iDreamPost
android-app
ios-app

ఆచార్యకు త్రిష షాక్ : అఫీషియల్

  • Published Mar 13, 2020 | 4:26 PM Updated Updated Mar 13, 2020 | 4:26 PM
ఆచార్యకు త్రిష షాక్ : అఫీషియల్

మెగాస్టార్ 152వ సినిమాగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్యకు మొదటి షాక్ తగిలింది. తొలుత హీరొయిన్ గా ఎంపికైన త్రిష ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు ట్విట్టర్ ద్వారా అఫీషియల్ గా ప్రకటించేసింది. సృజనాత్మకత విభేదాల కారణంగానే చిరంజీవి సర్ సినిమా నుంచి వైదొలగుతున్నట్టు, ముందు చెప్పిన ప్రకారం తన పాత్ర లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని అర్థం వచ్చేలా ట్వీట్ చేసింది. తెలుగు ఆడియన్స్ తనను ఎప్పుడూ ప్రేమించారని చెప్పిన త్రిష మొత్తానికి పెద్ద ఝలక్ ఇచ్చింది.

ఇప్పటికిప్పుడు చిరు పక్కన జోడిని సెట్ చేసుకోవడం అంత ఈజీ కాదు. ఇప్పుడు అవసరం టీమ్ ది కనక ఎవరిని అప్రోచ్ అయినా రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేసే ఛాన్స్ ఉంది. లేదూ ఆయనతో నటించడమే అదృష్టం అనుకునేవాళ్లు దొరికితే తప్ప. ఇప్పటికే మహేష్ బాబు పాత్ర విషయంలో డైలమా తీరకముందే కొరటాల శివకు కొత్త తలనెప్పి వచ్చింది. షూట్ లో బిజీగా ఉన్న తరుణంలో దీన్ని వెంటనే పరిష్కరించుకోవడం చాలా అవసరం.

చిరుతో త్రిష ఎప్పుడో 14 ఏళ్ళ క్రితమే జోడి కట్టింది. 2006లో వచ్చిన స్టాలిన్ ఈ కాంబోలో వచ్చిన ఒకే ఒక్క మూవీ. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఆ మూవీ జస్ట్ యావరేజ్ అనిపించుకుంది. దీని తర్వాత శంకర్ దాదా జిందాబాద్ చేసి చిరు రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు త్రిష స్థానంలో ఎవరొస్తారు అనేదే అభిమానుల పెద్ద ప్రశ్న. ఇప్పటికే కీలక భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఆచార్యలో కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, ఓ రెండు పాటలు బాలన్స్ ఉన్నట్టు టాక్. ఒకవేళ త్రిషకు ధీటైన ఛాయస్ ఎవరు దొరుకుతారో వేచి చూడాలి.