iDreamPost
android-app
ios-app

Samantha: వార్నింగ్ ఇచ్చిన డాక్టర్ కు సమంత రిప్లయ్ ఇదే.. సున్నితంగానే స్ట్రాంగ్ కౌంటర్!

  • Published Jul 05, 2024 | 7:13 PM Updated Updated Jul 05, 2024 | 7:13 PM

స్టార్ హీరోయిన్ సమంత పెట్టే ఓ పోస్ట్ పై తాజాగా ఓ డాక్టర్ స్పందించి తనపై విమర్శించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ డాక్టర్ తనపై దూషించి విమర్శించిన పోస్ట్ పై సమంత రియాక్ట్ అవుతూ ఓ పోస్ట్ పెట్టింది. కాగా, ప్రస్తుతం ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

స్టార్ హీరోయిన్ సమంత పెట్టే ఓ పోస్ట్ పై తాజాగా ఓ డాక్టర్ స్పందించి తనపై విమర్శించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ డాక్టర్ తనపై దూషించి విమర్శించిన పోస్ట్ పై సమంత రియాక్ట్ అవుతూ ఓ పోస్ట్ పెట్టింది. కాగా, ప్రస్తుతం ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Published Jul 05, 2024 | 7:13 PMUpdated Jul 05, 2024 | 7:13 PM
Samantha: వార్నింగ్ ఇచ్చిన డాక్టర్ కు సమంత రిప్లయ్ ఇదే.. సున్నితంగానే స్ట్రాంగ్ కౌంటర్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొన్నేళ్లుగా మయోసైటిస్ వ్యాధి బారినపడిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఆ వ్యాధితో బాధపడుతూ.. దాన్ని నుంచి బయటపడేందుకు కొన్నాళ్లుగా చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే సమంత.. నెటిజన్స్ కు , తన ఫ్యాన్స్ కు ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు, టిప్స్, డాక్టర్స్ సలహాలు అన్ని నెట్టింట పంచుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఎప్పటిలాగే.. వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మందులు వేసుకోవడం కంటే.. నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి పీల్చుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుందని సమంత సిఫార్సు చేయడమే కాకుండా.. తనకు సలహా ఇచ్చిన వైద్యుడిని కూడా ట్యాప్ చేసింది. అయితే సమంత చేసిన ఈ పోస్టుపై డాక్టర్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్ అకా ది లివడ్ డాక్ తప్పుపట్టారు. అంతేకాకుండా.. సమంతను ఉద్దేశిస్తూ.. సోషల్ మీడియాలో ఓ పోస్టు కూడా చేశారు.పైగా అందులో సమంతకు వైద్యపరంగా ఏం తెలియదని, ఆమెను జైల్లో పెట్టాలని కామెంట్ చేశారు. అయితే తాజాగా ఈ వ్యాఖ్యలపై రియాక్ట్ అయిన సమంత డాక్టర్ పెట్టిన పోస్ట్ కు వివరణ ఇస్తూ ఓ నోట్ షేర్ చేసింది. కాగా, ప్రస్తుతం ఆ నోట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా సమంత తనను జైల్లో పెట్టాలంటూ వార్నింగ్‌ ఇచ్చిన డాక్టర్‌ పోస్ట్‌పై స్పందించి వివరణ ఇచ్చింది. ఈ క్రమంలోనే తాను కూడా డాక్టర్ మాటలకు రిప్లై ఇస్తూ ఓ నోట్ షేర్ చేసింది. కాగా,ప్రస్తుతం సమంత చేసిన నోట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకి ఆ నోట్ లో సమంత ఏం రాసుకొచ్చిదంటే.. ‘గత రెండేళ్లుగా నేను నా ఆరోగ్యం దృష్ట్యా అనేక రకాల ఔషదాలను తీసుకోవాల్సి వచ్చింది. అలాగే నేను తీసుకోవాలని సూచించిన ప్రతిదానిని నేను ముందే ట్రై చేసి చూసిస్తాను. పైగా నేను పేరున్న నిపుణుల పరిశోధన చేసిన తర్వాత వారు సూచించినవి మాత్రమే నేను ట్రై చేశాను. అంతేకాకుండా.. నేను తీసుకుంటున్న వైద్యం చాలా ఖరీదైనది. నాకు ఆర్థికస్థోమత ఉంది కాబట్టి దాన్ని నేను భరించగలను. కానీ, అందరూ ఆ ఖర్చును భరించలేరు. అంత ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోలేరు. ఇక అలాంటి వారి గురించే  నేను ఆలోచించి హెల్త్‌ టిప్స్‌ చెబుతుంటాను. ఇక  దేని గురించైనా తెలుసుకోకుండా ఇతరులకు సలహా ఇచ్చేంత అమాయకురాలిని కాదు. నేను చికిత్స తీసుకుంటున్న డాక్టర్‌కు 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది’ అని చెప్పుకొచ్చింది.

అలాగే తనను విమర్శించిన డాక్టర్‌ను ఉద్దేశిస్తూ.. ‘ఓ పెద్ద మనిషి నా పోస్ట్‌ను, నా సలహాలను ఉద్దేశపూర్వకంగా చాలాా బలమైన పదాలతో దూషించార. ఇకపోతే ఆయన కూడా ఒక డాక్టరే. పైగా నాకంటే ఆయనకు ఎన్నో విషయాలపై అవగాహన ఉంటుందనడంలో సందేహం లేదు. కానీ, నన్ను నిందించడం కంటే నాకు చికిత్స చేసిన డాక్టర్‌తో ఆయన ముఖాముఖిలో పాల్గొని ఉంటే బాగుండేది. అంతేకాకుండా.. ఆయన నా గురించి మాట్లాడే సమయంలో అలాంటి పదాలు వాడకుండా ఉంటే ఆయనను నేను గౌరవించేదాన్ని. ఇక నన్ను జైల్లో పెట్టాలని ఆయన విమర్శించినందుకు నాకు బాధలేదు. కాకపోతే నేను  ఒక సెలబ్రిటీని కాబట్టి అంత సులువుగా నిందించాడని అనుకుంటాను. కానీ, నేను సెలబ్రిటీగా ఆ హెల్త్‌ టిప్‌ ఇవ్వలేదు. అలాగే డబ్బు కోసం ఆశపడి అసలే పోస్ట్ చేయలేదు. కేవలం ఒక సామాన్యమైన వ్యక్తిగా మాత్రేమే పోస్ట్‌ చేశాను’ అంటూ సమంత రాసుకొచ్చారు. ప్రస్తుతం సమంత చేసిన పోస్ట్ పై పలువురు స్పందించి కామెంట్స్ పెడుతున్నారు. మరి, డాక్టర్ ను ఉద్దేశించి సమంత చేసిన పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

jojobet girişmarsbahisJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetmarsbahis giriştaraftarium24madridbet güncel girişmadridbet güncel girişmadridbet