iDreamPost
android-app
ios-app

ఆచార్య మీద అంతా గప్ చుప్

  • Published Mar 09, 2020 | 5:28 AM Updated Updated Mar 09, 2020 | 5:28 AM
ఆచార్య మీద అంతా గప్ చుప్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య గురించిన అప్ డేట్స్ ఉన్నట్టుండి ఆగిపోయాయి. ఇందులో చాలా కీలకమైన క్యామియో లాంటి పాత్రలో మహేష్ బాబు నటిస్తాడని కొన్నిరోజుల పాటు ఎడతెగని ప్రచారం జరిగింది. లేదు రామ్ చరణ్ మళ్ళీ సీన్ లోకి వచ్చాడు తనే చేస్తాడని ఇంకో వార్త హల్చల్ చేసింది. కానీ ఫైనల్ గా దాని తాలూకు అసలైన ఇన్ఫర్మేషన్ మాత్రం ఇప్పటిదాకా రాలేదు. మరోపక్క షూటింగ్ మాత్రం నిర్విరామంగా జరిగిపోతోంది.

ఇటీవలే ఆరు రోజుల పాటు చిరు, రెజీనాల మీద ఒక స్పెషల్ సాంగ్ పూర్తి చేసింది టీమ్. ఖైదీ నెంబర్ 150 తరహాలో ఇందులో కూడా ఓ రేంజ్ స్టెప్స్ ఉంటాయని ఇప్పటికే టాక్ వచ్చింది. ఇది కాకుండా మరో సోలో ఇంట్రో పాట కూడా గతంలోనే పూర్తి చేశారు. హీరోయిన్ త్రిష ఇంకా సెట్స్ లోకి అడుగుపెట్టలేదు. అసలు తను ఉందో లేదో కూడా ఖరారుగా తెలియదు. ఈ కాంబోలో రెండు పాటలు ఉంటాయట. సో ఇప్పుడు తేలాల్సింది మహేశా లేక చరణా అనే సంగతి. దీని మీద మహేష్ బాబు టీమ్ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తోంది. సమర్ధించడం లేదు అలా అని ఖండించడమూ లేదు.

రిలీజ్ డేట్ విషయంలో కూడా స్పష్టత రావడం లేదు. దసరా టార్గెట్ తో కొరటాల వేగంగా పూర్తి చేస్తున్నాడు కానీ ఆ స్పెషల్ రోల్ ఎవరు చేస్తారనే సంగతి త్వరగా తేలకపోతే మాత్రం ఆలస్యం తప్పదు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్న ఆచార్య ఫస్ట్ లుక్ ని మార్చ్ 25న విడుదల చేసే ఆలోచనలో టీమ్ ఉంది. టైటిల్ ఎలాగూ లీకైపోయింది కాబట్టి ఇక దాచడానికి ఏమి లేదు. సైరా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో మెగా ఫ్యాన్స్ ఆశలన్నీ ఆచార్య మీదే ఉన్నాయి. దాని కన్నా ముందే పవన్ వకీల్ సాబ్ వస్తుంది కాబట్టి తక్కువ గ్యాప్ లో రెండు పండుగలు ఖాయమని ఫిక్స్ అయిపోయారు. మరి ఆచార్య తన సైలెన్స్ ని ఎప్పుడు బ్రేక్ చేసి ఈ పుకార్ల షికారుకు చెక్ పెడతాడో వేచి చూడాలి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş