iDreamPost
android-app
ios-app

రాజ్ తరుణ్- లావణ్యల ఇష్యూపై.. CI ఏమన్నారంటే?

  • Published Jul 05, 2024 | 6:27 PM Updated Updated Jul 05, 2024 | 6:27 PM

టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే రాజ్ తరుణ్ సైతం ఈ ఇష్యూపై స్పందించాడు. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై సీఐ ఏమన్నారంటే..?

టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే రాజ్ తరుణ్ సైతం ఈ ఇష్యూపై స్పందించాడు. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై సీఐ ఏమన్నారంటే..?

  • Published Jul 05, 2024 | 6:27 PMUpdated Jul 05, 2024 | 6:27 PM
రాజ్ తరుణ్- లావణ్యల ఇష్యూపై.. CI ఏమన్నారంటే?

తనను టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ మోసం చేశాడంటూ నార్సింగి పోలీసులను ఆశ్రయించింది అతడి ప్రియురాలు లావణ్య. 11 ఏళ్లుగా తాము రిలేషన్ షిప్‌లో ఉన్నామని, గుడిలో పెళ్లి చేసుకున్నామని, తామిద్దరం శారీరకంగా ఒక్కటి అయ్యామని, ఇప్పుడు మరో నటితో ఎఫైర్ పెట్టుకుని తనను వదిలేశాడని  వాపోయింది.  అతడ్ని వదిలేయాలని సదరు హీరోయిన్, ఆమె సోదరుడు బెదిరించారని ఫిర్యాదులో పేర్కొంది. వీరిద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని గోవా, పాండిచ్చేరి ప్రాంతాల్లో తిరిగారని, అది తెలిసి తను ప్రశ్నించే సరికి డ్రగ్ కేసులో ఇరికించాడంటూ పేర్కొంది. తనకు రాజ్ తరుణ్ కావాలంటూ పోలీసులను వేడుకుంది. వీరిద్దరూ క్లోజ్‌గా ఉన్న ఫోటోలు మీడియాలో వైరల్ అయిన సంగతి విదితమే.

అలాగే ఈ ఘటనపై రాజ్ తరుణ్ కూడా స్పందించాడు. గతంలో ఆమెను ప్రేమించిన మాట వాస్తమేనని, షార్ట్ ఫిల్మ్స్ తీసిన రోజుల నుంచి ఆమె తెలుసునని చెప్పాడు. గతంలో చాలా సహాయం చేసిందని చెప్పాడు. తనలో రిలేషన్ షిప్ నిజమేనని అంగీకరించాడు. కానీ ఆ తర్వాత ఆమె డ్రగ్స్‌కు ఎడిక్ట్ అయ్యిందని, పలు సార్లు తనను మందలించానని తెలిపాడు. చెడు స్నేహాలకు అలవాటు పడిందని, ఇక భరించలేక ఆమె ఫ్లాట్ ఖాళీ చేసి వచ్చేశానని చెప్పాడు. ఇప్పుడు ఆమె ఉంటున్న ఇల్లు కూడా తనదేనని, ఆమె మస్తాన్ సాయి అనే యువకుడితో డేటింగ్ చేసింది. అతడిపై గుంటూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని చెప్పాడు. ఆమె తండ్రిని కూడా మోసం చేసిందని అన్నాడు. జీవితంలో తాను ఇక పెళ్లి చేసుకోకూడదనుకున్నానని.. పలు ఇంటర్వ్యూలో కూడా చెప్పినట్లు గుర్తు చేశాడు.

తాను లావణ్యపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని చెప్పాడు. తాను కూడా ఆమెపై ఫిర్యాదు చేస్తానని చెప్పాడు. ఇదిలా ఉంటే..రాజ్ తరుణ్-లావణ్యల ఇష్యూపై నార్సింగి సీఐ హరికృష్ణ వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై మాట్లాడుతూ..  ‘హీరో రాజ్ తరుణ్ పై లావణ్య ఫిర్యాదు చేసింది. గత కొన్నేళ్లుగా ఆ హీరోతో రిలేషన్ లో ఉన్నానని, గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాం అని, ఇప్పుడు తనని వదిలేసి వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని ఫిర్యాదు చేసింద’ని వివరించారు సీఐ హరికృష్ణ. ఇక యువతీ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామని, సాక్ష్యాలు సేకరిస్తున్నామని, ఆ తర్వాతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. అవసరం అనుకుంటే హీరోని కూడా పిలిచి విచారిస్తామని చెప్పారు. ఒకవేళ రాజ్ తరుణ్ కూడా ఫిర్యాదు చేస్తే.. రెండు ఫిర్యాదులను కూడా పరిగణంలోకి తీసుకొని విచారణ చేపడతామని చెప్పారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom