iDreamPost
android-app
ios-app

ప్రొడ్యూసర్స్ కి అండగా హీరోలు..

  • Published Jun 04, 2025 | 5:42 PM Updated Updated Jun 04, 2025 | 5:42 PM

Pawan Kalyan, Siddhu Jonnalagadda: సినిమా అనుకున్న టైం లో రిలీజ్ అయ్యి .. అనుకున్న టాక్ కలెక్షన్స్ వస్తే ఓకే అంతా బాగానే ఉంటుంది. కానీ ఒకవేళ సినిమా అనుకున్న సమయానికి రాకపోయినా , టాక్ కాస్త అటు ఇటుగా వచ్చినా కూడా ముందు నష్టపోయేది నిర్మాతలు. వాళ్ళ తిప్పలు అన్ని ఇన్ని కావు.

Pawan Kalyan, Siddhu Jonnalagadda: సినిమా అనుకున్న టైం లో రిలీజ్ అయ్యి .. అనుకున్న టాక్ కలెక్షన్స్ వస్తే ఓకే అంతా బాగానే ఉంటుంది. కానీ ఒకవేళ సినిమా అనుకున్న సమయానికి రాకపోయినా , టాక్ కాస్త అటు ఇటుగా వచ్చినా కూడా ముందు నష్టపోయేది నిర్మాతలు. వాళ్ళ తిప్పలు అన్ని ఇన్ని కావు.

  • Published Jun 04, 2025 | 5:42 PMUpdated Jun 04, 2025 | 5:42 PM
ప్రొడ్యూసర్స్ కి అండగా హీరోలు..

చాలా మంది హీరోలు ఓ సినిమా ఒప్పుకున్నామా నటించామా దానికి తగిన రెమ్యునరేషన్ తీసుకున్నామా అని అన్నట్టు ఉంటారు. దానిలో తప్పేమి లేదు. సినిమా అనుకున్న టైం లో రిలీజ్ అయ్యి .. అనుకున్న టాక్ కలెక్షన్స్ వస్తే ఓకే అంతా బాగానే ఉంటుంది. కానీ ఒకవేళ సినిమా అనుకున్న సమయానికి రాకపోయినా , టాక్ కాస్త అటు ఇటుగా వచ్చినా కూడా ముందు నష్టపోయేది నిర్మాతలు. వాళ్ళ తిప్పలు అన్ని ఇన్ని కావు. ఎన్నో ఆశలు పెట్టుకుని కోట్లు ఖర్చుపెడతారు కానీ చివరికి ఫలితం లేకపోతే ఉన్నది కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇండస్ట్రీలో ఇలాంటి సంగతులు కోకోల్లలు. అడపా దడపా జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అవ్వాలన్న గ్యారెంటీ ఏమి లేదు కద.

అయితే రీసెంట్ గా హరి హర వీరమల్లు సినిమా విషయంలో ఎలాంటి వాదనలు వినిపిస్తున్నాయి తెలియనిది కాదు. కొన్నేళ్లుగా అది పోస్ట్ పోన్ అవుతూనే వస్తుంది. దీనితో నిర్మాత ఏఎం రత్నంకు .. హరి హర వీరమల్లు కోసం తానూ తీసుకున్న అడ్వాన్స్ పదకొండు కోట్లను వెనక్కు ఇవ్వాలని పవన్ నిర్ణయించుకున్నాడట. ఈ న్యూస్ ఏఎం రత్నంకు పెద్ద రిలీఫ్ కానుంది. ఇక పవన్ కంటే ముందే సిద్దు జొన్నలగడ్డ కూడా తన జాక్ మూవీ వలన నష్టపోయిన నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ కు.. సిద్ధూ తాను తీసుకున్న రెమ్యునరేషన్ లో సగానికి పైగా వెనక్కు ఇచ్చేశాడట. ఈ రెండు సంఘటనల గురించి అఫీషియల్ అనౌన్సుమెంట్స్ అయితే ఇంకా రాలేదు. కానీ ఓ రెండు రోజుల్లో ఈ లాంఛనం జరగనుందని తెలుస్తుంది.

ఇలా జరగడం ఇది మొదటి సారి ఏమి కాదు.. జానీ టైంలో పవన్ కళ్యాణ్, బాబా అప్పుడు రజనీకాంత్ ఇలా రెమ్యునరేషన్స్ లో కొంత భాగాన్ని వెనక్కు ఇచ్చేశారని.. అప్పట్లో మీడియాలో హల్చల్ చేశారు. హీరోలు తమ వంతు బాధ్యతగా ఇలా చేయడం చాలా మెచ్చుకోతగ్గ విషయం. ఎందుకంటే ఇలాంటి చర్యల ద్వారా వారికి ధైర్యాన్ని ఇస్తే.. వారు మరిన్ని సినిమాలు తీయడానికి ముందుకు వస్తారు. ఇలా సరైన సమయంలో సాయం అందక ఇండస్ట్రీకి దూరమైన నిర్మాతలు ఎంతో మంది ఉన్నారు. ఒకవేళ హీరోలు కనుక ఇలా కష్టసమయాలలో ఆదుకుంటే టాలీవుడ్ ఇంకాస్త అభివృద్ధి చెందడం ఖాయం. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.