iDreamPost

మీరు ఫోన్ పే వాడుతున్నారా?.. 1000 చెల్లిస్తే చాలు.. 20 లక్షలు పొందొచ్చు.. ఎలా అంటే?

మీరు ఫోన్ పే యూజర్లా? అయితే మీకు గుడ్ న్యూస్. వెయ్యి రూపాయలు కడితే చాలు.. ఏకంగా 20 లక్షలు పొందొచ్చు. ఫోన్ పే వాడే వారికి 20 లక్షలు పొందే అవకాశాన్ని కల్పిస్తోంది.

మీరు ఫోన్ పే యూజర్లా? అయితే మీకు గుడ్ న్యూస్. వెయ్యి రూపాయలు కడితే చాలు.. ఏకంగా 20 లక్షలు పొందొచ్చు. ఫోన్ పే వాడే వారికి 20 లక్షలు పొందే అవకాశాన్ని కల్పిస్తోంది.

మీరు ఫోన్ పే వాడుతున్నారా?.. 1000 చెల్లిస్తే చాలు.. 20 లక్షలు పొందొచ్చు.. ఎలా అంటే?

డిజిటల్ చెల్లింపు యాప్స్ అందుబాటులోకి వచ్చాక పేమెంట్స్ స్వరూపమే మారిపోయింది. రూపాయి నుంచి మొదలుకుని లక్షల వరకు పేమెంట్స్ అన్నీ ఆన్ లైన్ లోనే చేస్తున్నారు. చేతిలో నగదు లేకున్నా పేమెంట్స్ చేసే సదుపాయం ఆన్ లైన్ పేమెంట్స్ యాప్స్ కల్పిస్తుండడంతో వీటికి డిమాండ్ పెరిగింది. ఫోన్ పే, గూగుల్ పే యాప్స్ కు కోట్లాదిమంది యూజర్లు ఉన్నారు. అయితే ఈ యాప్స్ యూజర్లకు పేమెంట్స్ కోసమే కాకుండా లోన్స్ కూడా అందిస్తున్నాయి. మీరు ఫోన్ పే వాడుతున్నట్లైతే మీకు గుడ్ న్యూస్. వెయ్యి రూపాయలు కడితే చాలు ఏకంగా 20 లక్షలు పొందే అవకాశం కల్పిస్తోంది. ఈ ప్రయోజనాన్ని ఎలా పొందొచ్చంటే?

డిజిటల్ పేమెంట్ దిగ్గజ యాప్ ఫోన్ పే తన యూజర్ల కోసం పర్సనల్ లోన్స్ అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల యూజర్లకు మరింత ప్రయోజనం చేకూరేలా వెహికల్ లోన్స్, మ్యూచువల ఫండ్స్, ఎడ్యుకేషన్ లోన్స్ ఇలా పలు రకాల రుణాలను అందించేందుకు సిద్ధమైంది. పలు లెండింగ్ సంస్థలతో భాగస్వామ్యం ఏర్పర్చుకుని లోన్స్ ను అందిస్తున్నది. అయితే ఫోన్ పేతో లోన్స్ మాత్రమే కాదు ఇన్సూరెన్స్ సర్వీస్ ద్వారా భారీ మొత్తంలో బీమా పొందొచ్చు. తక్కువ ప్రీమియంతోనే లక్షల రూపాయలను బీమాగా అందుకోవచ్చు. ఫోన్‌పే ద్వారా సులభంగానే ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేయొచ్చు. మోటార్ అండ్ ట్రావెల్, హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ సేవలు ఫోన్‌పేలో అందుబాటులో ఉన్నాయి.

ఫోన్ పే యూజర్లు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నట్లైతే.. పాలసీ దారుడు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు బీమా డబ్బులు లభిస్తాయి. వీటిని టర్మ్ పాలసీలు అంటారు. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ సర్వీసులు కూడా ఉన్నాయి. ఫోన్‌పేలో మీరు రూ. 50 వేల మొత్తం నుంచి రూ. 20 లక్షల మొత్తం వరకు మీరు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. రూ. 50 వేల బీమాకు అయితే రూ. 25 చెల్లించాలి.

అదే లక్ష అయితే రూ. 49 కడితే చాలు. రూ. 3 లక్షలు అయితే రూ. 147 చెల్లించాలి. ఇక రూ. 5 లక్షలకు అయితే రూ. 249 కట్టాలి. ఇక రూ.10 లక్షలకు యఅతే రూ. 549 చెల్లించాలి. ఇక రూ. 20 లక్షలకు రూ. 1099 కడితే బీమాను పొందొచ్చు. కేవలం 2 నిమిషాల్లోనే పాలసీ పొందొచ్చు. ఇది రిలయన్స్ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ. ఏడాది పాటు ఈ పాలసీ వర్తిస్తుంది. తర్వాత పాలసీని రెన్యూవల్ చేసుకోవాలి. పాలసీదారుడు ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వత అంగ వైకల్యం కలిగినా బీమా మొత్తాన్ని చెల్లిస్తారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి