iDreamPost
android-app
ios-app

ఆ ఒక్క విషయం మాత్రం నాగ్ అశ్విన్ నుంచి జక్కన్న నేర్చుకోవాల్సిందే!

Fans Request To Rajamouli On Nag Ashwin Strategy: కల్కి 2898 ఏడీ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూనే ఉంది. రికార్డు కలెక్షన్స్ తో తన సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో నాగ్ అశ్విన్ నుంచి రాజమౌళి ఒక విషయం నేర్చుకోవాలి అంటూ కామెంట్ చేస్తున్నారు.

Fans Request To Rajamouli On Nag Ashwin Strategy: కల్కి 2898 ఏడీ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూనే ఉంది. రికార్డు కలెక్షన్స్ తో తన సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో నాగ్ అశ్విన్ నుంచి రాజమౌళి ఒక విషయం నేర్చుకోవాలి అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఆ ఒక్క విషయం మాత్రం నాగ్ అశ్విన్ నుంచి జక్కన్న నేర్చుకోవాల్సిందే!

సినిమా ప్రేక్షకులు ఇంకా కల్కి 2898 ఏడీ వరల్డ్ లోనే ఉన్నారు. ఆఖరి నగరం కాశీ, కాంప్లెక్స్, శంబాలా గురించే మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమాతో నాగ్ అశ్విన్ కుర్రాళ్లు అంతా మహాభారతం గురించి డిబేట్లు పెట్టుకునేలా చేశాడు. ఒకప్పుడు సినిమా గురించి.. హీరోల గురించి పెద్దఎత్తున చర్చలు జరిగేవి. కానీ, కల్కి వచ్చిన తర్వాత యువత అంతా మహాభారతం, అందులోని పాత్రలు, వాళ్లు చేసిన పనుల గురించి పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు. ఈ క్రెడిట్ మాత్రం నాగ్ అశ్విన్ కే దక్కుతుంది. ఇంక ఈ సినిమా సంగతి పక్కన పెడితే. జక్కన్న మాత్రం నాగ్ అశ్విన్ ని చూసి ఒక విషయం నేర్చుకోవాలి అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ప్రస్తుతం అంతా కల్కి సక్సెస్ గురించే మాట్లాడుకుంటున్నారు. నాగ్ అశ్విన్ సృష్టికి ఫ్యాన్స్ అంతా ఫిదా అయిపోయారు. వర్డ్ వైడ్ గా ఉన్న ఫ్యాన్స్ చూపించిన అభిమానంతో మొదటి వారంలోనే కల్కి రూ.700 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ముఖ్యంగా నాగ్ అశ్విన్ క్రియేటివిటీకీ బాగా అప్లాజ్ లభిస్తోంది. పురాణాలను, ఇతిహాసాలను ఇలా టెక్నాలజీకి ముడి పెట్టిన తీరు మెప్పిస్తోంది. అలాగే తారా గణాన్ని వాడిన తీరుకు అంతా మంచి మార్కులు వేస్తున్నారు. అంటే పాన్ ఇండియా లెవల్లో ఉన్న స్టార్ యాక్టర్స్ ని నాగ్ అశ్విన్ సరిగ్గా ఎంచుకున్నారు, వారి పాత్రకు తగినట్లుగా సరిగ్గా వాడుకున్నారు అంటూ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. క్రిటిక్స్ కూడా కామెంట్ చేస్తున్నారు.

ఈ విషయంలోనే ఇప్పుడు ఫ్యాన్స్ దర్శకధీరుడు రాజమౌళికి సూచనలు చేస్తున్నారు. బాలీవుడ్ లో కల్కికి ఈ రేంజ్ రెస్పాన్స్ రావడానికి ప్రభాస్ కాకుండా.. మరో ఇద్దరు కారణంగా చెబుతున్నారు. వాళ్లు బిగ్ బి అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె. దాదాపుగా గత పదేళ్లలో అమితాబ్ ఇంత పరవుల్ క్యారెక్టర్ లో కనిపించలేదు. అశ్వత్థామ పాత్రలో అమితాబ్ ని చూసిన ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు. అమితాబ్ యాక్షన్ సీక్వెన్స్ కి మురిసిపోయారు. అలాగే దీపికాకి కూడా మంచి యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. అందుకే ప్రభాస్ ఇమేజ్ మాత్రమే కాకుండా.. కల్కి మార్చ్ లో ఈ పాయింట్ కూడా కీ రోల్ ప్లే చేస్తోంది.

ఇప్పుడు అదే విషయంలో జక్కనకు కొత్త రిక్వెస్టులు చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో రాజమౌళి కూడా అజయ్ దేవ్ గణ్, అలియా భట్ ను బాలీవుడ్ నుంచి ఎంపిక చేసకున్నారు. కానీ, వారి పాత్రలకు అంత స్క్రీన్ స్పేస్ లేదు అనేది మొదటి నుంచి ఉన్న మాటే. అజయ్ దేవ్ గణ్ పాత్ర త్వరగా అయిపోయింది. అలియా అయితే హీరోయిన్ అన్న పేరు తప్ప కనిపించింది తక్కువే. నాగ్ అశ్విన్ బాలీవుడ్ తారలను వాడుకోవడంలో జక్కన్న కంటే సూపర్ సక్సెస్ అయ్యాడు అంటూ చెబుతున్నారు. ఇంక గ్లోబల్ లో వల్లో టేకింగ్, మార్కెటింగ్, ప్రమోషన్స్ విషయంలో అయితే రాజమౌళికి ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందరి దృష్టి మహేశ్ తో తీయబోయే పాన్ వరల్డ్ కాన్సెప్ట్ మీద ఉంది.