iDreamPost

వీడియో: గుండెపోటుతో బ్యాంకులో కుప్పకూలిన యువ ఉద్యోగి. క్షణాల్లోనే..!

Heart Attack: ఇటీవల కాలంలో గుండె పోటు కారణంగా సంభవించే మరణాల సంఖ్య బాగా పెరిగింది.  ఇలా మరణాలు పెరిగిపోవడంతో జనాల్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి. తాజాగా ఓ 30 ఏళ్ల బ్యాంకు ఉద్యోగి మరణం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

Heart Attack: ఇటీవల కాలంలో గుండె పోటు కారణంగా సంభవించే మరణాల సంఖ్య బాగా పెరిగింది.  ఇలా మరణాలు పెరిగిపోవడంతో జనాల్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి. తాజాగా ఓ 30 ఏళ్ల బ్యాంకు ఉద్యోగి మరణం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

వీడియో: గుండెపోటుతో బ్యాంకులో కుప్పకూలిన యువ ఉద్యోగి. క్షణాల్లోనే..!

మరణం అనేది ఎవరికైనా, ఎప్పుడైనా వచ్చేదే. కానీ కొందరు జీవితాల్లో మాత్రం అనూహ్యంగా ఊహించని రీతిలో మృత్యువు పలకరిస్తుంది. ఇంకా దారుణం ఏమిటంటే.. మంచి ఉద్యోగం, చక్కటి సంసారంతో సాగుతున్న కుటుంబంలో కూడా గుండెపోటు రూపంలో మృత్యువు విరుచకపడుతుంది. అలానే తాజాగా ఓ 30 ఏళ్ల బ్యాంకు ఉద్యోగి సంసారంలో హార్ట్ ఎటాక్ విషాదం నింపింది. బ్యాంకులో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. అందరూ షాకునుంచి తేరుకుని కాపాడేలోపే ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇటీవల కాలంలో గుండె పోటు కారణంగా సంభవించే మరణాల సంఖ్య బాగా పెరిగింది. అప్పటి వరకు ఎంతో హుషారుగా కనిపించే వారు..క్షణాల్లో చూస్తుండగానే కుప్పకూలిపోయి మరణిస్తున్నారు. పసి పిల్లల నుంచి పండు ముసలి వారి వరకు వయస్సుతో సంబంధం లేకుండా ఈ హార్ట్ ఎటాక్ వస్తుంది. ముఖ్యంగా కుర్రాళ్లలో కూడా ఈ గుండె పోటు కారణంగా నిండు నూరేళ్ల జీవితం ముగిసిపోతుంది. గతంలో క్రికెట్ ఆడుతూ, డ్యాన్స్ చేస్తూ కొందరు యువకులు హార్ట్ ఎటాక్ వచ్చి.. మరణించారు. అలానే కొన్ని రోజుల క్రితం ఓ ఫార్మ ఉద్యోగి మెడికల్ షాపులో ఉద్యోగం చేస్తూ..బిలు వేస్తున్న క్రమంలో కుప్పకూలిపోయి మరణించాడు. ఇలా ఇటీవల గుండెపోటు మరణాలు పెరిగిపోవడంతో జనాల్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ 30 ఏళ్ల బ్యాంకు ఉద్యోగి.. విధులు నిర్వర్తిస్తుండగానే.. కుర్చీలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా సంచనలనంగా మారింది.

ఉత్తర్‌ప్రదేశ్‌రాష్ట్రం మ‌హోబాలోని ఓ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో రాజేష్ కుమార్ షిండే అనే 30 ఏళ్ల యువకుడు ఉద్యోగం చేస్తున్నాడు. అతడు జనరల్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. రోజు మాదిరిగానే బుధవారం బ్యాంకు వచ్చాడు.  ల్యాప్ డ్యాప్ లో  తన పని చేస్తూ..పూర్తి నిమగ్నమయ్యాడు. ఈ క్రమలోంనే అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ల్యాప్‌టాప్‌లో ప‌నిచేయడం ఆపేస. కాసేపు అలా కూర్చున్నాడు. ఇక అందరూ చూస్తుండగానే తాను కూర్చున్న కుర్చీలోనే వెనక్కి వాలిపోయాడు. అంతే ఒక్కసారిగా హార్ట్ ఎటాక్ రావడంతో కూర్చున్న చోటే కుప్పకూలిపోయాడు. ఇలా అకస్మాత్తుగా జరిగిన ఘటనతో తోటి ఉద్యోగులు షాకి గురయ్యారు. రాజేష్ కుమార్ షిండేకు గుండె పోటు వచ్చిన విషయాన్ని గమనించారు.

రాజేష్ కుమార్ షిండేను.. కుర్చీలో నుంచి తీసి బయటికి తీసుకువచ్చారు. అతని ముఖంగా నీళ్లు చల్లి.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశారు. ఎంత చేసిన కూడా కుమార్ ప్రాణాలు నిలబడలేదు. అయినా ఇంకా బతికే ఉండానే ఆశతో ఆ వెంటనే ఆస్పత్రికి త‌ర‌లించారు. అయితే అప్పటికే ప్రాణాలు కోల్పోయిన‌ట్లు వైద్యులు ప్రక‌టించారు. హార్ట్ ఎటాక్ తో రాజేష్ కుమార్ షిండే మరణించిన దృశ్యాలు ఆ బ్యాంక్‌లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి.. గుండెపోటు మరణాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి