iDreamPost
iDreamPost
జనసేన కోసం సినిమాలను రెండేళ్ళు పక్కనపెట్టిన పవన్ కళ్యాణ్ ఒకేసారి రెండు ప్రాజెక్ట్స్ ఓకే చెప్పేసి వాటి షూటింగులు మొదలుపెట్టిన ఆనందం ఇంకా తడిగా ఉండగానే అభిమానులకు మరో కిక్ న్యూస్ ఇస్తూ పవర్ స్టార్ 28 వ సినిమా కూడా సెట్స్ పైకి రాబోతోంది. ట్విట్టర్ ద్వారా అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. ఇది ఇంకా క్రేజీ కాంబినేషన్ అని చెప్పొచ్చు.
కారణం పవన్ కెరీర్ బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్స్ లో ఫస్ట్ ప్లేస్ లో నిలిచే గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ దీన్ని టేకప్ చేయబోతుండటమే. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ ని రామ్ చరణ్ తో నిర్మించిన మైత్రి మూవీ మేకర్ స్ సంస్థ దీన్ని సెట్ చేసుకోవడం మరో విశేషం. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొదలయ్యిందని పింక్ రిమేక్ , క్రిష్ సినిమాలు పూర్తి చేసాక ఇది వెంటనే షూటింగ్ మొదలుపెట్టుకుంటుందని తెలిసింది.
ఈ లెక్కన రెండేళ్ళలో పవన్ కనీసం మూడు సినిమాలు విడుదలయ్యేలా ప్లానింగ్ తో ఉన్నట్టు కనిపిస్తుంది. హరీష్ శంకర్ అంటే పవన్ ఫ్యాన్స్ కి ప్రత్యేకమైన అభిమానం. తమ హీరో బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టు మ్యానరిజంని సెట్ చేసి గూస్ బంప్స్ ఇచ్చిన దర్శకుడిగా అతని మీద మంచి గురి ఉంది. దాని తర్వాత హరీష్ శంకర్ సైతం గబ్బర్ సింగ్ ని మించే భారీ హిట్ ఇవ్వలేకపోయాడు. ఇప్పుడు మళ్ళి తన అభిమాన హీరో దొరికాడు కాబట్టి ఇంకే స్థాయిలో విశ్వరూపం చూపిస్తాడో వేరే చెప్పాలా. హీరొయిన్, టెక్నికల్ టీం ఇతర వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇది ఏ జానర్ సినిమా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.