iDreamPost
android-app
ios-app

పవన్ 3 సార్లు చూశారంటే ఇక బొమ్మ అదుర్స్ ! పైగా..

  • Published Jun 07, 2025 | 2:37 PM Updated Updated Jun 07, 2025 | 2:37 PM

Hari Hara Veeramallu: ఒకటి రెండు కాదు ఏకంగా ఐదేళ్ల బట్టి ఈ కల కలలాగే ఉంది. తీరా ఇంకో వారంలో అయినా వస్తుంది అని ఆనందించేలోపే ఫ్యాన్స్ కు నిరాశ తప్పలేదు. ఇంకా నెక్స్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది కూడా అనౌన్స్ చేయలేదు మేకర్స్ . సరే ఇదంతా తెలిసిన భాగవతమే. అసలు మ్యాటర్ ఏంటంటే

Hari Hara Veeramallu: ఒకటి రెండు కాదు ఏకంగా ఐదేళ్ల బట్టి ఈ కల కలలాగే ఉంది. తీరా ఇంకో వారంలో అయినా వస్తుంది అని ఆనందించేలోపే ఫ్యాన్స్ కు నిరాశ తప్పలేదు. ఇంకా నెక్స్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది కూడా అనౌన్స్ చేయలేదు మేకర్స్ . సరే ఇదంతా తెలిసిన భాగవతమే. అసలు మ్యాటర్ ఏంటంటే

  • Published Jun 07, 2025 | 2:37 PMUpdated Jun 07, 2025 | 2:37 PM
పవన్ 3 సార్లు చూశారంటే ఇక బొమ్మ అదుర్స్ ! పైగా..

అన్ని బావుంటే ఇప్పటికి హరి హర వీరమల్లు ట్రైలర్ రావడం.. మూవీ టీం బిజీ బిజీగా ప్రమోషన్స్ చేయడం .. ఫ్యాన్స్ హంగామా ఇలా సందడిగా ఉండేది. కానీ తానొకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తాడు అన్నట్లు వీరమల్లు రిలీజ్ కు ఇంకా సమయం ఆసన్నం అవ్వలేదేమో అనిపిస్తుంది. ఒకటి రెండు కాదు ఏకంగా ఐదేళ్ల బట్టి ఈ కల కలలాగే ఉంది. తీరా ఇంకో వారంలో అయినా వస్తుంది అని ఆనందించేలోపే ఫ్యాన్స్ కు నిరాశ తప్పలేదు. ఇంకా నెక్స్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది కూడా అనౌన్స్ చేయలేదు మేకర్స్ . సరే ఇదంతా తెలిసిన భాగవతమే. అసలు మ్యాటర్ ఏంటంటే

తాజాగా జ్యోతికృష్ణ ఓ వేడుకలో ఈ సినిమా గురించి మాట్లాడారు. పవన్ ఆల్రెడీ ఈ సినిమాను మూడు సార్లు చూసి గంటసేపు మెచ్చుకున్నారట. అంతే కాకుండా తనతో మరోసినిమా చేయాలని ఉందని కూడా అన్నారట. దీనితో టాలెంట్ ను గుర్తించడంలో ఆయన తర్వాతే ఎవరైనా అంటూ జ్యోతికృష్ణ ఆయనను పొగడ్తల వర్షంలో ముంచేశారు. అసలు నిజంగా పవన్ కు ఈ మూవీ మూడుసార్లు చూసేంత తీరిక ఉందా అనే లాజిక్ పక్కనపెడితే.. ఒకవేళ అదే నిజం అయితే ఇక థియేటర్స్ లో సినిమాకు తిరుగులేదని చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ ఎప్పుడు ఒకే సినిమాకు అంత టైం కేటాయించిన దాఖలాలు ఎక్కడా లేవు. పైగా సినిమాలో హైలైట్ల గురించి మాట్లాడుతూ.. పవన్ కొన్ని నెలల కిందట కాకినాడలో అన్న ‘సీజ్ ద షిప్’ డైలాగ్‌ను తలపించే ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను ఈ సినిమాలో ఉన్నట్లు కూడా ఆయన చెప్పారు.

సినిమా రిలీజ్ ఆలస్యం అవుతుంది కాబట్టి.. ఫ్యాన్స్ ని ఉత్సాహపరచడానికి అలా చెప్పారో. లేదా నిజంగానే పవన్ సినిమా అంతలా మెచ్చుకున్నారో తెలియదు కానీ.. ఫ్యాన్స్ మాత్రం ఈ మాటకు ఖుషి అయ్యారు. ఎందుకంటే మూవీ బడ్జెట్ ఏకంగా 250 కోట్లు పైగానే దాటిందట. అదంతా రికవరీ అవ్వాలంటే రెస్పాన్స్ అదే రేంజ్ లో ఉండాలి. సరే కాస్త లేట్ అయితే అయింది కానీ.. రికవరీ బావుంటే చాలనేది అందరి కోరిక. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.