టాల్లోని లూప్ హోల్స్ ఉపయోగించుకుని బయటకు రావొచ్చునన్న ధీమాతో తప్పులు చేస్తున్నారు కొంత మంది. ఇంటా, బయట ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. నిర్భయ, అభయ, పోక్సో వంటి చట్టాలు చేసినప్పటికీ.. ఆడపిల్లలు, యువతులు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు ఆగడం లేదు. తాజాగా ఉత్తరాఖండ్‌లో మైనర్ బాలికపై సామూహిక హత్యాచారం చోటుచేసుకుంది. ఆమె మృతదేహం ఓ హైవేపై కనిపించింది. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీజెపీ నేతను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తుంది.

వివరాల్లోకి వెళితే.. 13 ఏళ్ల బాలికపై సామూహిక హత్యాచారం చేసిన ఘటన ఉత్తరాఖండ్‌కు చెందిన బీజేపీ నాయకుడు ఆదిత్య రాజ్ సైనీతో పాటు అతడి అనుచరుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఆదిత్య ఓబీసీ కమిషన్‌లో నామినేటెడ్ సభ్యుడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజెపీ టికెట్ ఆశించిన ఆదిత్య రాజ్ సైనీ భంగపాటుకు గురి అయ్యాడు. ఇదిలా ఉంటే హరిద్వార్‌కు చెందిన 13 ఏళ్ల మైనర్ బాలిక ఆదిత్య రాజ్ ఇంట్లో పనిచేస్తూ ఉండేది. మూడు రోజుల క్రితం బీజెపీ నేత ఇంటికి వెళ్లి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఫోన్ చేయగా.. ఆదిత్య రాజ్ సైనీ ఫోన్ లిఫ్ట్ చేసి..అమ్మాయి తన దగ్గరే ఉందని చెప్పాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాప్ వచ్చింది. మరుసటి రోజు ఉదయం.. కూతుర్ని వెతుక్కుంటూ అతడి ఇంటికి వెళ్లింది. అయితే తనకు తెలియదని చెప్పాడు నేత.

తల్లిదండ్రులు మిస్పింగ్ కేసు పెట్టారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. ఆమె కోసం వెతకసాగారు. అంతలో ఆదిత్య రాజ్ నుండి కేసు విత్ డ్రా చేసుకోవాలంటూ బెదిరింపులు కూడా ఎదురయ్యాయి. ఇంతలో మృతదేహం పతంజలి రీసెర్చ్ సెంటర్ సమీపంలోని బహదూరాబాద్ హైవేపై లభ్యమైంది. చాలా ఘోరమైన పరిస్థితిలో కనిపించేసరికి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఆదిత్యపై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆదిత్య రాజ్ సైనీతో పాటు మరో ఇద్దరి అరెస్టు చేశారు. పోక్సో చట్టంతో సహా పలు కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉంటే..బీజెపీ నాయకుడు ఆదిత్య రాజ్‌ను పార్టీ నుండి బహిష్కరించింది బీజెపీ . అలాగే ఓబీబీ నామినేట్ పదవి నుండి కూడా తొలగించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి