iDreamPost
android-app
ios-app

సూపర్ బైకులపై భారీ డిస్కౌంట్.. ఏకంగా అన్ని వేలా?

  • Published Jul 05, 2024 | 5:38 PM Updated Updated Jul 05, 2024 | 5:38 PM

Triumph Speed 400: వాహనదారులకు గుడ్ న్యూస్. రెండు సూపర్ బైకులపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ. ఎన్ని వేల తగ్గింపు ప్రకటించిందంటే?

Triumph Speed 400: వాహనదారులకు గుడ్ న్యూస్. రెండు సూపర్ బైకులపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ. ఎన్ని వేల తగ్గింపు ప్రకటించిందంటే?

  • Published Jul 05, 2024 | 5:38 PMUpdated Jul 05, 2024 | 5:38 PM
సూపర్ బైకులపై భారీ డిస్కౌంట్.. ఏకంగా అన్ని వేలా?

యూత్ ను అట్రాక్ట్ చేసేలా టూవీలర్ తయారీ కంపెనీలు బైక్ లను రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి అద్భుతమైన ఫీచర్లు, స్టన్నింగ్ డిజైన్ తో టూవీలర్ లను తయారు చేస్తున్నాయి కంపెనీలు. మార్కెట్ లో తమ సేల్స్ పెంచుకునేందుకు, కస్టమర్లను ఆకర్షించేందుకు బైక్ లపై డిస్కౌంట్ ఆఫర్లు ప్రకిటిస్తూ ఉంటాయి టూవీలర్ తయారీ కంపెనీలు. ఈ క్రమంలో బైక్ లవర్స్ కోసం ట్రయంఫ్ కంపెనీ తీసుకొచ్చిన రెండు బైకులు తెగ ఆకట్టుకున్నాయి. అయితే వీటి ధరలు మాత్రం హెవీగా ఉండడంతో కొనేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రయంఫ్ కంపెనీ ఆ రెండు బైక్ లపై ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది.

ట్రయంఫ్ బైక్ లకు యూత్ లో ఫుల్ క్రేజ్ ఉంది. ఇప్పటికే ఈ బైక్స్ వరల్డ్ వైడ్ గా 50 వేల యూనిట్లు విక్రయించబడ్డాయి. కాగా ట్రయంఫ్ కంపెనీ మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని డిస్కౌంట్ ప్రకటించింది. ట్రయంఫ్‌ స్పీడ్‌ 400, స్క్రాంబ్లర్‌ 400X పేరిట లాంచ్‌ చేసిన బైక్‌లపై రూ.10,000 తగ్గింపును ఇస్తోంది. ఈ ఆఫర్‌ జులై 31 వరకు మాత్రమే వాహనదారులకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ట్రయంఫ్‌ స్పీడ్‌ 400 ప్రస్తుత ధర రూ.2.34 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌) ఉండగా.. ట్రయంఫ్‌ స్క్రాంబ్లర్‌ 400X ప్రస్తుత ధర రూ.2.64 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌)గా ఉంది.

ఈ రెండు మోటార్‌ సైకిళ్లు 398 సీసీ ఇంజిన్‌ కలిగి ఉన్నాయి. లిక్విడ్‌ కూల్డ్‌, డ్యూయల్‌ ఓవర్‌ హెడ్‌ క్యామ్‌షాఫ్ట్‌ సింగిల్‌ సిలిండర్‌తో వస్తున్న ఈ ఇంజిన్‌.. 40 పీఎస్‌ పవర్‌ను, 39.5 నానోమీటర్‌ పీక్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సిక్స్‌ స్పీడ్‌ గేర్‌ బాక్స్‌ అమర్చారు. లీటర్‌కు 28 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. డ్యూయల్‌ ఛానెల్‌ ఏబీఎస్‌, ఎల్‌ఈడీ లైటింగ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ ధరలు ఎక్కువగా ఉన్నాయని భావిచే వారు ప్రస్తుత ఆఫర్ ను వినియోగించుకుని ట్రయంఫ్ బైకులను కొనుగోలు చేస్తే 10 వేలు సేవ్ చేసుకోవచ్చు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet