iDreamPost

హైటెక్ సిటీకి దగ్గరలో 47 లక్షలకే 2 బీహెచ్కే ఫ్లాట్.. ఇదే మంచి అవకాశం

2 BHK Flat @47L Near HITEC City: హైటెక్ సిటీకి అతి దగ్గరలో ఫ్లాట్స్ ధరలు మిడిల్ క్లాస్ వారి బడ్జెట్ లో అందుబాటులో ఉన్నాయి. సిటీలో ఫ్లాట్ కొనాలంటే కొనలేని పరిస్థితి. కాబట్టి ఈ హైటెక్ సిటీకి దగ్గరలో ఉన్న ఏరియాలో ఫ్లాట్ కొనుక్కోవడం ఉత్తమమైన ఛాయిస్.

2 BHK Flat @47L Near HITEC City: హైటెక్ సిటీకి అతి దగ్గరలో ఫ్లాట్స్ ధరలు మిడిల్ క్లాస్ వారి బడ్జెట్ లో అందుబాటులో ఉన్నాయి. సిటీలో ఫ్లాట్ కొనాలంటే కొనలేని పరిస్థితి. కాబట్టి ఈ హైటెక్ సిటీకి దగ్గరలో ఉన్న ఏరియాలో ఫ్లాట్ కొనుక్కోవడం ఉత్తమమైన ఛాయిస్.

హైటెక్ సిటీకి దగ్గరలో 47 లక్షలకే 2 బీహెచ్కే ఫ్లాట్.. ఇదే మంచి అవకాశం

ఇవాళ హైటెక్ సిటీలో ఒక 2 బీహెచ్కే ఫ్లాట్ కొనాలంటే చదరపు అడుగు ధర రూ. 12,450 ఉంది. అంటే ఒక 1000 చదరపు అడుగుల ఫ్లాట్ కొనాలంటే కోటి 25 లక్షల వరకూ అవుతుంది. ఈ బడ్జెట్ లో ఫ్లాట్ కొనాలంటే చిన్న పాటి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కి అసాధ్యం. మాదాపూర్, గచ్చిబౌలి ఏరియాల్లో కూడా ఫ్లాట్ కొనాలంటే కొనలేని పరిస్థితి. గచ్చిబౌలిలో చదరపు అడుగు సగటున రూ. 10,300 ఉంది. 2 బీహెచ్కే ఫ్లాట్ కొనాలంటే కోటి రూపాయల పైనే అవుతుంది. ఇక మాదాపూర్ లో ఫ్లాట్ ధర చదరపు అడుగుకి సగటున రూ. 6,950 పడుతుంది. అంటే ఈ ఏరియాలో 2 బీహెచ్కే ఫ్లాట్ కొనుక్కోవాలంటే గనుక సుమారు 70 లక్షలు అవుతుంది. అయితే హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ఏరియాలకు దగ్గరలో ఇంతకంటే తక్కువ ధరలకు 2 బీహెచ్కే ఫ్లాట్ వస్తుందంటే నమ్ముతారా? 

హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ఏరియాలకు 18 నుంచి 20 కి.మీ. దూరంలో ఉన్న మల్లంపేటలో తక్కువ ధరకే ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. హైటెక్ సిటీకి 40 నుంచి 45 నిమిషాల సమయం పడుతుంది. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి వంటి ఏరియాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఈ ఏరియా బెస్ట్ ఆప్షన్. ఆఫీసులకు అప్ అండ్ డౌన్ చేయాలన్నా గానీ 20 కి.మీ. దూరంలో ఉంటుంది కాబట్టి ట్రావెలింగ్ కష్టం అనిపించదు. లేదు ఇన్వెస్ట్మెంట్ పరంగా అయినా ఈ ఏరియా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చదరపు అడుగు సగటున రూ. 4,700గా ఉంది. అంతకు ముందు యావరేజ్ గా రూ. 4,650గా ఉండేది. మార్చి నెల తర్వాత ఈ ధర పెరిగింది. మల్లంపేటలో 2 బీహెచ్కే ఫ్లాట్ కొనాలంటే కనుక సుమారు రూ. 47 లక్షలు అవుతుంది.   

మల్లంపేటలో ఫ్లాట్ కొనడం వల్ల ఏంటి లాభం?

దూరంలో కాస్త సిటీకి దగ్గరలో ఉంది. ఇక ధరల పరంగా చూసుకున్నా మధ్యతరగతి వాళ్ళు తట్టుకునేలా ఉంది. అవుటర్ రింగ్ రోడ్ కి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. సిటీలోని ఇతర లొకేషన్స్ కి ఈజీ కనెక్టివిటీ ఉంది. ఇక మల్లంపేటలో పలు స్కూల్స్ ఉన్నాయి. దగ్గరలో ఇంటర్నేషనల్ స్కూల్స్, మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్, కాలేజీలు ఉన్నాయి. గత పదేళ్లలో ఈ ఏరియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, కనెక్టివిటీ పరంగా బాగా డెవలప్ అయ్యింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతున్న కారణంగా ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఐటీ సెక్టార్ లో కూడా బోలెడన్ని ఉద్యోగ అవకాశాలు దొరకనున్నాయి. ఈ కారణాలతో మల్లంపేటలో ఫ్లాట్ కొనడానికైనా.. ఇన్వెస్ట్ చేయడానికైనా బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు. ఫ్యూచర్ లో ఈ ధరలు పెరుగుతాయి కాబట్టి లాభాలు కూడా ఉంటాయని చెబుతున్నారు.  

గమనిక: ఈ కథనం కేవలం అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. గమనించగలరు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి