iDreamPost

రేపటి నుంచి భారత్-జింబాబ్వే టీ20 సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో అంటే?

  • Published Jul 05, 2024 | 7:39 PMUpdated Jul 05, 2024 | 7:39 PM

India vs Zimbabwe: టీమిండియా మరో ఇంట్రెస్టింగ్ సిరీస్ ఆడేందుకు సిద్ధమైపోయింది. జింబాబ్వేతో 5 టీ20 మ్యాచ్​లు ఆడనుంది భారత జట్టు.

India vs Zimbabwe: టీమిండియా మరో ఇంట్రెస్టింగ్ సిరీస్ ఆడేందుకు సిద్ధమైపోయింది. జింబాబ్వేతో 5 టీ20 మ్యాచ్​లు ఆడనుంది భారత జట్టు.

  • Published Jul 05, 2024 | 7:39 PMUpdated Jul 05, 2024 | 7:39 PM
రేపటి నుంచి భారత్-జింబాబ్వే టీ20 సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో అంటే?

టీ20 వరల్డ్ కప్ హంగామా ఇంకా ముగియలేదు. భారత జట్టు సాధించిన అపూర్వ విజయాన్ని అభిమానులు ఆస్వాదిస్తున్నారు. 13 ఏళ్ల గ్యాప్ తర్వాత కప్పు నెగ్గడంతో వాళ్ల సంతోషానికి హద్దులే లేకుండా పోయాయి. ప్రపంచ కప్ ట్రోఫీతో నిన్న ముంబైకి విచ్చేసిన రోహిత్ సేనకు నెక్స్ట్ లెవల్​లో వెల్​కమ్ లభించింది. లక్షలాది మంది ఫ్యాన్స్ ముంబైకి చేరుకొని మెన్ ఇన్ బ్లూకు విషెస్ చెప్పారు. కప్పు గెలిచినందుకు కంగ్రాట్స్ చెప్పారు. ట్రోఫీని స్వదేశానికి తీసుకొచ్చినందుకు వాళ్లకు థ్యాంక్స్ చెప్పారు. టీమిండియా నిర్వహించిన విక్టరీ పరేడ్ గ్రాండ్ సక్సెస్ అయింది. అభిమానులు భారీగా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దీంతో ఆటగాళ్లు చాలా సంతోషంగా కనిపించారు. ఒకవైపు టీమిండియా సెలబ్రేషన్స్ కంటిన్యూ అవుతున్న ఈ టైమ్​లోనే మరో ఆసక్తికర సిరీస్​కు రంగం సిద్ధమైంది.

జింబాబ్వే టూర్​కు వెళ్లిన యంగ్ ఇండియా.. రేపటితో తమ పర్యటనను ప్రారంభించనుంది. భారత్-జింబాబ్వే మధ్య ఐదు టీ20ల సిరీస్​కు శనివారం తెరలేవనుంది. హరారే స్టేడియం తొలి టీ20కి వేదిక కానుంది. ఇప్పటికే రెండు జట్లు అక్కడికి చేరుకొని ప్రాక్టీస్​ చేస్తున్నాయి. యువ బ్యాటర్ శుబ్​మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా సిరీస్​పై కన్నేసింది. జింబాబ్వేను వైట్​వాష్ చేయాలని చూస్తోంది. మొదటి మ్యాచ్​లోనే ఆ జట్టును చిత్తు చేసి.. హెచ్చరికలు పంపించాలని అనుకుంటోంది. మరోవైపు కాస్త బలహీనంగా కనిపిస్తోంది జింబాబ్వే. అయితే ఆ జట్టును తక్కువ అంచనా వేయడానికి లేదు. సికిందర్ రజా లాంటి డేంజరస్ ప్లేయర్ ఉన్న జింబాబ్వే సంచలనాలు సృష్టించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదిలా ఉంటే.. ఈ సిరీస్ స్ట్రీమింగ్ వివరాలు తెలుసుకునేందుకు ఆడియెన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.

భారత్-జింబాబ్వే సిరీస్ స్ట్రీమింగ్ ఎక్కడ అవుతుందా? అని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఫ్యాన్స్. ఈ రెండు జట్ల మధ్య జరిగే టీ20 సిరీస్​ను లైవ్ టెలికాస్ట్ చేయనుంది సోనీ స్పోర్ట్స్. ఈ మ్యాచులన్నీ సోనీ స్పోర్ట్స్ టెన్ 5, సోనీ స్పోర్ట్స్ టెన్ 5 హెచ్​డీ, సోనీ స్పోర్ట్స్ టెన్ 3, సోనీ స్పోర్ట్స్ టెన్ 3 హెచ్​డీ, సోనీ స్పోర్ట్స్ టెన్ 4తో పాటు సోనీ స్పోర్ట్స్ టెన్ 4 హెచ్​డీ ఛానళ్లలో టెలికాస్ట్ అవుతాయి. టీవీల్లో చూడాలనుకునేవారు పై ఛానళ్లలో లైవ్ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఓటీటీ యాప్​లో స్ట్రీమింగ్ కావాలనుకుంటే మాత్రం నేరుగా సోనీ లివ్​ యాప్​లో మ్యాచుల్ని ఎంజాయ్ చేయొచ్చు. మొదటి టీ20 మ్యాచ్ సాయంత్రం 4.30 గంటలకు స్టార్ట్ అవుతుంది. మరి.. భారత్-జింబాబ్వే సిరీస్ కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి