iDreamPost

OTT Suggestions: OTTలో బెస్ట్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్.. వారం వరకు మైండ్ లో నుంచి పోదు!

  • Published Jul 05, 2024 | 6:25 PMUpdated Jul 05, 2024 | 6:25 PM

OTT Best Murder Investigation Thriller: కొన్ని సినిమాలు చూస్తే.. కొన్ని రోజుల వరకు కూడా మైండ్ లో నుంచి ఆ మూవీ స్టోరీ పోదు. ఇప్పుడు చెప్పుకునే స్టోరీ కూడా అలాంటిదే. మరి ఈ సినిమాను మీరు చూసారో లేదో ఓ సారి చెక్ చేసేయండి.

OTT Best Murder Investigation Thriller: కొన్ని సినిమాలు చూస్తే.. కొన్ని రోజుల వరకు కూడా మైండ్ లో నుంచి ఆ మూవీ స్టోరీ పోదు. ఇప్పుడు చెప్పుకునే స్టోరీ కూడా అలాంటిదే. మరి ఈ సినిమాను మీరు చూసారో లేదో ఓ సారి చెక్ చేసేయండి.

  • Published Jul 05, 2024 | 6:25 PMUpdated Jul 05, 2024 | 6:25 PM
OTT Suggestions: OTTలో బెస్ట్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్.. వారం వరకు మైండ్ లో నుంచి పోదు!

సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే ప్రేక్షకులు బాగా ఇంట్రెస్ట్ తో చూస్తూ ఉంటారు. అందులోను మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లెర్స్ అంటే మరింత ఇంట్రెస్ట్ వచేస్తుంది. ఆ మర్డర్ ఎవరు చేశారు.. ఎందుకు చేశారు.. ఎలా చేశారు ఇలా ప్రతి పాయింట్ కూడా ప్రేక్షకులను సినిమా చివరి వరకు సినిమా చూసేలా చేస్తుంది. ఈ మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్ అన్నీ కూడా ఒకేలా అనిపించినా కానీ పోలీసులు ఆ కేసును ఎలా సాల్వ్ చేసారు అనే పాయింట్ అందరిని ఆకట్టుకుంటుంది. అసలు ఆ పాయింట్ ఏ సినిమాకు హైలెట్ అవుతుంది. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఈ కోవకు చెందిందే. మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్ నచ్చే వాళ్లకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చేస్తుంది. మరి ఈ సినిమా ఏంటి ఈ సినిమాను మీరు చూశారా లేదా.. ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఇదొక కంప్లీట్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్..పోలీస్ ఆఫీసర్ నందన్ భార్య గౌరీ తన కూతురు చనిపోడంతో.. ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటుంది. దీనితో అతను తన భార్యను కాపాడి.. ఆమెకు సర్ది చెప్పి ఆమెను ఓ ట్రిప్ కు తీసుకుని వెళ్తాడు. ఆరోజు రాత్రి సెహబ్ అనే వ్యక్తి నందన్ ను కలవడానికి వస్తాడు. నందన్ ఊరిలో లేకపోవడంతో.. తిరిగి ఇంటికి వెళ్లిపోయే దారిలో అతను చనిపోతాడు. కట్ చేస్తే స్టోరీ పాస్ట్ ను చూపిస్తారు. అయితే ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత నందన్ ఓ కేసును సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ పాస్ట్ ను చూపిస్తారు. గతంలో అంజలి అని ఓ డాక్టరు అకస్మాత్తుగా చనిపోతుంది. ఈ క్రమంలో ఆమె కేసును సాల్వ్ చేయడానికి పోలీసులు రంగంలోకి దిగుతారు.

అసలు అంజలి ఎలా చనిపోయింది! ఆమెను ఎవరైనా సీరియల్ కిల్లర్ చంపడా ! అనేది.. ఎవరికీ అర్థంకాదు. ఇప్పుడు అంజలి నే కాకుండా అంజలి బ్రదర్ ను కూడా చంపేయాలని అనుకుంటాడు ఆ కిల్లర్. అసలు ఎవరు ఈ సీరియల్ కిల్లర్ ! ఎందుకు అందరిని చంపేస్తున్నాడు ! ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఎందుకు ఆ కిల్లర్ ను పట్టుకోలేకపోతారు! ఇంకా ఎన్ని హత్యలు జరుగుతాయి ! ఆ తర్వాత ఏం జరిగింది ! ఇవన్నీ తెలియాలంటే “ట్వేన్టీ వన్ గ్రామ్స్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ అయితే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి