iDreamPost

వేలాడుతూ రీల్స్ చేసిన యువతీ యువకుడు అరెస్ట్

రీల్స్, షాట్స్ అంటూ పొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు చాలా మంది డేంజర్ స్టంట్స్ చేస్తూ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఫేమ్ అయ్యేందుకు పిచ్చి పనులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

రీల్స్, షాట్స్ అంటూ పొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు చాలా మంది డేంజర్ స్టంట్స్ చేస్తూ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఫేమ్ అయ్యేందుకు పిచ్చి పనులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

వేలాడుతూ రీల్స్ చేసిన యువతీ యువకుడు అరెస్ట్

ప్రతి ఒక్కరి జీవితంలో సోషల్ మీడియా ఎంతో కొంత ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే కొంత మంది దీనికి ఎడిక్ట్ అయిపోతున్నారు. కొన్నియాప్స్ ఆదాయ వనరులుగా, మార్గాలుగా నిలవడంతో వాటిల్లో ఫేమస్ అయ్యేందుకు ఇష్టమైన స్టంట్స్ చేస్తున్నారు. రీల్స్, షాట్స్, స్నాప్స్ అంటూ పిచ్చి పిచ్చి పనులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అంత వరకు ఓకే కానీ.. కొన్ని సార్లు ఈ క్రాక్ పరాకాష్టకు చేరుకుంటుంది. ప్రాణాలను లెక్క చేయకుండా రైల్వే ట్రాకులపైనే, రోడ్డుపై, ఎత్తైన ప్రాంతాల్లో రిస్కీ షాట్స్ చేస్తూ వీడియోలు చేస్తున్నారు. ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తల్లిదండ్రులకు శోకాన్ని మిగులుస్తున్నారు. తాజాగా రీల్ కోసం పది అంతస్థుల ఎత్తులో ఉండి డేంజర్ స్టంట్ చేశారు యువీ యువకులు. ఇది విపరీతంగా వైరలైన సంగతి విదితమే.

ఇన స్టా గ్రామ్‌లో రీల్ కోసం ఎత్తైన బిల్లింగ్ రూఫ్ పైన పడుకుని ఓ అబ్బాయి.. అతడి చేయి పట్టుకుని అంత ఎత్తున గాల్లో వేలాడుతుంది అమ్మాయి. ఈ ఘటన మహారాష్ట్ర పూణెలో చోటుచేసుకుంది. మరొకరు వీడియో షూట్ చేస్తున్నారు. ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుండటంతో నెటిజన్లు విపరీతంగా ఫైర్ అయ్యారు. అయితే వీరిపై చర్యలు తీసుకోవాలంటూ ట్వీట్ చేశారు. చివరకు పోలీసులు ఈ ఘటనపై స్పందించారు. ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. వీరిని మిహిర్ గాంధీ, మీనాక్షిగా గుర్తించారు. వీరిని అరెస్టు చేసి ఐపీసీ సెక్షన్ 366 కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఆ తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే నేరం నిరూపితమైతే.. ఆరు నెలల జైలు శిక్ష జరిమానా ఉండేదని తెలిపారు పోలీసులు.

అయితే నేర తీవ్రత స్థాయి తక్కువ కావడంతో స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేసినట్లు చెబుతున్నారు. ఈ రీల్ షూట్ చేసిన యువకుడు పరారీలో ఉన్నాడని, త్వరలో అతడ్ని కూడా అరెస్టు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. అమ్మాయి కాస్త పట్టుతప్పి ఉంటే.. కింద పడేదని, ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే సహించేది లేదని, వారిపై కఠినంగా వ్యవహరిస్తామని వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. ఫేమస్ అయ్యేందుకు రీల్స్, వీడియోలు చేస్తూ ప్రాణాలను పొగొట్టుకోవద్దని, తల్లిదండ్రులకు శోకం మిగల్చవద్దని యువతను ఉద్దేశించి హితవు పలికారు. కాగా, పోలీసులు చర్యలు తీసుకోవడంటే.. తిక్క కుదిరిందని భావిస్తున్నారు నెటిజన్లు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి