iDreamPost
android-app
ios-app

కల్కి పార్ట్-2లో బుజ్జి ఉంటుందా? నాగ్ అశ్విన్ కొత్త ట్విస్ట్ అదిరింది!

Nag Ashwin On Bujji Part In Kalki 2: కల్కి 2898 ఏడీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కల్కి పార్ట్ 2లో బుజ్జి ఉంటుందా? అనే ప్రశ్నకు ఒక కొత్త ట్విస్టును రివీల్ చేశాడు. ఇప్పుడు ఆ సమాధానంతో కొత్త ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి.

Nag Ashwin On Bujji Part In Kalki 2: కల్కి 2898 ఏడీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కల్కి పార్ట్ 2లో బుజ్జి ఉంటుందా? అనే ప్రశ్నకు ఒక కొత్త ట్విస్టును రివీల్ చేశాడు. ఇప్పుడు ఆ సమాధానంతో కొత్త ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి.

కల్కి పార్ట్-2లో బుజ్జి ఉంటుందా? నాగ్ అశ్విన్ కొత్త ట్విస్ట్ అదిరింది!

ప్రస్తుతం కల్కి 2898 ఏడీ గురించి.. నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన ఈ కొత్త ప్రపంచం గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. అటు బాక్సాఫీస్ కూడా కల్కి దెబ్బకు షేకవుతోంది. పైగా ఇప్పుడు వచ్చింది కేవలం ఫస్ట్ పార్ట్ మాత్రమే. ఇంకో పార్ట్ కథ మిగిలే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇంకా కల్కి గురించి చర్చ జరుగుతూనే ఉంది. మరోవైపు ఇప్పటి నుంచే కల్కి పార్ట్ 2 గురించి ఊహాగానాలు, చర్చలు ఎక్కువ అయ్యాయి. ఇప్పుడు కల్కి టీమ్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ పార్ట్ 2 మీద కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అందులో భాగంగా బుజ్జి ప్రస్తావన కూడా వచ్చింది. బుజ్జి పాత్రకు సంబంధించి ఒక పెద్ద బాంబు పేల్చేశాడు.

కల్కి సినిమా విడుదలైనప్పటి నుంచి సినిమా గురించి, పురాణాల గురించి, ఎలాగైతే మాట్లాడుకుంటున్నారో.. అలాగే సినిమాలో ఒక భాగం అయిన బుజ్జి గురించి కూడా అలాగే మాట్లాడుకుంటున్నారు. పార్ట్ 1లో ప్రభాస్ పాత్రతో సమానంగా బుజ్జికి ప్రాధాన్యత ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పురాణాల్లో కర్ణుడికి తన విల్లు ఎలాగో.. ఈ మోడ్రన్ ఎరాలో భైరవకి బుజ్జి అలాగే ఉంది. అందుకే బుజ్జికి ఇంత క్రేజ్ వచ్చింది. ఈ నేపథ్యంలో నాగ్ అశ్విన్ కి ఒక ప్రశ్న ఎదురైంది. కల్కి పార్ట్ 2లో అసలు బుజ్జి ఉంటుందా? ఉంటే బుజ్జికి ఎంతటి ప్రాధాన్యత ఉంటుంది? కథలో ఇంకా కీ రోల్ గా ఏమైనా మారబోతోందా అని ప్రశ్నించారు.

నాగ్ అశ్విన్ బుజ్జి గురించి చాలా స్పష్టంగానే సమాధానం చెప్పేశాడు. అయితే బుజ్జి పార్ట్ 2లో ఉంటుంది అని నాగ్ అశ్విన్ ఎక్కడా కన్ఫామ్ చేయలేదు. కానీ, బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ సిరీస్ మాత్రం కంటిన్యూ అవుతుందని స్పష్టం చేశాడు. బుజ్జి అండ్ భైరవ సిరీస్ నుంచి ఇంకో రెండు కొత్త ఎపిసోడ్స్ వస్తాయి అని కన్ఫామ్ చేశాడు. ఈ బుజ్జి అండ్ భైరవ సిరీస్ కి కల్కి సినిమాకి ఎలాంటి సంబంధం లేదు. కానీ, ప్రేక్షకులకు తాను క్రియేట్ చేసిన ప్రపంచాన్ని పరిచయం చేయడానికి ఈ సిరీస్ చాలా ఉపయోగ పడింది. ఈ సిరీస్ కు కల్కి ప్రపంచానికి నేరుగానే సంబంధం ఉంది. కాబట్టి ఇబ్బుడు ఈ బుజ్జి అండ్ భైరవ సిరీస్ కొనసాగుతోంది అంటే.. కల్కి పార్ట్ 2లో కూడా బుజ్జి ఉంటుంది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

కల్కి సినిమా కథ ఇప్పుడు నెక్ట్స్ లెవల్ కు వెళ్లిపోయింది. ఇప్పటివరకు మనం చూసింది కథ పరంగా ట్రైలర్ మాత్రమే. కానీ, ఇప్పుడు పార్ట్ లో అసలు యుద్ధం మొదలు కాబోతోంది. ఇప్పుడు గాంఢీవం దొరికింది.. కలికి దొరికిన ఒక్క చుక్క సీరంతోనే గాంఢీవాన్ని ఎత్తగలిగే శక్తిని పొందాడు. అంటే విలన్స్ ఎంతో పవర్ ఫుల్ అయిపోయారు. కాబట్టి భైరవ కూడా వారిని ఎదుర్కోవడానికి అంతే శక్తివంతంగా తయారు కావాలి. కాబట్టి పార్ట్ 2లో భైరవకు బుజ్జి అవసరం ఎంతైనా ఉంటుంది. దానికి తగినట్లుగా భైరవ బుజ్జిని మరింత డెవలప్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. మరిన్ని ఫీచర్స్ తో మహా యుద్ధానికి భైరవ సిద్ధం అవ్వాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. దీని బట్టి చూస్తే నాగ్ అశ్విన్ నేరుగా చెప్పకపోయినా.. పార్ట్ 2లో బుజ్జి ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి.. కల్కి పార్ట్ 2లో బుజ్జి ఉంటే బాగుంటుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişHoliganbetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetiptv satın alMadridbet güncel girişHoliganbet GirişMadridbetMadridbet giriş