iDreamPost
android-app
ios-app

Tollywood: సంక్రాంతి డబ్బులు ఇంకా రాలేదు

వెనకటికి ఓ సామెత వుంది. కేసు ఓడిన వాడు అక్కడే ఏడుస్తాడు..గెల్చిన వాడు ఇంటికెళ్లి బాధపడతాడు అని.

వెనకటికి ఓ సామెత వుంది. కేసు ఓడిన వాడు అక్కడే ఏడుస్తాడు..గెల్చిన వాడు ఇంటికెళ్లి బాధపడతాడు అని.

Tollywood: సంక్రాంతి డబ్బులు ఇంకా రాలేదు

వెనకటికి ఓ సామెత వుంది. కేసు ఓడిన వాడు అక్కడే ఏడుస్తాడు..గెల్చిన వాడు ఇంటికెళ్లి బాధపడతాడు అని. తెలుగు సినిమా వ్యవహారం కూడా అలాంటిదే. హిట్ అయిపోయినంత మాత్రాన నిర్మాత హ్యాపీ అని కాదు. సోషల్ మీడియాలో హడావుడి జరిగిపోతూ వుంటుంది. ఇంత కలెక్షన్..అంత లాభం. హీరోల ఫ్యాన్స్ హుషారయిపోతారు. కానీ నిర్మాతకు మాత్రం అన్ని లెక్కలు తేలాలి అంటే కనీసం ఏడాది పడుతుంది. ఓటిటి ల నుంచి, నాన్ థియేటర్ నుంచి పూర్తిగా డబ్బులు రావాలన్నా, బయర్లు లెక్కలు చెప్పి, ఓవర్ ఫ్లోస్ తేల్చాలి అన్నా కూడా అంతే టైమ్ పడుతుంది.

బయ్యర్లు ఓవర్ ఫ్లోస్ ఒకంతట ఇవ్వరు. అసలు ముందు లెక్కలే తేల్చరు.సోషల్ మీడియాలో ఆ జిల్లా ఇంత, ఈ ఏరియా అంత అనే లెక్కలు ఏ రోజుకు ఆ రోజు వచ్చేస్తాయి. నిర్మాతకు డిసిఆర్ లు కూడా వస్తాయి. కానీ టోటల్ రన్ అయిన తరువాత రెంట్ లు, పర్సంటేజ్ లు కట్టి, డెఫిసిట్ లు తీసేసి, ఇలా అన్నీ చేసిన తరువాత ఫైనల్ నెంబర్ వస్తుంది. అప్పుడు ఓవర్ ఫ్లోస్ లెక్క తేలతాయి. ఓవర్ ఫ్లోస్ క్లారిటీగా కనిపిస్తూ వుంటే మధ్యలో కొంత మొత్తం పంపమని అడగడం, బయ్యర్లు పంపిస్తే పంపడం కామన్. కానీ చాలా మంది పంపరు. టోటల్ రన్ అయిన తరవాత కూడా ఇదిగో..అదిగో అంటూ వస్తారు.

సంక్రాంతికి విడుదలైన ఓ హిట్ సినిమాకు ఇప్పటి వరకు లెక్కలు తేల్చినా డబ్బులు ఇవ్వలేదు కొందరు బయ్యర్లు అని తెలుస్తోంది. అంటే సినిమా విడుదలయింది. ఆరు నెలలు గడిచింది. అయినా ఇంకా నిర్మాత చేతికి రావాల్సిన మొత్తం రాలేదు. నిర్మాత పైకి చెప్పలేక, బయ్యర్ల మీద ఒత్తిడి తేలేక కిందా మీదా అవుతున్నారు.

ఇది తెలియక ఫ్యాన్స్ మాత్రం తమ హీరో సినిమా అదరకొట్టింది అనుకుంటూ వుంటారు. కానీ ఈ అదరగొట్టడం వల్ల నిర్మాతకు ఏమీ లాభం లేదని వాళ్లకు తెలియదు.

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş