iDreamPost
android-app
ios-app

పిల్లల కోసం సూపర్ స్కీం.. రోజుకు రూ. 6 చెల్లిస్తే చేతికి లక్ష రూపాయలు

Bal Jeevan Bima Yojana Scheme: మీ పిల్లల పేరు మీద పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే పోస్టాఫీస్ సూపర్ స్కీమ్ ను అమలు చేస్తున్నది. రోజుకు రూ. 6 పెట్టుబడితో లక్ష రూపాయలు చేతికి అందుతాయి.

Bal Jeevan Bima Yojana Scheme: మీ పిల్లల పేరు మీద పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే పోస్టాఫీస్ సూపర్ స్కీమ్ ను అమలు చేస్తున్నది. రోజుకు రూ. 6 పెట్టుబడితో లక్ష రూపాయలు చేతికి అందుతాయి.

పిల్లల కోసం సూపర్ స్కీం.. రోజుకు రూ. 6 చెల్లిస్తే చేతికి లక్ష రూపాయలు

కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల కోసం వినూత్నమైన పథకాలను ప్రవేశపెడుతున్నది. అందులో మహిళలు, పిల్లల కోసం అద్భుతమైన స్కీమ్స్ ను తీసుకొచ్చి అమలు చేస్తున్నది. సుకన్య సమృద్ధి యోజన, మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ వంటి పథకాలతో సూపర్ బెనిఫిట్స్ ను అందిస్తున్నది. ఈ పథకాలపై అధిక వడ్డీని అందిస్తూ ఎక్కువ లాభాలను అందిస్తున్నది. ఇక పిల్లల భవిష్యత్తు కోసం కూడా అదిరిపోయే స్కీమ్ లను తీసుకొచ్చింది. ఆ పథకమే బాల్ జీవన్ బీమా యోజన. ఈ పథకంతో మంచి లాభాలను అందుకోవచ్చు. గవర్నమెంట్ పథకం కాబట్టి పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. గ్యారంటీ రిటర్న్స్ పొందొచ్చు.

పోస్టాఫీస్ ప్రవేశపెట్టిన బాల్ జీవన్ బీమా పథకంలో మీ పిల్లల పేరిట రోజుకు రూ. 6 పెట్టుబడి పెడితే చేతికి లక్ష రూపాయలు అందుకోవచ్చు. మెచ్యూరిటీ తేదీన కనీస హామీ మొత్తం ఒక లక్ష రూపాయలు అందుతుంది. పిల్లల పేరిట రూ.6 నుంచి రూ.18 వరకు ప్రీమియం డిపాజిట్ చేయవచ్చు. అదే రూ. 18 చొప్పున పెట్టుబడి పెడితే రూ. 3 లక్షలు పొందొచ్చు. బాల్ జీవన్ బీమా స్కీమ్ కేవలం చిన్నారుల కోసమే తీసుకొచ్చింది కేంద్రం. దీని ప్రకారం మీరు 5 సంవత్సరాల పాటు ప్రతిరోజూ రూ. 6 ప్రీమియంగా పెట్టుబడి పెట్టాలి. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే పిల్లల తల్లిదండ్రుల వయస్సు 45 ఏళ్లు మించకూడదు. కుటుంబంలో ఇద్దరు పిల్లలు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

బాల్ జీవన్ బీమా పథకంలో చేరాలంటే పిల్లల వయస్సు 5-20 సంవత్సరాల మధ్య ఉండాలి. 5-20 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లల తల్లిదండ్రులు పాల్ జీవన్ బీమా యోజన కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పాలసీ మెచ్యూరిటీకి ముందే పాలసీదారు మరణిస్తే, ఇకపై పాలసీ ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు. పాలసీ గడువు ముగిసిన తర్వాత, పిల్లలకు పూర్తి మెచ్యూరిటీ మొత్తం ఇస్తారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే తల్లిదండ్రులు సమీపంలోని పోస్టాఫీసులకు వెళ్లి అప్లై చేసుకోవచ్చు.