iDreamPost
android-app
ios-app

భూమికి పొంచి ఉన్న ముప్పు.. అదే జరిగితే మనం అంతరించిపోతాం: ఇస్రో చీఫ్

  • Published Jul 05, 2024 | 7:32 PM Updated Updated Jul 05, 2024 | 7:32 PM

Asteroid Hitting Earth: భూమికి అతి దగ్గరలో అపోఫిస్ అనే గ్రహశకలం ఉంది. ఇది 370 మీటర్ల వ్యాసార్థంతో ఉంది. ఇది 2029లో భూమ్మీద మన మీద నుంచి వెళ్తుందని.. అదే జరిగితే భూమికి మహా విపత్తు సంభవిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Asteroid Hitting Earth: భూమికి అతి దగ్గరలో అపోఫిస్ అనే గ్రహశకలం ఉంది. ఇది 370 మీటర్ల వ్యాసార్థంతో ఉంది. ఇది 2029లో భూమ్మీద మన మీద నుంచి వెళ్తుందని.. అదే జరిగితే భూమికి మహా విపత్తు సంభవిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

భూమికి పొంచి ఉన్న ముప్పు.. అదే జరిగితే మనం అంతరించిపోతాం: ఇస్రో చీఫ్

భూమికి అతి దగ్గరగా ఉన్న అపోఫిస్ అనే అతి పెద్ద గ్రహశకలం భూమి గుండా వెళ్తుందని.. 2029, 2036 సంవత్సరాల్లో ఇది జరుగుతుందని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ అన్నారు. దీన్ని మనం సీరియస్ గా తీసుకోవాలని వెల్లడించారు. షూ మేకర్ లెవీ అనే గ్రహశకలం ఇటీవల బృహస్పతి (జూపిటర్) గ్రహాన్ని ఢీకొట్టిన విషయాన్ని తాను గుర్తించినట్లు సోమనాథ్ అన్నారు. భూమ్మీద గనుక ఇలాంటి సంఘటన జరిగితే మనమంతా అంతరించిపోతామని అన్నారు. అయితే 70-80 ఏళ్ల తమ జీవిత కాలంలో ఇలాంటి మహా విపత్తు గురించి వినలేదు కాబట్టి దీన్ని తాము విశ్వసించడం లేదని అన్నారు. అయితే ప్రపంచ చరిత్రను, విశ్వ చరిత్రను చూసుకుంటే.. ఇలాంటి సంఘటనలు చాలా తరచుగా జరుగుతాయని అన్నారు. ఈ అపోఫిస్ గ్రహశకలం కనుక భూమిని ఢీకొంటే చాలా జాతులు అంతమవుతాయని అన్నారు. ఇవి వాస్తవ అవకాశాలు. కాబట్టి మనం ప్రిపేర్ అయి ఉండాలని అన్నారు.

మన పుడమి తల్లికి ఇలా జరగాలని అనుకోవడం లేదని.. మనుషులతో పాటు అన్ని రకాల జీవులు ఈ భూమ్మీద జీవించాలని.. కానీ ఈ మహా విపత్తును మనం ఆపలేమని అన్నారు. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని.. ఆ గ్రహశకలాన్ని దారి మళ్లించే పద్ధతిని కలిగి ఉన్నామని అన్నారు. గ్రహశకలం భూమికి దగ్గరగా రావడాన్ని గుర్తించి.. దారి మళ్లించడంలో కొన్నిసార్లు సాధ్యపడకపోవచ్చునని అన్నారు. కాబట్టి టెక్నాలజీ అనేది డెవలప్ అవ్వాలని.. అంచనా సామర్థ్యాలను పెంచుకోవాలని.. దాన్ని తిప్పికొట్టడానికి దృఢమైన ఆధారాలను పంపించగల సామర్థ్యం కలిగి ఉండాలని అన్నారు. అందుకోసం ఇతర దేశాలన్నీ కలిసి పని చేయాలని అన్నారు.

ఇది నిర్ధారణ అయితే కనుక విశ్వవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ సంసిద్ధమై ఉండాలని.. అందరూ కలిసి పని చేయాలని అన్నారు. రానున్న రోజుల్లో ఇది రూపుదిద్దుకుంటుందని.. గ్రహశకలం భూమిని తాకడం నిజమైతే కనుక భూమ్మీద ఉన్న అందరం కలిసి దీని మీద పని చేయాలని అన్నారు. ప్రముఖ అంతరిక్ష దేశంగా మనం ఈ బాధ్యత తీసుకోవాలి. ఇది కేవలం భారతదేశానికి మాత్రమే కాదు.. యావత్ ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పు అని అన్నారు. సాంకేతిక సామర్థ్యం, ప్రోగ్రామింగ్ సామర్థ్యం వంటి వాటిని డెవలప్ చేసుకోవాలని.. ఇతర ఏజెన్సీలతో కలిసి పని చేసే సామర్థ్యాన్ని సిద్ధం చేయడానికి మనం బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని సోమనాథ్ అన్నారు. ఇదిలా ఉంటే ఏడాదిలోపు గ్రహశకలం భూమిని ఢీకొనే అవకాశం ఉందా? దాని నుంచి రక్షించుకోవడానికి పరిష్కారం ఉందా? అనే విషయాల మీద ప్రయోగం చేస్తున్నామని.. ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ అసోసియేట్ డైరెక్టర్, ఇస్రో టెలీమెట్రి అనిల్ కుమార్ వెల్లడించారు.