iDreamPost
android-app
ios-app

Sing Geetham: నెల లోపే నెట్ ఫ్లిక్స్ లోకి

ఓ పక్క థియేటర్లకు జనాలు రావడం లేదు..ఓటిటి చంపేస్తోంది అనేది నిర్మాతలే.

ఓ పక్క థియేటర్లకు జనాలు రావడం లేదు..ఓటిటి చంపేస్తోంది అనేది నిర్మాతలే.

Sing Geetham: నెల లోపే నెట్ ఫ్లిక్స్ లోకి

ఓ పక్క థియేటర్లకు జనాలు రావడం లేదు..ఓటిటి చంపేస్తోంది అనేది నిర్మాతలే. మరోపక్కన ఓటిటికి అమ్మేసి డబ్బులు చేసుకునేది వాళ్లే. ఎనిమిది వారాల ఓటిటి అనేది వస్తేనే సినిమాలు బతుకుతాయి అంటున్నారు నిర్మాతలు. కానీ నెల రోజులకే ఓటిటికి అగ్రిమెంట్ చేస్తున్నారు. కొన్ని సినిమాలు అయితే ఇంకా త్వరగానే ఓటిటి లోకి వచ్చేస్తున్నాయి. అలా వస్తుంటే ప్రేక్షకులు ఓ మూడు వారాలు వేచి వుంటారు తప్ప, వందలు ఖర్చు చేసి థియేటర్ కు ఎందుకు వస్తారు?

లేటెస్ట్ గా గత నెల రెండో వారంలో విడుదలైన సింగ్ గీతం సినిమా ఓటిటి లోకి వచ్చేసింది ఇంకా నెల రోజులు గడవకుండానే. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో, నాగ్ అశ్విన్ సూపర్ విజన్ లో తయారైన ఈ సినిమా కు మంచి క్రిటికల్ అప్లాజ్ వచ్చింది. కానీ థియేటర్లో పెద్దగా ఆడలేదు. తమిళ వెర్షన్ ను ఓ వారం వెనుకగా విడుదల చేసారు. కానీ అక్కడ కూడా పెద్దగా రెస్పాన్స్ రాలేదు.

మరి విడుదలకు ముందే అగ్రిమెంట్ చేసుకున్నారో, తరువాత మరి కాస్త అదనుపు మొత్తానికి ఓకె అన్నారో తెలియదు కానీ, జూన్ 12న విడుదలైన ఈ సినిమా జూలై 8 నాటికే నెట్ ఫ్లిక్స్ లో ప్రత్యక్షం అయిపోయింది. జనాలు కూడా దీనికే అలవాటు పడుతున్నారు. చిన్న సినిమా అయితే చాలు, ఓటిటి లో త్వరగా వచ్చేస్తుంది అని ఫిక్స్ అయిపోతున్నారు. మరీ అద్భుతం అనిపిస్తే తప్ప థియేటర్ వైపు చూడడం లేదు. ఇప్పుడు ఇంక ఇలా మూడు వారాలకు అలవాటు చేస్తే పరిస్థితి ఇంకా దారుణంగా మారే అవకాశం వుంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş