Swetha
ఈ మధ్య కాలంలోనే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి వచ్చి భారీ విజయం సాధించింది. 2015లో విడుదలై సంచలనం సృష్టించిన వీడియో గేమ్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. 15 మిలియన్ డాలర్లతో నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్25న థియేటర్లలోకి వచ్చి.. 52 మిలియన్ డాలర్లు సాధించి పెట్టింది.
ఈ మధ్య కాలంలోనే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి వచ్చి భారీ విజయం సాధించింది. 2015లో విడుదలై సంచలనం సృష్టించిన వీడియో గేమ్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. 15 మిలియన్ డాలర్లతో నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్25న థియేటర్లలోకి వచ్చి.. 52 మిలియన్ డాలర్లు సాధించి పెట్టింది.
Swetha
రొటీన్ గా చూసే కథలకు బ్రేక్ తీసుకుని ఏదైనా డిఫరెంట్ గా చూడాలనుకునే వారు.. కచ్చితంగా ట్రై చేయాల్సిన జోనర్ థ్రిల్లర్ మూవీస్. సస్పెన్స్ థ్రిల్లర్స్ , సర్వైవల్ థ్రిల్లర్స్ అని ఇలా చాలా రకాల మూవీస్ ఉన్నాయి. ఈ క్రమంలో సడెన్ గా ఓ సర్వైవల్ థ్రిల్లర్ ఓటిటి లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ మధ్య కాలంలోనే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి వచ్చి భారీ విజయం సాధించింది. 2015లో విడుదలై సంచలనం సృష్టించిన వీడియో గేమ్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. 15 మిలియన్ డాలర్లతో నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్25న థియేటర్లలోకి వచ్చి.. 52 మిలియన్ డాలర్లు సాధించి పెట్టింది.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఓ హంతకుడు మెలని అనే యువతికి హత్య చేస్తాడు. కొన్నాళ్ళకు మెలని చెల్లి క్లోవర్ తన అక్క కనిపించడం లేదని స్నేహితులతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్తుంది. అక్కడకి వెళ్లిన తరువాత అంతా మిస్టీరియస్ గా ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో వారు అనుకోకుండా టైం లూప్ లో చిక్కుకుపోతారు. ఆ తర్వాత ఓ సైకో కిల్లర్ వారిని చంపడం, వెంటనే వాళ్ళు బ్రతికి రావడం ఇదే పదే పదే జరుగుతుంది. వారు ఆ టైం లూప్ లో ఎలా చిక్కుకున్నారు ? ఆ లూప్ లో నుంచి బయటకి రాడానికి ఎలాంటి పనులు చేశారు ? చివరకు బయటకు వచ్చారా లేదా ? మెలనీ ని హత్య చేసింది ఎవరు ? చివరకు ఏమైంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఈ సినిమా పేరు అంటిల్ డాన్ . ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడు భాషల్లోనూ ఈ మూవీ అందుబాటులో ఉంది. కానీ ప్రస్తుతానికి రెంటల్ పద్దతిలోనే ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. హర్రర్ థ్రిల్లర్ ఇష్టపడే వారికి ఈ మూవీ ఫుల్ మీల్స్ పెడుతుంది. కాబట్టి ఈ వీకెండ్ ఎంచక్కా ఈ సినిమాపై ఓ లుక్ వేసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.