iDreamPost

మరో కోకాపేట, మణికొండగా ఆ ఏరియాలు! ఇప్పుడు కొంటే కోటీశ్వరులయ్యే ఛాన్స్!

More Profitable Lands: హైదరాబాద్ సిటీలో ఉన్న స్థలాలను సామాన్యులు కొనే పరిస్థితి లేదు. అయినప్పటికీ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టి లాభాలు పొందాలని అనుకుంటే కనుక ఇప్పుడు చెప్పుకోబోయే ఏరియాల్లో స్థలాలు కొనుగోలు చేస్తే.. ఫ్యూచర్ లో హైదరాబాద్ సిటీలో మాదిరి ధరలు పెరిగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.

More Profitable Lands: హైదరాబాద్ సిటీలో ఉన్న స్థలాలను సామాన్యులు కొనే పరిస్థితి లేదు. అయినప్పటికీ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టి లాభాలు పొందాలని అనుకుంటే కనుక ఇప్పుడు చెప్పుకోబోయే ఏరియాల్లో స్థలాలు కొనుగోలు చేస్తే.. ఫ్యూచర్ లో హైదరాబాద్ సిటీలో మాదిరి ధరలు పెరిగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.

మరో కోకాపేట, మణికొండగా ఆ ఏరియాలు! ఇప్పుడు కొంటే కోటీశ్వరులయ్యే ఛాన్స్!

హైదరాబాద్ సిటీలో స్థలం కొనాలంటే సామాన్యులకు అయ్యే పని కాదు. కోకాపేటలో సగటున చదరపు అడుగు స్థలం రూ. 15 వేలు దాకా ఉంది. 1000 చదరపు అడుగుల స్థలం కొనాలంటే రూ. కోటి యాభై లక్షలు అవుతుంది. ఇక మణికొండలో చదరపు అడుగు సగటున రూ. 12,650 ఉంది. ఇక్కడ ఒక 1000 చదరపు అడుగుల స్థలం కొనాలంటే కోటి 30 లక్షల దాకా అవుతుంది. ఆ పై 30 లక్షలు పెట్టుకుంటే ఇంతకంటే ఎక్కువ స్థలం ఫ్యూచర్ మణికొండ, కోకాపేటగా పిలవబడుతున్న ఏరియాల్లో వస్తుంది. అవును ఇప్పుడు తక్కువ రేటు పలుకుతున్న ఏరియాలు రానున్న రోజుల్లో కోకాపేట, మణికొండ ఏరియాలను తలపించనున్నాయని నిపుణులు చెబుతున్నారు. 

అవుటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకూ ఉన్న ఏరియాలను అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. మెట్రో ఫేజ్ 2 విస్తరించాలని ప్రతిపాదనలు అయితే ఉన్నాయి. ఎయిర్ పోర్టుకి కనెక్ట్ చేయాలని.. ఎయిర్ పోర్టు నుంచి మిగతా ఏరియాలకు మెట్రో విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకూ కూడా ప్రాంతాలు డెవలప్ కానున్నాయి. ఘట్కేసర్, శంషాబాద్, తుక్కుగూడ, కొల్లూరు, నార్సింగి, శామీర్ పేట్, మేడ్చల్ సహా పలు ఏరియాల మీదుగా అవుటర్ రింగ్ రోడ్ వెళ్తుంది. సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో కొన్ని గ్రామాల మీదుగా రీజనల్ రింగ్ రోడ్డు అనేది వస్తుంది. మల్కాపూర్, గిర్మాపూర్, పెద్దాపూర్, నాగపూర్, చింతల్ పల్లి, ఇరిగిపల్లె, శివంపేట్, లింగోజిగూడ, కొత్తపేట సహా పలు గ్రామాల మీదుగా రీజనల్ రింగ్ రోడ్డు అనేది వస్తుంది.

ఈ ఏరియాల్లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు:

అవుటర్ రింగ్ రోడ్డు వైపు చూసుకుంటే.. షాద్ నగర్, బెంగళూరు హైవే, ముంబై హైవే, శ్రీశైలం హైవే, విజయవాడ హైవే, వరంగల్ హైవే ఇలా ఈ ఏరియాల్లో తక్కువ రేటుకే స్థలాలు దొరుకుతున్నాయి. శ్రీశైలం హైవేలో చదరపు అడుగు స్థలం 1300, వరంగల్ హైవే చూసుకుంటే చదరపు అడుగు 1400, బెంగళూరు హైవే దగ్గర చదరపు అడుగు 1600 పలుకుతున్నాయి. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ మధ్యలో తగిలే ఏరియాల్లో పెట్టుబడి పెడితే ఫ్యూచర్ లో భారీ లాభాలను ఆశించవచ్చునని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.

కోటీశ్వరులయ్యే ఛాన్స్:

ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ మధ్యలో ఉన్న ఏరియాలు ఫ్యూచర్ లో కోకాపేట, మణికొండ ఏరియాల్లా డెవలప్ కానున్నాయని అంటున్నారు. ఈ ఏరియాల్లో చదరపు అడుగు స్థలం 1300, 1500, 2000 రేంజ్ లో ఉన్నాయి. ఈ ధర పెట్టి ఇప్పుడు కొనుగోలు చేస్తే కనుక ఆ ప్రాంతాలు డెవలప్ అయ్యే సమయానికి చదరపు అడుగు 5 వేల నుంచి 10 వేల మధ్య పలుకుతుందని అంటున్నారు. ఉదాహరణకు ఇప్పుడు గజం 12 వేలు చొప్పున 100 గజాల స్థలాన్ని 12 లక్షలకు కొనుగోలు చేస్తే.. గజం 50 వేలు, లక్ష అయితే కనుక 50 లక్షల నుంచి కోటి రూపాయలు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. 

గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి