iDreamPost
android-app
ios-app

Tollywood: ఇండస్ట్రీకి ఎందుకు ఈ ఫాల్స్ ప్రెస్టీజ్?

  • Published Jul 08, 2026 | 12:20 PM Updated Updated Jul 08, 2026 | 12:20 PM

ఏ వ్యాపార రంగంలో వ్యాపారస్థుడిని అయినా అడగండి..ఎలా వుంది.ఎంత లాభం వస్తోంది అని? ‘ఏం బాగుంది..ఏదో అలా నడచిపోతోంది..’ అనే సమాధానం వస్తుంది. లాభాలు.. అంటే.. ఏం లాభాలు లెండి అని సమాధానం వస్తుంది.

ఏ వ్యాపార రంగంలో వ్యాపారస్థుడిని అయినా అడగండి..ఎలా వుంది.ఎంత లాభం వస్తోంది అని? ‘ఏం బాగుంది..ఏదో అలా నడచిపోతోంది..’ అనే సమాధానం వస్తుంది. లాభాలు.. అంటే.. ఏం లాభాలు లెండి అని సమాధానం వస్తుంది.

Tollywood: ఇండస్ట్రీకి ఎందుకు ఈ ఫాల్స్ ప్రెస్టీజ్?

ఏ వ్యాపార రంగంలో వ్యాపారస్థుడిని అయినా అడగండి..ఎలా వుంది.ఎంత లాభం వస్తోంది అని? ‘ఏం బాగుంది..ఏదో అలా నడచిపోతోంది..’ అనే సమాధానం వస్తుంది. లాభాలు.. అంటే.. ఏం లాభాలు లెండి అని సమాధానం వస్తుంది. కానీ టాలీవుడ్ లో మాత్రం చిత్రమైన పరిస్థితి వుంటుంది. సినిమాలు ఆడడం లేదు. పరిస్థితి బాలేదని నిర్మాతలు అందరూ కలిసినపుడు అంటారు. కానీ విడివిడిగా సినిమాలు తీసినపుడు మాత్రం నాన్ థియేటర్ ఇంతకు అమ్మాం..థియేటర్ ఇంతకు అమ్మాం అంటూ ఫీలర్లు వదులుతారు. అసలు నష్టమే లేదన్నట్లు కబుర్లు చెబుతారు. సినిమా మరీ దారణంగా ఫెయిల్ అయితే కూడా పెద్దగా సమస్య లేదన్నట్లు మాట్లాడతారు.

ఇవన్నీ పెద్ద లేదా కాస్త నోటెడ్ హీరోలకు సంబంధించిన సినిమాలకే. అంటే నిర్మాతలు ఇలా మాట్లాడడం వెనుక హీరోలు వున్నారనుకోవాలా? పబ్లిక్ గా ఫలానా హీరో సినిమా వల్ల తమకు నష్టం వచ్చింది అని చెబితే మళ్లీ హీరోలు ఎక్కడ ఫీలవుతారో అనే భయం. ఏ సినిమా నిర్మాణంలో వున్నా, విడుదలకు దగ్గర పడినా, విడుదల టైమ్ లో అయినా నాన్ థియేటర్ బిజినెస్ ఎస్కలేట్ చేసి ఎక్కువ చెప్పుకుంటారు. థియేటర్ బిజినెస్ ఇంతా అంత అని ఫీలర్లు వదులుతారు.

నిజానికి దీని వల్ల ప్రేక్షకులకు వచ్చిన నష్టం లేదు. హీరోల ఆ నెంబర్లే కరెక్ట్ అనుకుంటున్నారు. ఆ కలెక్షన్లే కరెక్ట్ అనుకుంటున్నారు. రెమ్యూనిరేషన్లు కొండెక్కించి కూర్చుంటున్నారు. కలెక్షన్లు దాచడం వల్ల, అమ్మకాలు దాచడం వల్ల, నష్టాలు దాచేయడం వల్ల హీరోలు రియాల్టీ లో వుండడం లేదు. నిర్మాతలే రాంగ్ ఫిగర్లు చెబుతుంటూ మీడియా సరైన ఫిగర్లు చెబితే ఫ్యాన్స్ రివర్స్ అవుతున్నారు. దాంతో వాస్తవాలు బయటకు రావడం లేదు.

టాలీవుడ్ మొత్తం మూడు వంతులకు పైగా ఫాల్స్ ప్రెస్టీజ్ మీదే నడుస్తోంది. నిర్మాతలకు దీంట్లో వచ్చిన లాభం ఏమీ లేదు హీరోల గుడ్ లుక్స్ లో వుండడం తప్ప. అలాగే బ్యానర్ ఫుల్ హ్యాపీగా వుంది. నష్టాల్లో లేదు అని ఫండింగ్ జనాలను నమ్మించడం తప్ప.

ఇండస్ట్రీ ఎప్పుడయితే ఓపెన్ అవుతుందో, అమ్మకాలు, కలెక్షన్లు, నిర్మాణ వ్యయం ఇవన్నీ క్లారిటీగా బయటకు వస్తాయో అప్పుడే హీరోల రెమ్యూనిరేషన్లు కాస్తయినా తగ్గడానికి అవకాశం వుంది. లేదంటే అంతే .

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet